E-Paper
Advertisement

BBL Final 2026: ఆరోసారి BBL టైటిల్ గెలుచుకున్న‌ పెర్త్ స్కార్చర్స్..చెన్నై, ముంబై రికార్డులు బ్రేక్‌

BBL Final 2026: ఆరోసారి BBL టైటిల్ గెలుచుకున్న‌ పెర్త్ స్కార్చర్స్..చెన్నై, ముంబై రికార్డులు బ్రేక్‌
Advertisement

BBL Final 2026: బిగ్ బ్యాష్ లీగ్ 2026 టోర్న‌మెంట్ ( Big Bash League 2025-26 ) విజేత‌గా పెర్త్ స్కార్చర్స్ (Perth Scorchers ) నిలిచింది. బిగ్ బ్యాష్ లీగ్ 2026 టోర్న‌మెంట్ ఫైన‌ల్స్ లో పెర్త్ స్కార్చర్స్ వ‌ర్సెస్ సిడ్నీ సిక్సర్స్ ( Perth Scorchers vs Sydney Sixers ) మ‌ధ్య ఇవాళ ఫైన‌ల్ మ్యాచ్ జ‌రిగింది. అయితే, ఇందులో 133 ప‌రుగుల ల‌క్ష్యాన్ని అవ‌లీల‌గా ఛేదించింది పెర్త్ స్కార్చర్స్. దీంతో BBL 2026 టోర్న‌మెంట్ విజేతగా నిలిచింది. ఈ విజ‌యంతో ఆరోసారి బీబీఎల్ టైటిల్ గెలుచుకున్న జ‌ట్టుగా పెర్త్ స్కార్చర్స్ చ‌రిత్ర సృష్టించింది. ఐపీఎల్ లో ఇప్ప‌టి వ‌ర‌కు చెన్నై సూపర్ కింగ్స్‌, ముంబై ఇండియ‌న్స్ ఐదు సార్లు ఛాంపియ‌న్ గా నిలిచాయి. అటు కేకేఆర్ జ‌ట్టు కూడా 3 సార్లు ఛాంపియ‌న్ గా నిలిచింది. కానీ ఆరోసారి ఛాంపియ‌న్ ఏ జ‌ట్టు కాలేదు. కానీ బిగ్ బ్యాష్ లీగ్ టోర్న‌మెంట్ లో ఆరోసారి టైటిల్ గెలుచుకున్న జ‌ట్టుగా పెర్త్ స్కార్చర్స్ రికార్డు సృష్టించింది.

Also Read: Smriti-Palash Muchhal: ప‌లాష్ ముచ్చ‌ల్ బ‌ట్ట‌లిప్పి, చిత‌క్కొట్టిన టీమిండియా క్రికెట‌ర్లు..బెడ్ రూం నుంచి లాక్కొచ్చి మ‌రీ

ఆరోసారి BBL టైటిల్ గెలుచుకున్న‌ పెర్త్ స్కార్చర్స్

Advertisement

బిగ్ బ్యాష్‌ లీగ్ 2026 టోర్నమెంట్ ( Big Bash League 2025-26 ) నేపథ్యంలో ఇవాళ ఫైనల్ మ్యాచ్ పెర్త్ వేదికగా జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో సిడ్నీ సిక్స‌ర్స్ సిక్సర్స్ వర్సెస్ పెర్త్ స్కార్చర్స్ ( Perth Scorchers vs Sydney Sixers ) జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో ఈ మ్యాచ్ లో పెర్త్, టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేసింది. దీంతో సిడ్ని సిక్సర్స్ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ నేపథ్యంలోనే 20 ఓవర్లు ఆడిన సిడ్ని సిక్సర్స్‌ 132 పరుగులకు అలౌట్ అయింది. ఏ ప్లేయర్ కూడా సరిగ్గా రాణించలేదు. స్టీవెన్ స్మిత్ 24 పరుగులు చేయగా జోష్ 24 పరుగులతో రాణించాడు. అటు కెప్టెన్ హెన్రిక్స్ 24 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. మిగిలిన ఎవరూ కూడా రాణించలేదు. ఇక ఈ 133 పరుగుల లక్ష్యాన్ని పెద్ద జట్టు చాలా ఆచితూచి ఆడి, విజయం సాధించింది. 17.3 ఓవర్లు ఆడిన పెర్త్ స్కార్చర్స్ ( Perth Scorchers ), కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి విజయం సాధించింది. ఇక బిగ్ బ్యాష్‌ లీగ్ 2026 ఈ టోర్నమెంట్ ముగిసిన నేపథ్యంలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా డేవిడ్ నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా సామ్ హార్పర్ నిలవడం జరిగింది.

పెర్త్ స్కార్చర్స్ (Perth Scorchers ) ప్రైజ్ మనీ ఎంతంటే ?

బిగ్ బ్యాష్ లీగ్ 2026 టోర్న‌మెంట్ ( Big Bash League 2025-26 ) విజేత‌గా నిలిచిన‌ పెర్త్ స్కార్చర్స్ (Perth Scorchers ) జ‌ట్టుకు $420,000 AUD ఫ్రైజ్ మ‌నీ ద‌క్కే ఛాన్స్ ఉంది. అంటే ఇండియ‌న్ రూపాయ‌ల‌లో 2 కోట్ల‌కు పైగా ద‌క్క‌నుంది.

Advertisement

 

Also Read:  Tanveer Ahmed: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అభిషేక్ శ‌ర్మ సిక్సులు కొడితే, పాకిస్తాన్ వీధుల్లో న‌గ్నంగా తిరుగుతా

 

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×