E-Paper

Renault Duster Vs Maruti Suzuki Victoris: 2026 రెనాల్ట్ డస్టర్ vs మారుతి సుజుకి విక్టోరిస్.. వీటిలో ఏది బెస్ట్ కారు అంటే?

Renault Duster Vs Maruti Suzuki Victoris: 2026 రెనాల్ట్ డస్టర్ vs మారుతి సుజుకి విక్టోరిస్.. వీటిలో ఏది బెస్ట్ కారు అంటే?
Advertisement

Renault Duster Vs Maruti Suzuki Victoris Comparison: ఇండియన్ ఆటో మోబైల్ మార్కెట్ లోకి 2026 రెనాల్ట్ డస్టర్, మారుతి సుజుకి విక్టోరిస్ కాంపాక్ట్ SUV విభాగంలో పోటీ పడుతున్నాయి. డస్టర్ రగ్గడ్ బాక్సీ డిజైన్, 4×4 సామర్థ్యంతో అందుబాటులోకి వస్తుండగా, విక్టోరిస్ లేటెస్ట్,  ప్రీమియం ఫీచర్లు, మెరుగైన ఇంధన సామర్థ్యంతో వస్తోంది.

రెనాల్ట్ డస్టర్ vs మారుతి సుజుకి విక్టోరిస్ కీలక తేడాలు 

⦿ ధర వివరాలు: మారుతి విక్టోరిస్ సుమారు రూ. 10.50 లక్షల నుంచి రూ. 19.99 లక్షల వరకు ఉంటుంది. కొత్త డస్టర్ రూ.10 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు అందుబాటులో ఉంటుంది.

Advertisement

⦿ టెక్నాలజీ, ఇన్ఫోటైన్‌మెంట్: డస్టర్ బాక్సీ SUV లుక్, మస్క్యులర్ ప్రొఫైల్, LED లైటింగ్, రూఫ్ రైల్స్‌ తో కఠినంగా ఉంటుంది. విక్టోరిస్ అర్బన్ స్టైల్, పనోరమిక్ సన్‌ రూఫ్, ప్రీమియం లుక్‌ తో వస్తుంది.

రెనాల్ట్ డస్టర్: 10.1 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే ఉంటుంది. గూగుల్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. వైర్‌ లెస్ ఫోన్ ఛార్జింగ్ అవకాశం ఉంటుంది.

Advertisement

మారుతి సుజుకి విక్టోరిస్: ఇందులో 10.1 అంగుళాల టచ్‌ స్క్రీన్, వైర్‌ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ ప్లే ఉంటుంది. ప్రీమియం సౌండ్ సిస్టమ్ ఉంటుంది. రిమోట్ ఫంక్షన్లు ఉంటాయి.

⦿ కంఫర్ట్, కన్వినియెన్స్:  రెనాల్ట్ డస్టర్ లో డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌ రూఫ్, వైర్‌ లెస్ ఛార్జర్, వెంటిలేషన్ తో కూడిన పవర్డ్ సీటు, వెనుక AC వెంట్స్, USB పోర్ట్‌ లు, పవర్డ్ టెయిల్‌గేట్ ఉంటుంది.  మారుతి సుజుకి విక్టోరిస్ లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు, క్రూయిజ్ కంట్రోల్,  వెనుక AC వెంట్స్, 360 వ్యూ కెమెరా, స్మార్ట్ యాక్సెస్, పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది.

⦿ ఇంజిన్, పనితీరు: రెనాల్ట్ డస్టర్, మారుతి సుజుకి విక్టోరిస్ మధ్య ఇంజిన్ సామర్థ్యం, పనితీరులో తేడా ఉంటుంది. డస్టర్ 1.8L స్ట్రాంగ్ హైబ్రిడ్, టర్బో ఇంజిన్‌లతో వస్తుంది.  160 hp వరకు పవర్, మెరుగైన టార్క్ ఇస్తుంది. విక్టోరిస్ 1.5L నేచురల్లీ ఆస్పిరేటెడ్, హైబ్రిడ్ ఇంజిన్‌తో వస్తుంది.  సుమారు 103 PS పవర్, 21 కిమీ మైలేజీని అందిస్తుంది.

⦿ పోటీ: 2026 రెనాల్ట్ డస్టర్, మారుతి సుజుకి విక్టోరిస్ కార్లు హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, టాటా సియెర్రా కార్లకు గట్టి పోటీని ఇస్తాయి.

ఏది ఎవరికి బెస్ట్ అంటే?

డస్టర్ టఫ్ వెహికిల్ గా గుర్తింపు పొందగా, విక్టోరిస్ అరేనా షోరూమ్‌ల ద్వారా అందుబాటులో ఉంటూ, ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంటుంది. మొత్తంగా, స్ట్రాంగ్ SUV ఎక్స్ పీరియెన్స్ కోసం డస్టర్, లేటెస్ట్ ఫీచర్లు, ప్యూయెల్ ఎఫిషియెన్సీ కోసం  విక్టోరిస్ మంచి ఆప్షన్స్ గా చెప్పుకోవచ్చు.

Read Also: అదిరిపోయే మ్యూజిక్, ఆహా అనిపించే విజువల్స్.. వచ్చేస్తోంది కొత్త మహీంద్రా XUV 7XO!

Related News

హీరో సూపర్ ప్లాన్.. ఏకంగా 12 కొత్త మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

బెంజ్ To ఎంజీ.. ఈ ఏడాది లాంచ్ కానున్న క్రేజీ PHEV కార్లు ఇవే!

భారత్‌ లో బెంజ్ ఎస్-క్లాస్ లాంచ్.. ధర ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

కియా సెల్టోస్ vs రెనాల్ట్ డస్టర్.. ఏసీలో ఏ SUV బెటర్?

ఫ్లెక్స్ ఫ్యూయల్ వాగన్ ఆర్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

హీరో ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకులపై క్రేజీ ఆఫర్లు.. ఎన్ని వేలు డిస్కౌంట్ ఇస్తుందంటే!

టయోటా హిలక్స్ స్పై షాట్స్ లీక్, లుక్ అదిరింది భయ్యా!

కవాసకి నింజా బైక్‌లపై భారీ ఆఫర్లు.. ఏకంగా రూ.2.89 లక్షల వరకు తగ్గింపు!

×