E-Paper
Advertisement

గుడ్లగూడ ఇంట్లోకి వస్తే అదృష్టమా..? అరిష్టమా..?

గుడ్లగూడ ఇంట్లోకి వస్తే అదృష్టమా..? అరిష్టమా..?
Advertisement

Owl: గుడ్లగూబ ఇంట్లోకి వస్తే అదృష్టమా..? లేక అరిష్టమా..? ఒకవేళ ఇంట్లోకి వస్తే ఏం చేయాలి. అసలు గుడ్లగూడ ఇంట్లోకి రావడం వెనక ఉన్న శాస్త్ర పరిహారాలు ఏంటి..? అసలు గుడ్లగూబకు వాస్తుశాస్త్రానికి ఉన్న రిలేషన్‌ ఏంటి.. లాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా గుడ్లగూడ ఇంట్లోకి రావడం గురించి మన సమాజంలో రకరకాల నమ్మకాలు ఉన్నాయి. పురాణాలు, వాస్తు శాస్త్రం మరియు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీనికి రెండు రకాల అర్థాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

అదృష్టంగా భావించే వారు (శుభ సూచకం): హిందూ పురాణాల ప్రకారం గుడ్లగూడ లక్ష్మీదేవికి వాహనమట. కాబట్టి, ఇది ఇంట్లోకి రావడం లేదా ఇంటి పరిసరాల్లో కనిపించడం లక్ష్మీ కటాక్షానికి, సంపదకు చిహ్నంగా కొందరు భావిస్తారట అదే విషయం పురాణాల్లో ఉన్నట్టు పండితులు చెప్తున్నారు. అయితే దీపావళి వంటి పర్వదినాల్లో గుడ్లగూడ కనిపిస్తే అది చాలా అదృష్టమని, రాబోయే రోజుల్లో ఆ వ్యక్తికి ఆర్థికంగా పురోగతి చాలా ఉంటుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

ఇక గుడ్లగూబను అరిష్టంగా కూడా బావించే వాళ్లు ఉన్నారట. గుడ్లగూబను అశుభానికి సూచకంగా కూడా చెప్తుంటారట.

Advertisement

అరిష్టంగా ఎందుకు భావిస్తారు: గుడ్లగూడ రాత్రిపూట తిరిగే పక్షి కావడం, భయంకరమైన శబ్దాలు చేయడం వల్ల దీనిని అశుభానికి సంకేతంగా చూస్తారట. కొన్ని ప్రాంతాల్లో ఇది ఇంట్లోకి వస్తే అనారోగ్యం లేదా ఏదైనా కష్టం వస్తుందని భయపడతారట. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం, పక్షులు ఇంట్లోకి వచ్చి గూడు కట్టుకోవడం లేదా చనిపోవడం దోషంగా పరిగణిస్తారట. ముఖ్యంగా గుడ్లగూడ వంటి పక్షులు నివాసముండే ఇళ్లలో ప్రతికూల శక్తి (Negative Energy) పెరుగుతుందని కొందరి నమ్ముతారట.

అధునిక శాస్త్రీయ కోణం: శాస్త్రీయ కోణంలో చూస్తే, గుడ్లగూడలు ఎలుకలు మరియు కీటకాలను తింటాయట. అవి పొలాల్లో ఉండటం వల్ల రైతులకు స్నేహితుల్లా పనిచేస్తాయట. ఇవి పొరపాటున దారి తప్పి లేదా వెలుతురును చూసి భయపడి ఇంట్లోకి వచ్చే అవకాశం ఉందట.

గుడ్లగూడ ఇంట్లోకి వస్తే ఏం చేయాలి: గుడ్లగూడ ఇంట్లోకి వస్తే ఆందోళన చెందకుండా.. అది దారి వెతుక్కుంటూ బయటకు వెళ్లేలా కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలట. శాస్త్రీయ ధృక్కోణంలో ఆలోచించే వారు అయితే మీకు మనసులో అశాంతిగా ఉంటే.. ఇంటిని శుభ్రం చేసి ఇష్టదైవానికి దీపం వెలిగించాలట. లేదా ఇంట్లో ‘పుణ్యాహవాచనం’ లేదా ‘శాంతి పూజ’ చేయించుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని పండితులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా ఏదైనా సంఘటన చూసే దృక్పథాన్ని బట్టి అది అదృష్టమా లేక అరిష్టమా అనేది ఆధారపడి ఉంటుందని..  పక్షులను హింసించకుండా ఇంట్లోంచి పంపించేయడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: జులై లో పుట్టారా..? మీకు 28 ఏండ్లు వచ్చాక ఏం జరుగుతుందో తెలుసా

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×