E-Paper
Advertisement

క్రికెట్ క్రేజ్‌తో నార్త్ ఇండియాను చుట్టేయబోతున్న ‘పెద్ది’ టీమ్.. అసలు ప్లాన్ ఇదే..

క్రికెట్ క్రేజ్‌తో నార్త్ ఇండియాను చుట్టేయబోతున్న ‘పెద్ది’ టీమ్.. అసలు ప్లాన్ ఇదే..
Advertisement

Peddi Promotions: బుచ్చి బాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రాబోతున్న పెద్ది సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూన్ 4న విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ టీం సినిమా ప్రమోషలన్ల జోరును పెంచింది. క్రికెట్ కధాంశంతో రాబోతున్న సినిమా కావడంతో నార్త్ ఇండాయాలో మంచి క్రేజ్ ఉన్న క్రికెటర్ తో ప్రమోషన్లు మెదలు పెట్టాలని మూవీ టీం ప్లాన్ చేస్తుంది. నేటి పోటీ ప్రపంచంలో ఏ రంగంలోనైనా నిలదొక్కుకోవాలంటే పబ్లిసిటీయే ప్రాణం. ముఖ్యంగా రామ్ చరణ్ ‘పెద్ది’ లాంటి ప్రాజెక్టులు తమ బ్రాండ్ వాల్యూని పెంచుకోవడానికి వినూత్న మార్గాలను వెతుకుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ‘నార్త్ ఇండియా’ను టార్గెట్ చేస్తూ ఒక భారీ ఆఫ్‌లైన్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు పెద్ది టీమ్. భారతదేశంలో సినిమా తారలకంటే మిన్నగా క్రేజ్ ఉన్నది ఒక్క క్రికెటర్లకే. అందుకే టీమ్ పెద్ది తమ ప్రమోషనల్ ఈవెంట్‌కు ఒక ప్రొఫెషనల్ ఇండియన్ క్రికెటర్‌ను అతిథిగా ఆహ్వానించింది. ఒక స్టార్ ప్లేయర్ వేదికపై కనిపిస్తే, అది కేవలం ఆ ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా నేషనల్ మీడియా దృష్టిని ఆకర్షిస్తుంది. నార్త్ ఇండియాలో క్రికెట్ అభిమానులు మెండుగా ఉంటారు. వారిని ఆకట్టుకోవడం ద్వారా టీమ్ పెద్ది తన మార్కెట్‌ను సులభంగా విస్తరించుకోవచ్చు.

Read also-Tollywood: ఘనంగా మెహర్ రమేష్ కూతురి నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్!

సస్పెన్స్ లోనే అసలు మజా

Advertisement

“ఆ క్రికెటర్ ఎవరు?” అనే ప్రశ్న ఇప్పుడు అందరినీ వేధిస్తోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్ళా లేక శుభ్‌మన్ గిల్ వంటి యంగ్ స్టార్స్ వస్తున్నారా అనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ప్రమోషన్ కోసం వచ్చేది ఎవరు అన్నదాని కోసం వేచి చూడాల్సిందే. ఇప్పటికే ఈ సినిమా విదేశాల్లో రికార్డు స్థాయి టికెట్లు అమ్మడు పోయాయి. దీంతో ఈ సినిమా అనేక రికార్డులు క్రియేట్ చేస్తుంది. టీమ్ పెద్ది వ్యూహం చూస్తుంటే వారు కేవలం ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో పరిమితం కాకుండా పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడుతున్నట్లు కనిపిస్తోంది. ఒక ప్రముఖ క్రికెటర్ రాకతో మొదలయ్యే ఈ ఆఫ్‌లైన్ ఈవెంట్, ఉత్తర భారత మార్కెట్‌లో పెద్ది జైత్రయాత్రకు నాంది పలుకుతుందో లేదో చూడాలి. అయితే కొన్ని సినీ వర్గాలు మాత్రం ప్రమోషన్లుకు వచ్చేది ఎమ్మెస్ ధొనీ యే అని ప్రచారం జరుగుతుంది. అయితే దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ స్పెషల్ ఈవెంట్ తేదీలు మరియు ఆ స్టార్ క్రికెటర్ వివరాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read also-Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×