ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన 2026 మేషరాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. వ్యాపారస్తులకు పోటీ ఎక్కువగా ఉంటుంది. శని, గురు దానాలు చేయడం వలన శుభ ఫలితాలు పొందవచ్చు. ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4
ఈ నెలలో ప్రయాణాలు అధికంగా చేయాల్సి వస్తుంది. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. అనారోగ్య సమస్యలు వచ్చినా వెంటనే తగ్గిపోతాయి.
ఈ నెలలో ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో స్థిరత్వం వస్తుంది. మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖర్చులు ఎక్కువగా చేయకుండా నియంత్రించుకోవడం ముఖ్యం. వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
ఈ నెలలో ఈ రాశి వారికి ముఖ్యమైన పనులందు అడ్డంకులు, పోటీ ఎక్కువగా ఉంటాయి. చర్మ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలగడం మంచిది. ఆర్థికంగా మిశ్రమం, జాగ్రత్త అవసరం. కొన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఈ నెలలో ఈ రాశి వ్యాపారులు సరైన నిర్ణయాలు తీసుకుంటే లాభాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు లబిస్తాయి. పరీక్షల్లో విజయం సాదిస్తారు. ఆర్థిక లాభాలు మెరుగుపడి ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.
ఈ నెలలో ఈ రాశి వారికి ఉద్యోగ వ్యవహారాలలో స్థిరత్వం ఉంటుంది. వ్యాపార లాభాలతో వృద్ధిలోకి వస్తాయి. నూతన అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బందు మిత్రుల సహాయం సహకారాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలం ఉంటుంది.
ఈ నెలలో ఈ రాశి వారికి వ్యాపారంలో స్థిరత్వం పెరుగుతుంది. ప్రయాణాలు శుభఫలాలు ఇస్తాయి. ఆర్థికంగా ఖర్చులు నియంత్రణ చేయాలి. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి.
ఈ నెలలో ఈ రాశి వారు ఖర్చులు అదుపులో ఉంచడం మంచిది. కుటుంబ సభ్యులతో పుణ్య క్షేత్రం దర్శనాలు చేస్తారు. వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాలలో మార్పులు అనుకూలంగా ఫలిస్తాయి. కీలక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం.
ఈ నెలలో ఈ రాశి విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలు పొందుతారు. పరీక్షల్లో ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి మంచిది. ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. ఉద్యోగ వాతావరణం బాగుంటుంది. ఆర్థికంగా హెచ్చుతగ్గులు ఉంటాయి.
ఈ నెలలో ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో మార్పులు వస్తాయి, వ్యాపారాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక కొంత ఇబ్బంది ఉన్న రుణాలు తీర్చే అవకాశం ఉన్నది. సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. నూతన వాహన లాభాలు ఉంటాయి.
ఈ నెలలో ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఇంట బయట కొంత సమస్యలు తప్పవు. కొన్ని వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థుకు ఇంకొంత శ్రమ తప్పదు.
ఈ నెలలో ఈ రాశి వారికి గృహమున శుభాకార్యములు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలు స్థిరంగా ఉంటాయి. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.
ఈ నెలలో ఈ రాశి వారికి అన్ని వ్యవహారాలు అనుకూలిస్తాయి. క్రయ విక్రయ పనులు అనుకూలిస్తాయి. ఆర్థికంగా కొంత అనుకూలం. ఉద్యోగమున పదోన్నతులు ఉంటాయి. ఆరోగ్యం బాగుంది. శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి.