E-Paper
Advertisement

2026 Renault Duster: కొత్త రెనాల్ట్ డస్టర్ వచ్చేస్తోంది, బాబోయ్ ఇన్ని ఫీచర్లు ఉన్నాయా?

2026 Renault Duster: కొత్త రెనాల్ట్ డస్టర్ వచ్చేస్తోంది, బాబోయ్ ఇన్ని ఫీచర్లు ఉన్నాయా?
Advertisement

New Generation Renault Duster 2026: రెనాల్ట్ తన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ జెనరేషన్ 2026 రెనాల్ట్ డస్టర్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ఈ కారును లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ ఈ కారు దేశంలో అరంగేట్రం చేయడానికి ముందే  ఈ SUVని టీజ్ చేసింది. రాబోయే మోడల్ డిజైన్ గురించి వెల్లడించింది. దేశంలోని ప్యాసింజర్ వెహికిల్ విభాగంలో గణనీయమైన మార్కెట్ వాటా కోసం రెనాల్ట్ డస్టర్ 2026 బాగా ఉపయోగపడుతుందని రెనాల్ట్ ఇండియా ప్రకటించింది.

2026 రెనాల్ట్ డస్టర్ డిజైన్  

2026 రెనాల్ట్ డస్టర్ పాత మోడల్‌ తో పోలిస్తే పూర్తిగా కొత్త డిజైన్ తో వస్తుంది. ఇది పాత మోడల్ కంటే బోల్డ్‌ గా, మరింత పవర్ ఫుల్ గా కనిపిస్తుంది. డైమెన్షనల్ పరంగా,  4,300 mm పొడవు, 1,800 mm వెడల్పు, 1,600 mm ఎత్తును కలిగి ఉంటుంది. 2026 రెనాల్ట్ డస్టర్ పూర్తిగా రీడిజైన్ చేసిన అందమైన LED హెడ్‌ ల్యాంప్‌లు, కొత్త LED DRL,  LED కనెక్ట్ చేయబడిన టెయిల్‌ లైట్లతో వస్తుంది. C-ఆకారపు టెయిల్‌ ల్యాంప్లను కనెక్ట్ చేసే LED స్ట్రిప్ కొత్త బ్రాండ్ లోగోను కలిగి ఉంటుంది.

Advertisement

ఇక ఫ్రంట్ బంపర్‌ లో పెద్ద ఎయిర్ డ్యామ్‌లు, సర్కిల్ ఫాగ్ ల్యాంప్‌ లతో బాడీ క్లాడింగ్ బాగుంటుంది. బానెట్ స్పోర్ట్స్ స్కల్ప్టెడ్ లైన్లు, ఫ్రంట్ ప్రొఫైల్‌ మంచి లుక్ ను ఇస్తాయి. సైడ్ ప్రొఫైల్ విండో లైన్‌ తో గత డస్టర్‌ మాదిరిగానే కనిపిస్తుంది. నర్వ్స్ తో కూడిన ఫ్రంట్, రియర్ ఫెండర్‌లు, వీల్ ఆర్చ్‌ లు, డోర్‌ల మీదుగా చంకీ క్లాడింగ్, డైమండ్ కట్ అల్లాయ్‌లు SUVకి మంచి అందాన్ని యాడ్ చేస్తున్నాయి.

2026 రెనాల్ట్ డస్టర్ ఫీచర్లు  

2026 రెనాల్ట్ డస్టర్ లోపలి భాగం పూర్తిగా బ్లాక్ థీమ్‌ను కలిగి ఉంది. డ్యూయల్ టోన్ థీమ్ కూడా ఆఫర్‌లో ఉంది. ఈ SUV డాష్‌ బోర్డ్ అంతటా షార్ప్ లేయర్డ్ లుక్‌ ను కలిగి ఉంటుంది. డ్రైవర్ సెంట్రిక్ సెంటర్ కన్సోల్, AC వెంట్స్‌ ను పొందుతుంది.  వైర్‌ లెస్ ఆపిల్ కార్‌ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో వస్తుంది. 10-అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7.0 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌ లెస్ ఛార్జర్, ఆర్కామిస్ 3D ఆడియో సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా సహా పలు ఫీచర్లను కలిగి ఉంటుంది.

2026 రెనాల్ట్ డస్టర్ సేఫ్టీ ఫీచర్లు

Advertisement

భద్రత పరంగా, కొత్త డస్టర్ ADASతో వచ్చిన మొదటి రెనాల్ట్ మోడల్ అవుతుంది.  2026 రెనాల్ట్ డస్టర్ ఆటోమేటిక్ హై, లో బీమ్, క్రూయిజ్ కంట్రోల్, స్పీడ్ లిమిటర్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఫ్రంట్, సైడ్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ వ్యూ కెమెరా లాంటి అనేక భద్రతా ఫీచర్లను కలిగి ఉంటుంది.

2026 రెనాల్ట్ డస్టర్ ఇంజిన్

రెనాల్ట్ డస్టర్ 1.3-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ యూనిట్ తో వస్తుంది. ట్రాన్స్‌ మిషన్ ఎంపికలలో ఆరు స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, CVT యూనిట్ ఉంటాయి. ఆ తర్వాత రెనాల్ట్ రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో జత చేయబడిన 1.6-లీటర్ నాలుగు సిలిండర్ ఇంజిన్‌ తో కూడిన బలమైన హైబ్రిడ్ పవర్‌ ట్రెయిన్‌ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: టాటా పంచ్ vs టాటా నెక్సాన్.. రెండింటిలో ఏది బెస్ట్ అంటే?

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×