E-Paper
Advertisement

Tata Punch vs Tata Nexon: టాటా పంచ్ vs టాటా నెక్సాన్.. రెండింటిలో ఏది బెస్ట్ అంటే?

Tata Punch vs Tata Nexon: టాటా పంచ్ vs టాటా నెక్సాన్.. రెండింటిలో ఏది బెస్ట్ అంటే?
Advertisement

టాటా కంపెనీకి చెందిన ఈ రెండు కార్లు మార్కెట్ లో బాగా రాణిస్తున్నాయి. ఈ రెండు కార్లు అత్యంత సురక్షితమైన కాంపాక్ట్ SUVలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. రెండూ 5-స్టార్ గ్లోబల్ NCAP రేటింగ్ ను కలిగి ఉన్నాయి. టాటా పంచ్ సుమారు రూ. 6.13 లక్షల నుంచి ప్రారంభం కాగా, టాటా నెక్సన్ రూ. 8 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ రెండు కార్ల ఫీచర్లు, ఇంజిన్, పనితీరు, డిజైన్ సహా పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

టాటా పంచ్ vs టాటా నెక్సన్ పోలికలు  

⦿ ఇంజిన్, పనితీరు: టాటా పంచ్ 1.2L పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. నెక్సన్ 1.2L టర్బో పెట్రోల్, 1.5L డీజిల్ ఇంజిన్లతో మరింత పవర్ ఫుల్ గా ఉంటుంది.

Advertisement

⦿ ఫీచర్లు: నెక్సన్‌ లో 12.3 అంగుళాల పెద్ద టచ్‌ స్క్రీన్, రియర్ ఏసీ వెంట్స్, జెబిఎల్ సౌండ్ సిస్టమ్ లాంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. పంచ్‌లో 10.25 అంగుళాల స్క్రీన్ ఉంటుంది.

⦿ పరిమాణం, బూట్ స్పేస్: నెక్సన్.. పంచ్ కంటే వెడల్పు, పొడవుగా ఉంటుంది. బూట్ స్పేస్ లోనూ పెద్దది(382 లీటర్లు)గా ఉంటుంది. టాటా పంచ్  366 లీటర్ల బూట్ స్పేస్‌ ను కలిగి ఉంటుంది.

Advertisement

⦿ ధర వివరాలు: పంచ్ తక్కువ బడ్జెట్‌లో లభిస్తుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 6.13 లక్షలుగా ఉంటుంది. నెక్సన్ ప్రీమియం విభాగంలో ఉంటుంది. ప్రారంభ ధర రూ. 8.00 లక్షలుగా ఉంటుంది.

ఏ కారు ఎవరికి బెస్ట్ అంటే?

⦿ టాటా పంచ్ : తక్కువ బడ్జెట్‌ లో సిటీ డ్రైవింగ్ కోసం మైక్రో SUV కావాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.  నెక్సన్ కంటే సుమారు రూ.2.5 నుంచి రూ. 3 లక్షలు తక్కువ ధరకే లభిస్తుంది.  చిన్న సైజులో ఉండటం వల్ల ట్రాఫిక్‌ లో నడపడం, పార్కింగ్ చేయడం ఈజీగా ఉంటుంది. ఎక్కువ గ్రౌండ్ క్లియరెర్స్ ఉండటం వల్ల గుంతల రోడ్డు మీద కూడా చక్కగా ప్రయాణించవచ్చు. నెక్సన్ పెట్రోల్ వేరియంట్ కంటే కొంచెం ఎక్కువ మైలేజీని ఇస్తుంది.

Read Also: టాటా ఆల్ట్రోజ్ vs టాటా టియాగో.. వీటిలో ఏది బెస్ట్ కారు?

⦿ టాటా నెక్సన్

ఒకవేళ మీకు ఎక్కువ పవర్, ఫీచర్లు, హైవే ప్రయాణాలకు అనుకూలంగా ఉండే కారు కావాలనుకుంటే నెక్సన్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. నెక్సన్‌లో టర్బో ఇంజిన్ ఉంటుంది. ఇది హైవేలపై పంచ్ కంటే మెరుగైన వేగాన్ని, పవర్‌ని ఇస్తుంది.  ఇందులో వెంటిలేటెడ్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, పెద్ద టచ్ స్క్రీన్ లాంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే రెండూ 5 స్టార్ రేటింగ్ పొందినప్పటికీ, నెక్సన్‌లో 6 ఎయిర్‌ బ్యాగ్‌లు స్టాండర్డ్‌ గా వస్తాయి.

తక్కువ బడ్జెట్, సిటీ యూసేజ్ అయితే టాటా పంచ్ తీసుకోవడం మంచిది. ఎక్కువ పవర్, లగ్జరీ ఫీచర్లు, హైవే జర్నీలకు అనుకూలంగా ఉండాలంటే టాటా నెక్సన్ తీసుకోండి.

Read Also:  స్కోడా కుషాక్ vs హ్యుందాయ్ క్రెటా.. రెండింటిలో ఏది బెస్ట్ అంటే?

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×