E-Paper
Advertisement

2026 బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల.. ఏ వేరియంట్ కాస్ట్ ఎంతంటే?

2026 బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల.. ఏ వేరియంట్ కాస్ట్ ఎంతంటే?
Advertisement

2026 Maruti Brezza Price List Revealed: మారుతి సుజుకి పాపులర్ కాంపాక్ట్ SUV బ్రెజ్జాను సరికొత్తగా అప్ డేట్ చేసి మార్కెట్ లోకి తీసుకొచ్చింది. కొత్త డిజైన్, మరిన్ని ఫీచర్లు, కొత్త టర్బో పెట్రోల్ ఇంజిన్‌ తో ఈ SUV వినియోగదారుల ముందుకు వచ్చింది. ముఖ్యంగా, కొత్త 1.0-లీటర్ టర్బో పెట్రోల్ వేరియంట్‌కు తక్కువ GST వర్తించడంతో దీని ప్రారంభ ధర  రూ.7.40 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. గత మోడల్‌తో పోలిస్తే ప్రారంభ ధర గణనీయంగా తగ్గింది. తాజాగా అన్ని వేరియంట్లకు సంబంధించిన ధరలను విడుదల చేసింది.

ఏ వేరియంట్ ధర ఎంత అంటే?

కొత్త బ్రెజ్జా LXI, VXI, ZXI, ZXI+ అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. పెట్రోల్, CNG, టర్బో పెట్రోల్ ఆప్షన్లతో కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. టర్బో పెట్రోల్ వేరియంట్ ధర రూ.7.40 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, సాధారణ పెట్రోల్ వేరియంట్ రూ.8.30 లక్షల నుంచి లభిస్తుంది. టాప్ ఎండ్ ZXI+ ఆటోమేటిక్ వేరియంట్ ధర సుమారు రూ.13.70 లక్షల వరకు ఉంది.

కొత్త బ్రెజ్జాలో కీలక మార్పులు

Advertisement

డిజైన్ పరంగా పెద్ద మార్పులు లేకపోయినా, ముందు భాగంలో కొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్, కొత్త ఫాగ్ ల్యాంప్ హౌసింగ్, కొత్త 16 అంగుళాల అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో కొత్త బంపర్‌తో SUV మరింతగా ఆకట్టుకుంటుంది. ఇంటీరియర్‌లో కూడా కొన్ని కీలక మార్పులు చేశారు. కొత్త స్టీరింగ్ వీల్ డిజైన్, మెరుగైన సెంటర్ ఆర్మ్‌ రెస్ట్, వెనుక సీట్లకు కొత్త హెడ్‌ రెస్ట్‌ లు, కొత్త క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ అందించారు. 10.1 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, 64 రంగుల అంబియంట్ లైటింగ్, PM 2.5 ఎయిర్ ఫిల్టర్, వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే, వైర్‌ లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, కీలెస్ ఎంట్రీ లాంటి ఫీచర్లు ఉన్నాయి.

భద్రత విషయంలోనూ జాగ్రత్తలు

భద్రత విషయంలో కూడా మారుతి మంచి అప్‌డేట్ ఇచ్చింది. అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌ బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. బ్లైండ్ స్పాట్ వార్నింగ్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ లాంటి అత్యాధునిక భద్రతా సదుపాయాలను కూడా చేర్చింది.  ఈ SUVకి 5 స్టార్ BNCAP సేఫ్టీ రేటింగ్ కూడా లభించింది.

ఇంజిన్, మైలేజ్ గురించి..

Advertisement

103 PS పవర్ ఇచ్చే 1.5 లీటర్ పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్, 88 PS పవర్ ఇచ్చే CNG వెర్షన్, అలాగే కొత్తగా 110 PS పవర్, 170 Nm టార్క్ అందించే 1.0 లీటర్ టర్బో పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ ఉన్నాయి. 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ తో పాటు 1.5 లీటర్ పెట్రోల్‌కు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కూడా లభిస్తుంది. మైలేజ్ పరంగా పెట్రోల్ వేరియంట్ గరిష్టంగా 21.09 kmpl, CNG వెర్షన్ 26.90 km/kg, టర్బో పెట్రోల్ వేరియంట్ సుమారు 20.47 kmpl వరకు ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. కొత్త బ్రెజ్జా టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV 3XO, కియా సోనెట్, స్కోడా కైలాక్, మారుతి ఫ్రాంక్స్, టయోటా టైసర్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కైగర్ లాంటి సబ్ కాంపాక్ట్ SUVలకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Read Also: మహీంద్రా మాస్టర్ ప్లాన్.. ఒకేసారి 5 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

Related News

మహీంద్రా మాస్టర్ ప్లాన్.. ఒకేసారి 5 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

అదిరిపోయే ఫ్యామిలీ స్కూటర్ల ఎంట్రీ.. వీటిలో ఏది బెస్ట్ అంటే?

షాంపూ వాడితే ఫాగ్ మాయం.. కానీ, ఈ తప్పు అస్సలు చేయొద్దు!

కొనుగోలుదారులకు ఎంజీ షాక్.. కామెట్ ఈవీ ధరల పెంపు!

బడ్జెట్‌ లో బెస్ట్ రేంజ్.. రూ.15 లక్షల లోపు టాప్ ఈవీ కార్లు ఇవే!

సింగిల్ ఛార్జ్ తో 200 కిమీ రేంజ్.. భారత్‌ లో బెస్ట్ EV స్కూటర్లు ఇవే!

2026 బ్రెజ్జా Vs హ్యుందాయ్ వెన్యూ.. ఏ SUV కొనడం బెస్ట్?

Big Stories

Advertisement
×