E-Paper
Advertisement

Faridabad Gang Raped: వ్యానులో సామూహిక అత్యాచారం.. ఆ తర్వాత రోడ్డుపై విసిరేసి.. ఫరీదాబాద్‌లో దారుణం

Faridabad Gang Raped: వ్యానులో సామూహిక అత్యాచారం.. ఆ తర్వాత రోడ్డుపై విసిరేసి.. ఫరీదాబాద్‌లో దారుణం
Advertisement

Faridabad Gang Raped: కామంలో కళ్లు మూసుకుపోతున్నారు కామాంధులు. రోడ్డుపై ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు, మృగాళ్లుగా మారిపోతున్నారు కొందరు యువకులు. సభ్య సమాజం తలదించుకునే ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. ఓ మహిళను రెండున్నర గంటలపాటు వ్యాన్‌లో తిప్పుతూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు. ఈ ఘటనలో వారిని పోలీసులు అరెస్టు చేశారు. అసలేం జరిగింది?

హర్యానాలో దారుణం.. రెండున్నర గంటలపాటు

Advertisement

హర్యానాలోని ఫరీదాబాద్ ప్రాంతంలో దారుణమైన ఘటన జరిగింది. సోమవారం అర్ధరాత్రి ఓ మహళకు వ్యాన్‌లో లిఫ్ట్ ఇచ్చారు కొందరు వ్యక్తులు. ఆ తర్వాత రాక్షసుల మాదిరిగా మారిపోయారు. తొలుత వ్యాన్‌ని గుర్గావ్ రోడ్డు వైపు మళ్లించారు. దాదాపు రెండున్నర గంటల పాటు వ్యాన్‌ని వివిధ ప్రాంతాల్లో రోడ్లపై తిప్పుతూ సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.

బాధితురాలు ఎంత వేడుకున్నా పట్టించుకోలేదు, ఆమెపై బెదిరింపులకు దిగారు. మంగళవారం వేకువజామున అంటే మూడు గంటల ప్రాంతంలో ఎస్‌జీఎమ్ నగర్‌లోని రాజా చౌక్ సమీపంలో ఆమెని వ్యాన్ నుంచి బయటకు తోసేశారు. దీంతో బాధిత మహిళ ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావంతో ఉన్న బాధితురాలు తన సోదరికి ఫోన్ ద్వారా ఈ విషయం చెప్పింది.

Advertisement

లిఫ్ట్ అడిగిన పాపానికి వ్యాన్ లో సామూహిక అత్యాచారం

వెంటనే కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని ఆసుపత్రికి తరలించారు. బాధిత మహిళ ముఖానికి వైద్యులు 12 కుట్లు వేశారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి నిలకడగా ఉంది. బాధితురాలు ఇంకా ఆ షాక్‌ నుంచి తేరుకోలేదు. బాధితురాలి సోదరి పోలీసులకు చేసిన ఫిర్యాదులో కీలక విషయాలు ప్రస్తావించింది.

ఘటన జరగడానికి ముందు రోజు అంటే సోమవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఆ మహిళ తనకు ఫోన్ చేసిందని తెలిపింది. తన తల్లితో గొడవ పడ్డానని స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానని చెప్పిందని తెలిపింది. మూడు గంటల్లో ఇంటికి తిరిగి వస్తానని చెప్పిందని పేర్కొంది. చివరకు కామాంధులు చేతిలో అత్యాచారానికి గురైంది.

ALSO READ:  పాదచారులపైకి దూసుకెళ్లిన వాహనం,  ఆ తర్వాత ఏం జరిగింది?

మహిళ ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఫ్యామిలీ సమస్యల నేపథ్యంలో కొద్దిరోజులుగా భర్త నుండి దూరంగా ఉంటోంది. ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే వారు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోలుకున్న తర్వాత బాధితురాలు వాంగ్మూలాన్ని రికార్డ్ చేయనున్నట్లు చెప్పారు పోలీసులు.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×