E-Paper
Advertisement

సెకండ్ హ్యాండ్ కార్లలో ఫేక్ ఎయిర్ బ్యాగ్స్.. అలర్ట్ గా లేకపోతే అంతే సంగతులు!

సెకండ్ హ్యాండ్ కార్లలో ఫేక్ ఎయిర్ బ్యాగ్స్.. అలర్ట్ గా లేకపోతే అంతే సంగతులు!
Advertisement

Fake Airbags in Second-Hand Cars: సెకెండ్ హ్యాండ్ కార్ల అమ్మకాల్లో కొత్త మోసం బయటపడింది. ఎయిర్ బ్యాగ్స్ లేకపోయినా, ఉన్నట్లు నమ్మించి అమ్మేస్తున్నారు కొంత మంది వ్యాపారస్తులు. ఈ వ్యవహారం తాజాగా ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఢిల్లీలో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ చాలా పెద్దది. తక్కువ ధరల్లో మంచి కార్లు దొరుకుతాయని చాలామంది అక్కడి నుంచి వాహనాలు కొనడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే, తక్కువ ధర చూసి వెంటనే కొనేయడం మాత్రం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా భద్రతకు సంబంధించిన ఎయిర్ బ్యాగ్స్ విషయంలో చాలా జాగ్రత్త అవసరం అంటున్నారు.

ఫేక్ ఎయిర్ బ్యాగ్స్ తో అమ్మకాలు

అన్ని సెకండ్ హ్యాండ్ కార్లలో ఈ తరహా మోసం ఉంటుందని చెప్పలేం. కానీ, కొన్ని పాత కార్లు, ప్రమాదాలకు గురైన కార్లలో ఎయిర్ బ్యాగ్స్ సరిగా లేకపోవడం తరచుగా కనిపిస్తోంది. కొంతమంది మోసగాళ్లు ప్రమాదంలో డ్యామేజ్ అయిన కార్లను బయటకు కొత్తలా తయారుచేసి అమ్ముతున్నారు. బయటకు చూస్తే కారు బాగానే కనిపిస్తుంది. కానీ. లోపల భద్రతా వ్యవస్థలు పనిచేయకపోవచ్చు.  ముఖ్యంగా ఢిల్లీలోని కరోల్ బాగ్ లాంటి ప్రాంతాల్లో ఇలాంటి మోసాల చాలా వెలుగులోకి వచ్చాయి. ప్రమాదానికి గురైన కార్లలో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోయిన తర్వాత వాటి ప్లేస్ లో కొత్తవి అమర్చాల్సి ఉంటుంది. కానీ, కొందరు ఖర్చు తగ్గించడానికి అసలు ఎయిర్ బ్యాగ్ పెట్టకుండా కేవలం డాష్‌ బోర్డ్ కవర్ మాత్రమే మార్చేస్తారు. పైభాగంలో ‘SRS Airbag’ అని ఫేక్ స్టాంపింగ్ వేస్తారు. కొనుగోలుదారులు కారులో ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయని భావిస్తారు.

సెకెండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు జాగ్రత్త!

Advertisement

ఢిల్లీ నుంచి సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు పూర్తిగా తనిఖీ చెక్ చేయడం చాలా ముఖ్యం. కేవలం షోరూమ్ మాటలు నమ్మకూడదు. కారు ఫైనల్ చేసే ముందు కంపెనీ అధికారిక సర్వీస్ సెంటర్‌ కు తీసుకెళ్లి పూర్తి చెకప్ చేయించాలి. అక్కడ ఎయిర్ బ్యాగ్స్ నిజంగా ఉన్నాయా? ఉంటే సరిగా పనిచేస్తున్నాయా? అన్నది స్కానింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. కారు హిస్టరీ కూడా తప్పనిసరిగా చెక్ చేయాలి. వాహనం గతంలో ఏదైనా పెద్ద ప్రమాదానికి గురైందా? ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఉన్నాయా? లాంటి వివరాలు తెలుసుకుంటే చాలా సమస్యలు ముందే బయటపడతాయి. కొన్ని ఆన్‌ లైన్ ప్లాట్‌ ఫారమ్‌ లు కూడా ఈ వివరాలను అందిస్తున్నాయి.

అన్నింటికంటే ముఖ్యమైన విషయం డాష్‌బోర్డ్‌ ను జాగ్రత్తగా పరిశీలించాలి. ఒకవేళ డాష్‌బోర్డ్ పాతదిలా కనిపించి, ఎయిర్ బ్యాగ్ కవర్ మాత్రం కొత్తగా ఉంటే అనుమామానించాలి. ఫిట్టింగ్ సరిగా లేకపోవడం, కలర్ తేడాలు ఉండటం లాంటి చిన్న విషయాలు కూడా ప్రమాద సూచనలే కావచ్చు. సెకెండ్ హ్యాండ్ కార్లను బ్రోకర్ల ద్వారా కొనుగోలు చేసే బదులు నమ్మకమైన ప్లాట్‌ ఫారమ్‌ల ద్వారా కొనడం మంచిది.  ఢిల్లీలో మంచి సెకండ్ హ్యాండ్ కార్లు దొరకవచ్చు. కానీ, తక్కువ ధర కోసం తొందరపడితే తర్వాత పెద్ద సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

Advertisement

Read Also: 70 కి.మీ స్పీడ్ తో వెళ్తున్న కారులో స్టార్ట్ బటన్ నొక్కితే ఏమవుతుంది? వామ్మో.. అంత డేంజరా?

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×