Moola Nakshatra: మూలా నక్షత్రంలో పుట్టిన భార్యాభర్తలకు కలిసొచ్చే ఇంటి సింహద్వారం ఏంటో తెలుసా..? అసలు ఒకే నక్షత్రంలో పుట్టిన వ్యక్తులకు ఎప్పటికీ పెళ్లి చేయకూడదని శాస్త్రం చెప్తుందని పండితులు అంటున్నారు. పైగా మూల నక్షత్రం అంటేనే ఇంకా భయపడిపోతుంటారు. అటువంటిది మూలా నక్షత్రంలో పుట్టిన అమ్మాయి, అబ్బాయి తెలిసో తెలియకో పెళ్లి చేసుకుంటే వారి జీవితం ఎలా ఉంటుంది. పండితులు చెప్పినట్టు మూలా నక్షత్రంలో పుట్టిన వారు అష్టకష్టాలు పడాల్సిందేనా..? మూలా నక్షత్రపు అమ్మాయి వల్ల అత్తగారింట్లో ఎవరెవరికి గండాలు ఉంటాయి. ఇక మూలా నక్షత్రంలో పుట్టిన అబ్బాయి వల్ల తాను పెళ్లి చేసుకున్న అమ్మాయి తల్లిదండ్రులకు ఎలాంటి గండాలు ఉంటాయి. ముఖ్యంగా వాళ్లు ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటికి సింహద్వారం ఏ దిక్కుకు ఉండాలి. సింహ ద్వారం వాస్తు విరుద్దంగా ఉంటే ఆ ఇంట్లో జరిగే పరిణామాలెలా ఉంటాయి. ఇలాంటి అసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒకే నక్షత్రంలో పుట్టిన వారు పెళ్లి చేసుకోవడం నిషిద్దం అంటున్నారు జ్యోతిష్య పండితులు. అయితే ఈ కాలంలో చాలా మంది జాతకాలు, ముహూర్తాలు చూసుకోవడం కన్నా అమ్మాయి, అబ్బాయి ఇష్టపడితే పెళ్లిళ్లు చేసేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అమ్మాయిలు, అబ్బాయిలు ప్రేమించుకున్నాక వాళ్లు ఏ మూహూర్తాలు చూడటం లేదు.. ఎటువంటి జాతకాలు తెలుసుకోవడం లేదు. అలాంటి వాళ్లు ఇంట్లో వాళ్లు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకుంటున్నారు. అటువంటప్పుడు ఆ ఇద్దరిది మూలా నక్షత్రం అయతే వారి జీవితం ఎలా ఉంటుంది. వారి ఉండే ఇంటి సింహ ద్వారం ఎలా ఉండాలి లాంటి విషయాలు తెలుసుకుందాం.
మూలా నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు అతి శక్తిమంతులై ఉంటారు. అసాధారణ ప్రతిభాపాటవాలు కలిగి ఉంటారు. వీరికి దైవ జ్ఞానము ఎక్కువ ఉంటుంది. ఈ జాతకులు భవిష్యత్ ను వాస్తవానికి దగ్గరగా ఊహించి చెప్పగలరు. అనర్గలముగా మాట్లాడే ప్రతిభా వీరిలో పుట్టుకతోనే వస్తుంది. ఎంతటి విషయాన్నైనా సరళంగా వివరించగల తెలివితేటలు వీరి సొత్తు. ఈ నక్షత్ర జాతకులు నమ్మిన సిద్ధాంతములకు కట్టుబడి ఉంటారు. అన్యాయం.. అక్రమాలను సహించలేరు. కానీ ఈ జాతకులకు కొంచెం గర్వం, అహంభావం ఉంటాయి. పుట్టినప్పుడు సామాన్య కుటుంబంలో పుట్టినా.. పట్టుదలతో, స్వయంకృషితో జీవితంలో ఎదిగే ప్రయత్నం చేస్తారు. ఒక్కోక్క మెట్టు ఎక్కుతూ అభివృద్ధి వైపు సాగిపోతారు. అభివృద్ధి, ఆధిపత్యమే ఈ జాతకుల లక్ష్యం. ఆర్ధిక వ్యవహారాలు నిర్మొహమాటంగా నడిపిస్తారు.
అలాంటి మూలా నక్షత్రం జాతకులు ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకుని జీవించడం అనేది చాలా సందర్బాలలో మంచిది కాదని చెప్తున్నారు పండితులు. ఒకే వరలో రెండు కత్తులు ఎప్పటికీ ఇమడవు అనేది ఎంతటి నిజమో ఈ మూలా నక్షత్ర జాతకులు జీవిత భాగస్వాములుగా సుఖపడలేరనేది పండితులు వాదన. అయితే అతి తక్కువ సందర్బాలలో మాత్రమే వీరిద్దరూ సంతోషంగా ఉంటారట. ఇద్దరి జాతకంలో నక్షత్రాధిపతి శుభ దృష్టితో చూస్తే మాత్రం ఈ జాతకులు ఇద్దరు అన్యోన్యంగా కలిసి ఉంటారట పైగా ఇద్దరూ కలిసి ఆధ్యాత్మిక ప్రపంచంలో బతుకుతారట. అదే నక్షత్రాధిపతి అశుభ దృష్టితో చూసినప్పుడు ఇద్దరి మధ్య గొడవలు, అనారోగ్య సమస్యలు, భర్తకు కానీ భార్యకు కానీ దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశం ఉంటుందట.
ఇక మూలా నక్షత్ర జాతకులు పెళ్లి చేసుకున్నా.. వాళ్లు నివసించే ఇంటి సింహ ద్వారం ఉత్తర వ్యాయవ్యంలోని పడమర దిక్కుకు ఉండాలి. దీని వల్ల వీరికి కొంత ఉపశమనం కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు. అయితే మొత్తంగా నక్షత్ర బలాల ఆధారంగా కాకుండా వారి జన్మ జాతకం ఆధారంగానే పూర్తి ఫలితాలు తెలుసుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు.
పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.