E-Paper
Advertisement

Yearly Horoscope: 2026 ధనస్సు రాశి ఫలితాలు

Yearly Horoscope: 2026 ధనస్సు రాశి ఫలితాలు
Advertisement

Yearly Horoscope :

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన 2026 ధనస్సు రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం  వృత్తి వ్యాపారాలలో మంచి మార్పులను చూస్తారు. ఆర్థికపరంగా బాగుంటుంది. కొత్త ప్రాజెక్టులతో సక్సెస్  అందుకుంటారు. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.  ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుని విజయాలను అందుకుంటారు. భూ, వాహన కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో చిన్నపాటి ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.  ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6.

జనవరి:

ఈ నెలలో ఈ రాశి వారికి ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. మనసు కొంచెం అస్థిరంగా ఉంటుంది. అనుకున్న పనులు ఆలస్యంగా సాగినా ప్రయత్నం వదలకపోతే ఫలితం ఉంటుంది. కుటుంబంలో మాటల వల్ల చిన్న అపార్థాలు రావచ్చు. 

ఫిబ్రవరి :

Advertisement

ఈ నెలలో ఈ రాశి వారికి ప్రయాణాలు లాభకరంగా ఉంటాయి. ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త ఆలోచనలు వస్తాయి. మాటలతో పనులు సాధించే యోగం ఉంది. సోదరులతో సంబంధాలు మెరుగుపడతాయి. కానీ ఆరోగ్యం విషయంలో అలసట కనిపించవచ్చు.

మార్చి:

ఈ నెలలో ఈ రాశి వారికి తల్లి ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం. మనసులో ఉన్న ఆందోళనలు తగ్గుముఖం పడతాయి. ఆస్తి, వాహనం లేదా గృహ సంబంధిత ఆలోచనలు ముందుకు వస్తాయి. ఆర్థికంగా నెమ్మదిగా స్థిరత్వం ఏర్పడుతుంది.

ఏప్రిల్:

Advertisement

ఈ నెలలో ఈ రాశి వారికి ధన వ్యవరాలలో స్పష్టత రావాలి. సంతానం విషయంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది. చదువు, పరీక్షలు, పోటీ అంశాల్లో అనుకూలత ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు కొంత నష్టం కలిగించవచ్చు.

మే :

ఈ నెలలో ఈ రాశి వారికి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగిన గుర్తింపు ఆలస్యంగా వచ్చినా నిరాశ పడనవసరం లేదు. ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు.

జూన్ :

ఈ నెలలో ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో మాటపట్టింపులు రావచ్చు కాబట్టి సహనం అవసరం. వివాహ ప్రయత్నాలు లేదా భాగస్వామ్య విషయాలు చర్చకు వస్తాయి. వ్యాపారంలో ఒప్పందాలు జాగ్రత్తగా చేయాలి.

జూలై:

ఈ నెలలో ఈ రాశి వారికి  రుణాలు, వివాదాలు తగ్గుముఖం పడతాయి. శత్రువులపై విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో స్థిరత్వం కనిపిస్తుంది. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది.

ఆగస్టు:

ఈ నెలలో ఈ రాశి  వారు దూర ప్రయాణాలు, విదేశీ సంబంధిత అవకాశాలు వస్తాయి. గురువులు, పెద్దల సలహాలు ఉపకరిస్తాయి. అదృష్టం కొంత మేరకు సహకరిస్తుంది. ఖర్చులు పెరిగినా ఉపయోగకరమైనవే అవుతాయి.

సెప్టెంబర్:

ఈ నెలలో ఈ రాశి వారికి ఉద్యోగం లేదా వ్యాపారంలో మార్పుల ఆలోచనలు వస్తాయి. అధికారులతో సంబంధాలు జాగ్రత్తగా నిర్వహించాలి. పేరు ప్రతిష్ఠ విషయంలో శ్రద్ధ అవసరం.

అక్టోబర్:

ఈ నెలలో ఈ రాశి వారికి గతంలో చేసిన ప్రయత్నాలకు ఫలితం దక్కే అవకాశం ఉంది. మిత్రుల సహకారం లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరిగే సూచనలు ఉన్నాయి. సామాజిక గౌరవం పెరుగుతుంది.

నవంబర్:

ఈ నెలలో ఈ రాశి వారికి మనసు కొంచెం ఒత్తిడిగా ఉన్నా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. అవసరంలేని మాటలు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

డిసెంబర్:

ఈ నెలలో ఈ రాశి వారికి ఆర్థికంగా మెరుగైన స్థితి కనిపిస్తుంది. కొత్త పనులు ప్రారంభించేందుకు అనుకూల సమయం. కుటుంబంలో శుభకార్య సూచనలు ఉన్నాయి. భవిష్యత్తుపై ఆశాభావం పెరుగుతుంది.

ALSO READ: భార్యాభర్తలిద్దరిదీ మూలా నక్షత్రమా..? అయితే మీ ఇంటి సింహద్వారం ఈ దిక్కుకే ఉండాలి లేదంటే అష్ట దరిద్రమే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×