E-Paper
Advertisement

Yearly Horoscope: 2026 కుంభ రాశి ఫలితాలు

Yearly Horoscope: 2026 కుంభ రాశి ఫలితాలు
Advertisement

Yearly Horoscope :

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన 2026 కుంభ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

 

Advertisement

కుంభ రాశి వారికి ఈ సంవత్సరం జీవితంలో స్థిరత్వం బాధ్యత పెరిగే అవకాశం ఉంది. మీరు తలపెట్టిన పనులు కూడా విజయవంతం అవుతాయి. మీ శ్రమకు ప్రణాళికాబద్ధమైన పనికి తగిన గుర్తింపు లభిస్తుంది.  సంవత్సరం మధ్యకాలం నుండి ఖర్చులు అకస్మాత్తుగా పెరగవచ్చు. విద్యార్థులు ఏకాగ్రత లోపంతో ఇబ్బందులు పడవచ్చు.  ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ధ వహించాలి.  ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. 

జనవరి:

ఈ నెలలో ఈ రాశి వారికి బాధ్యతలు పెరగడం వల్ల అలసట అనిపిస్తుంది. ప్రారంభంలో పనుల భారం ఎక్కువగా ఉంటుంది. ఆశించిన వేగం లేకపోయినా పనులు ముందుకు సాగుతాయి. ధైర్యంతో ఉంటే నెల చివరికి అనుకూల ఫలితాలు పొందవచ్చు. 

ఫిబ్రవరి :

Advertisement

ఈ నెలలో ఈ రాశి వారికి కుటుంబంలో మాటల వల్ల చిన్న అపార్థాలు రావచ్చు. ఆర్థికంగా కొంత ఊరట కనిపిస్తుంది. ఓర్పుగా వ్యవహరిస్తే సమస్యలు త్వరగా తీరతాయి. గతంలో ఆగిపోయిన పనులు మళ్లీ మొదలవుతాయి.

మార్చి:

ఈ నెలలో ఈ రాశి వారికి కొత్త ఆలోచనలు మనసులో తిరుగుతాయి. ఉద్యోగం లేదా వ్యాపారంలో మార్పు చేయాలనే ఆలోచన వస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్లాలి. ప్రయాణ సూచనలు ఉన్నాయి.

ఏప్రిల్:

ఈ నెలలో ఈ రాశి వారికి అధికారంలో ఉన్నవారికి మంచి పురోగతి ఉంటుంది. సోదరులతో సంబంధాలు మెరుగుపడతాయి. చిన్న లాభాలు కలుగుతాయి. ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.

మే :

ఈ నెలలో ఈ రాశి వారికి గృహమున సుఖసంతోషాలతో ఆనందంగా ఉంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ధన విషయాలలో అవగాహన పెరుగుతుంది. ఇష్టమైన వాటిపై ఖర్చు చేసినా మనసుకు తృప్తి ఉంటుంది.

జూన్ :

ఈ నెలలో ఈ రాశి వారికి కోపం, తొందరపాటు వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మాటల నియంత్రణ చాలా అవసరం. వాహనాలు, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శాంతంగా ఉంటే సమస్యలు తగ్గుతాయి.

జూలై:

ఈ నెలలో ఈ రాశి వారికి ఆదాయం మెరుగుపడుతుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో చేసిన ప్రయత్నాలకు ఇప్పుడు ఫలితం కనిపిస్తుంది.

ఆగస్టు:

ఈ నెలలో ఈ రాశి  వారికి పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆలస్యం వల్ల ఒత్తిడి తప్పదు. ఓర్పుతో కొనసాగితే పరిస్థితి క్రమంగా మీకు అనుకూలంగా మారుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

సెప్టెంబర్:

ఈ నెలలో ఈ రాశి వారికి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. సంతాన విషయాల్లో మనసుకు ఊరట కలుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రశాంతత కోసం పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.

అక్టోబర్:

ఈ నెలలో ఈ రాశి వారికి ప్రయాణాలు, కొత్త పరిచయాలు కలుగుతాయి. సంతాన వివాహ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థికంగా స్థిరత్వం కనిపిస్తుంది.

నవంబర్:

ఈ నెలలో ఈ రాశి వారికి మనసు కొంచెం అస్థిరంగా ఉంటుంది. ఇతరుల మాటలకు ఎక్కువగా స్పందించకుండా జాగ్రత్త ఉండాలి. గుప్త శత్రువులు ఉండే అవకాశం ఉంది. నెమ్మదిగా వ్యవహరిస్తే నష్టం ఉండదు.

డిసెంబర్:

ఈ నెలలో ఈ రాశి వారికి గతంలో చేసిన పనులపై తిరిగి ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్ని విషయాల్లో సర్దుబాటు అవసరం అయినా చివరికి మీకు అనుకూలంగా పరిస్థితులు మారతాయి. ఆదాయం తగినంత ఉండదు అయినా ధనానికి లోటు ఉండదు.

ALSO READ: భార్యాభర్తలిద్దరిదీ మూలా నక్షత్రమా..? అయితే మీ ఇంటి సింహద్వారం ఈ దిక్కుకే ఉండాలి లేదంటే అష్ట దరిద్రమే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×