E-Paper
Advertisement

Yearly Horoscope: 2026 మీన రాశి ఫలితాలు

Yearly Horoscope: 2026 మీన రాశి ఫలితాలు
Advertisement

Yearly Horoscope :

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన 2026 మీన రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

 

Advertisement

మీన రాశి వారికి ఈ సంవత్సరం గురు బలం పెరగడం వల్ల ధైర్యం పెరిగి కొత్త ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి, సోదరుల సహకారం, గృహసంబంధ విషయాలలో ముందడుగు పడుతుంది.  ఖర్చులు, ప్రయాణాలు, మానసిక ఆలోచనలు పెరుగుతాయి. కాబట్టి ఆర్థిక నియంత్రణ అవసరం. కష్టాల మధ్య ఎదుగుదల. అనుభవాల ద్వారా స్థిరమైన ఫలితాలు లభిస్తాయి.  ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2

జనవరి:

ఈ నెలలో ఈ రాశి వారికి  మాటలలో కఠినత తగ్గిస్తే కుటుంబ వాతావరణం మెరుగుపడుతుంది. ఖర్చులు అవసరానికి మించి పెరగకుండా నియంత్రణ అవసరం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శని లగ్నస్థానంలో ఉండటం వల్ల పనుల్లో ఆలస్యం కనిపిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. 

ఫిబ్రవరి :

Advertisement

ఈ నెలలో ఈ రాశి వారికి సన్నిహితులతో దూరం తగ్గుతుంది. చిన్న ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. గురుబలం వల్ల కొత్త ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. అన్నదమ్ములు, సోదరీమణుల సహకారం లభిస్తుంది

మార్చి:

ఈ నెలలో ఈ రాశి వారికి ఇల్లు, వాహనం, భూమి విషయాలలో ఆలోచనలు మొదలవుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. మానసిక ప్రశాంతత కొంత తగ్గినా, పెద్దల అనుగ్రహంతో సమస్యలు పరిష్కార మార్గంలోకి వస్తాయి

ఏప్రిల్:

ఈ నెలలో ఈ రాశి వారికి ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. శ్రమకు తగిన ఫలితం ఆలస్యంగా వచ్చినా నిరాశ చెందవద్దు. గ్రహ ప్రభావంతో శత్రువులు బలహీనపడతారు. రుణాలు తగ్గే సూచనలు కనిపిస్తాయి.

మే :

ఈ నెలలో ఈ రాశి వారికి ధన విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మాటల వల్ల అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ పెద్దల సూచనలు, సలహాలు మేలు చేస్తాయి.

జూన్ :

ఈ నెలలో ఈ రాశి వారికి పని ఒత్తిడి ఎక్కువైనా, ఫలితాలు చేతికి వస్తాయి. ఆరోగ్యం మెరుగుపడే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

జూలై:

ఈ నెలలో ఈ రాశి వారికి వృత్తి పరంగా కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ప్రయాణాలు లాభాన్ని ఇస్తాయి. పని ఒత్తిడి కారణంగా శరీర అలసట కనిపించవచ్చు. విశ్రాంతి అవసరం ఆదాయం స్థిరంగా ఉంటుంది.

ఆగస్టు:

ఈ నెలలో ఈ రాశి  వారికి దాంపత్య జీవితంలో సహనం అవసరం. భాగస్వామితో సుదీర్ఘ చర్చలు వస్తాయి. గ్రహ ప్రభావంతో వివాదాలు తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం పెరుగుతుంది.

సెప్టెంబర్:

ఈ నెలలో ఈ రాశి వారికి ఖర్చులు ఎక్కువవుతాయి. ముఖ్యంగా ప్రయాణాలు లేదా వైద్య వ్యయాలు. ఒత్తిడి వలన ప్రభావంతో నిద్ర లోపం కనిపించవచ్చు. ధ్యానం, ప్రార్థన మానసిక బలాన్ని ఇస్తాయి.

అక్టోబర్:

ఈ నెలలో ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. పాత బాకీలు రావచ్చు. దూరపు బంధు మిత్రుల నుండి మంచి వార్తలు వినే అవకాశం ఉంది. ఇంట్లో ఆనందకర వాతావరణం ఉంటుంది.

నవంబర్:

ఈ నెలలో ఈ రాశి వారికి పని ప్రదేశంలో గుర్తింపు లభిస్తుంది. మీ శ్రమకు గౌరవం దక్కుతుంది. ఆరోగ్యం విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. ధన పరంగా స్థిరత్వం కనిపిస్తుంది.

డిసెంబర్:

ఈ నెలలో ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు లేదా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సహకారం సంపూర్ణంగా లభిస్తుంది. కొత్త ఏడాదికి మంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు.

ALSO READ: భార్యాభర్తలిద్దరిదీ మూలా నక్షత్రమా..? అయితే మీ ఇంటి సింహద్వారం ఈ దిక్కుకే ఉండాలి లేదంటే అష్ట దరిద్రమే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×