E-Paper
Advertisement

షోరూమ్‌ లో ఒక్కటి, ఫైనల్ బిల్ లో మరోటి.. కారు కొనాలంటే ఇన్ని ఛార్జీలు చెల్లించాలా?

షోరూమ్‌ లో ఒక్కటి, ఫైనల్ బిల్ లో మరోటి..  కారు కొనాలంటే ఇన్ని ఛార్జీలు చెల్లించాలా?
Advertisement

Car Buying Guide: కారు కొనడం అనేది వినడానికి చాలా ఈజీ అనిపిస్తుంది. కానీ, షోరూమ్‌ లో ఫైనల్ బిల్ చూసి చాలా మంది షాకవుతుంటారు. వెహికల్ ధరతో పాటు రకరకాల పేర్లతో బోలెడు అదనపు ఛార్జీలు యాడ్ చేస్తారు. మొదట ఇవి పెద్దగా అనిపించకపోయినా, మొత్తం కలిపితే లక్షల్లో తేడా వచ్చే అవకాశం ఉంటుంది. వీటిలో కొన్ని ప్రభుత్వ పన్నులు, రిజిస్ట్రేషన్ ఖర్చులు కాగా, మరికొన్ని డీలర్‌ షిప్‌  లు అదనంగా వసూలు చేసే ఛార్జీలు ఉంటాయి. అందుకే కారు కొనుగోలు సమయంలో ప్రతి లైన్‌ ను జాగ్రత్తగా పరిశీలించడం చాలా ముఖ్యం.

⦿  డాక్యుమెంటేషన్ ఫీజు

సాధారణంగా కనిపించే ఛార్జీల్లో డాక్యుమెంటేషన్ ఫీజు మొదటిది. వాహనానికి సంబంధించిన పేపర్ సిద్ధం చేయడం, ప్రాసెస్ చేయడం పేరుతో దీనిని వసూలు చేస్తారు. రాష్ట్రాన్ని బట్టి ఈ మొత్తం మారుతుంది. అలాగే ఫ్యాక్టరీ నుంచి కారును షోరూమ్‌కు తీసుకురావడానికి ఫ్రైట్ ఛార్జ్ కూడా జోడిస్తారు. ఇది కొత్త కార్లలో సాధారణంగా కనిపిస్తుంది.

⦿ రిజిస్ట్రేషన్ ఫీజు

Advertisement

అమ్మకపు పన్ను, టైటిల్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు లాంటి ప్రభుత్వ సంబంధిత ఖర్చులు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది.   కొన్ని రాష్ట్రాల్లో వాహనం విలువ ఆధారంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయి.

⦿  రిజిస్ట్రేషన్ ప్లేట్ ఫీజు

కొత్త రిజిస్ట్రేషన్ ప్లేట్లు తీసుకుంటే అదనపు రుసుము ఉంటుంది. పాత ప్లేట్లు ట్రాన్స్ ఫర్ చేసినా కూడా కొంత ఖర్చు చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని డీలర్లు ఎలక్ట్రానిక్ ఫైలింగ్ ఫీజు పేరుతో పత్రాలను ఆన్‌ లైన్‌ లో సమర్పించడానికి కూడా డబ్బు వసూలు చేస్తారు.

⦿ డీలర్ సర్వీస్ ఫీజు

Advertisement

డీలర్ సర్వీస్ ఫీజు, డీలర్ ప్రిపరేషన్ ఫీజు లాంటి పేర్లతో కూడా అదనపు ఛార్జీలు జోడిస్తారు. కారును శుభ్రం చేయడం, డెలివరీకి సిద్ధం చేయడం వంటి కారణాలు చెబుతారు.

⦿ మార్కప్ ఫీజు

కొన్ని వాహనాలపై మార్కెట్ సర్దుబాటు లేదంటే మార్కప్ పేరుతో అసలు ధర కంటే ఎక్కువ మొత్తం వసూలు చేస్తారు.  ముఖ్యంగా ఎక్కువ డిమాండ్ ఉన్న SUVలు, హైబ్రిడ్, కొత్త మోడళ్లపై ఈ ఫీజు కనిపిస్తుంది. అలాగే వీల్ లాక్స్, టింట్, పెయింట్ ప్రొటెక్షన్ లాంటి యాక్సెసరీలను ముందే అమర్చి వాటికి అధిక ధర వసూలు చేస్తారు.

⦿ ఎయిర్ ఫిల్లింగ్ ఫీజు

VIN ఎచింగ్, పెయింట్ ప్రొటెక్షన్, ఇంటీరియర్ ప్రొటెక్షన్ లాంటి ప్యాకేజీలు కూడా చాలాసార్లు తప్పనిసరిగా చూపిస్తారు. కానీ, ఇవన్నీ నిజంగా అవసరమా? అనే విషయం కొనుగోలుదారుడు తెలుసుకోవాలి. టైర్లలో నైట్రోజన్ నింపడం లాంటి చిన్న విషయాలకు కూడా అదనపు ఛార్జీలు తీసుకుంటారు.

⦿ అదనంగా వీల్- టైర్ ప్రొటెక్షన్ ప్లాన్, ఎక్స్‌ టెండెడ్ వారంటీ, GAP కవరేజ్ లాంటి సర్వీసులను ఫైనాన్స్ సమయంలో సూచిస్తారు. కొన్ని సందర్భాల్లో ఇవి ఉపయోగపడినా, మొత్తం ధరను పెంచే అవకాశం ఉంటుంది.

కారు కొనుగోలు సమయంలో వాహనం ధర మాత్రమే కాకుండా అన్ని అదనపు ఛార్జీలను జాగ్రత్తగా పరిశీలించడం చాలా అవసరం. ప్రతి ఛార్జీ ఎందుకు వసూలు చేస్తున్నారో అడిగి తెలుసుకుంటే అనవసర ఖర్చులను తగ్గించుకోవచ్చు.

Read Also: సెకండ్ హ్యాండ్ కార్లలో ఫేక్ ఎయిర్ బ్యాగ్స్.. అలర్ట్ గా లేకపోతే అంతే సంగతులు!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×