E-Paper
Advertisement

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

2026 Maruti Brezza Facelift Leaked: మారుతి సుజుకి.. పాపులర్ కాంపాక్ట్ SUV బ్రెజ్జా కొత్త లుక్ లో మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. 2026 బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌ ను జూలై 24న అధికారికంగా విడుదల చేయనుంది. అయితే, తాజాగా ఈ వెహికల్ కు సంబంధించిన కీలక వివరాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా కొత్త ఇంజిన్,   అదనపు ఫీచర్లు, డిజైన్ మార్పులతో కొనుగోలుదారుల్లో ఆసక్తిని పెంచుతోంది.

కొత్త ఇంజిన్ తో ఎంట్రీ

ఈసారి బ్రెజ్జాలో కీలక మార్పు కొత్త 1.0 లీటర్ బూస్టర్‌జెట్ టర్బో పెట్రోల్ ఇంజిన్, ఈ ఇంజిన్ గరిష్టంగా 109 bhp పవర్, 170 Nm టార్క్ ఉత్పత్తి చేయనుంది.  ఇంజిన్‌ ను 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌ బాక్స్తో  మాత్రమే అందించే అవకాశం ఉందని సమాచారం. తర్వాత ఆటోమేటిక్ వెర్షన్‌ ను కూడా తీసుకురావచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ను  కూడా కంపెనీ కొనసాగించనుంది. ఈ ఇంజిన్ 98 bhp పవర్, 139 Nm టార్క్ను అందిస్తుంది. దీనితో పాటు 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్ ఆప్షన్స్ కొనసాగనున్నాయి.  వినియోగదారులకు తమ అవసరాలకు తగ్గట్టుగా ఇంజిన్ ఆప్షన్ ను ఎంచుకునే అవకాశం ఉంటుంది.

సరికొత్త ఫీచర్లు

Advertisement

ఫీచర్ల పరంగా కూడా కొత్త బ్రెజ్జాలో పలు మార్పులు కనిపించనున్నాయి. ఎక్స్‌ టీరియర్‌ లో కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్, LED ఫాగ్ ల్యాంప్స్, అండర్‌బాడీ CNG ట్యాంక్ వంటి అప్‌ డేట్లు ఉండే అవకాశం ఉంది. క్యాబిన్‌ లోకి వస్తే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పెద్ద 10.1 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, 64 కలర్స్ యాంబియంట్ లైటింగ్ లాంటి ఆధునిక ఫీచర్లు యాడ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే వీటిలో చాలా వరకు టాప్ వేరియంట్లలో మాత్రమే లభించే అవకాశం ఉంది.

సబ్-4 మీటర్ SUV సెగ్మెంట్ లో గట్టి పోటీ

ఇటీవలి కాలంలో సబ్-4 మీటర్ SUV విభాగంలో పోటీ మరింత పెరిగింది. టాటా నెక్సాన్, మహీంద్రా XUV 3XO, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి ఫ్రాంక్స్, టయోటా టైసర్ లాంటి మోడళ్లు ఇప్పటికే మార్కెట్‌ లో సత్తా చాటుతున్నాయి. త్వరలో మరికొన్ని కొత్త మోడళ్లు కూడా ఈ సెగ్మెంట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఈ నేపథ్యంలో బ్రెజ్జాను మరింత క్రేజీగా మార్చేందుకు మారుతి ఈ అప్‌డేట్లను తీసుకొస్తోంది.

Advertisement

కొత్త టర్బో ఇంజిన్‌ తో పనితీరు మెరుగుపడటంతో పాటు, తాజా ఫీచర్లు కూడా బ్రెజ్జాకు కొత్త ఊపును తీసుకురానున్నాయి. ముఖ్యంగా ఫీచర్లు, పనితీరు, ధర మధ్య బ్యాలెన్స్ కోరుకునే కొనుగోలుదారులకు కొత్త బ్రెజ్జా మరోసారి మంచి ఆప్షన్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాంచ్ అనంతరం ధరలు, పూర్తి వేరియంట్ వివరాలు అధికారికంగా వెల్లడికానున్నాయి.

Read Also: ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

Related News

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

Big Stories

Advertisement
×