E-Paper
Advertisement

Mahindra XUV 7XO: అదిరిపోయే మ్యూజిక్, ఆహా అనిపించే విజువల్స్.. వచ్చేస్తోంది కొత్త మహీంద్రా XUV 7XO!

Mahindra XUV 7XO: అదిరిపోయే మ్యూజిక్, ఆహా అనిపించే విజువల్స్.. వచ్చేస్తోంది కొత్త మహీంద్రా XUV 7XO!
Advertisement

దేశీయ SUV కార్ మేకర్ మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ మహీంద్రా అదిరిపోయే కార్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. అందులో భాగంగానే త్వరలో XUV 7XOను మార్కెట్ కి పరిచయం చేయనుంది. ఇండియాలో ఇప్పటి వరకు ఏ కారులో లేని ప్రత్యేకతలు ఈ కారులో తీసుకురానుంది. అద్భుతమైన ఇన్ కార్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్ పీరియెన్స్ కోసం డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్‌ తో ప్రారంభించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. మహీంద్రా XUV 7XO దేశంలో డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ ఎక్స్ పీరియెన్స్ ను అందించే ఫస్ట్ ఇండియన్ వెహికిల్ గా గుర్తింపు తెచ్చుకోనుంది. డాల్బీ విజన్ మెరుగైన కలర్స్, డాల్బీ అట్మోస్ స్పేషియల్ సౌండ్‌ తో కలిపి, ప్రయాణీకులకు థియేటర్ ఎక్స్ పీరియెన్స్ ను అందించనుంది.

కారులో డాల్బీ విజన్, అట్మోస్ ఎలా పని చేస్తాయంటే?

డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్‌ తో ప్రయాణీకులు విజువల్ డిస్‌ ప్లేలు, సౌండ్ సిస్టమ్స్ లో పూర్తి స్థాయిలో వినోదాన్ని పొందే అవకాశం ఉంటుంది. మహీంద్రా XUV 7XO డాల్బీ అట్మోస్ సపోర్టుతో మల్టీ డైమెన్షనల్ సౌండ్‌ స్కేప్‌ ను పొందే అవకాశం ఉంటుంది. స్పష్టత, డెప్త్ తో క్యాబిన్ చుట్టూ సౌండ్ పరుగులు తీస్తుంది. డాల్బీ అట్మోస్ మ్యూజిక్, సినిమాలు, పాడ్‌ కాస్ట్‌లు సహా అన్ని వీడియోలను చక్కగా ఎక్స్ పీరియెన్స్ చేస్తుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ కలిసి బెస్ట్ ఇన్ కార్ వినోదాన్ని అందిస్తాయి.

Advertisement

వినియోగదారులు గానాలోని డాల్బీ అట్మోస్‌ లో తమకు ఇష్టమైన సంగీతాన్ని ఆస్వాదించగలుగుతారు. అలాగే సోనీ LIVలోని డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్‌ లలో సినిమాలు,  టీవీ షోలతో పాటు,  నేరుగా ఇన్ కార్ ఎంటర్‌టైన్‌ మెంట్ సిస్టమ్‌ లో ఇంటిగ్రేట్ చేయబడుతాయి.  సోనీ LIV తన సినిమాలు, ఒరిజినల్ సిరీస్, లైవ్ స్పోర్ట్స్,  టీవీ కంటెంట్ లైబ్రరీకి ఇన్ స్టంట్ యాక్సెస్ అందిస్తుంది. ఇది ఇండియన్ వెహికిల్ స్థాయిలో పొందుపరచబడిన మొదటి OTT ప్లాట్‌ ఫారమ్‌ గా నిలుస్తుంది.

మహీంద్రా తన ప్రపంచ స్థాయి సాంకేతికను గత కొంతకాలంగా కార్లలో ఇంప్లిమెంట్ చేస్తూనే ఉంది. అందులో భాగంగానే  మహీంద్రా XUV 7XOతో డాల్బీతో తీసుకురానుంది. మహీంద్రా SUV శ్రేణిలో డాల్బీ అట్మోస్ పై ఆధారపడి BE6, XEV 9e, XEV 9S, థార్ ROXX, XUV 3XO అందుబాటులోకి రాగా, మహీంద్రా XUV 7XO డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్‌ తో మార్కెట్ లోకి అడుగు పెట్టబోతోంది.

డాల్బీ విజన్, అట్మోస్ ఇంటిగ్రేషన్ గురించి కంపెనీ ఏం చెప్పిందంటే?   

Advertisement

డాల్బీ విజన్, అట్మోస్ ఇంటిగ్రేషన్ గురించి  మహీంద్రా కీలక విషయాలు వెల్లడించింది. “మహీంద్రా XUV 7XO ప్రారంభం దేశంలో ఆటోమోటివ్ వినోదానికి మరో లెవెల్ కు తీసుకెళ్లబోతోంది. దేశంలో మొదటిసారిగా డాల్బీ విజన్‌ ను కార్లకు తీసుకురావడం ద్వారా, డాల్బీ అట్మోస్‌ తో పాటు, ప్రజలు రోడ్డుపై వినోదాన్ని అనుభవించేలా చేయబోతున్నాం. మహీంద్రాతో కలిసి, మేము కారును అద్భుతమైన విజువల్స్, స్పేషియల్ సౌండ్‌ ను అందించే వినోద ప్రదేశంగా మారుస్తున్నాము. కారు లోపల ప్రతి క్షణాన్ని మరింత ఆహ్లాదంగా మార్చబోతున్నాం” అని డాల్బీ లాబొరేటరీస్‌ లోని IMEA కమర్షియల్  పార్ట్ నర్ షిప్ సీనియర్ డైరెక్టర్ కరణ్ గ్రోవర్ చెప్పుకొచ్చారు.

Read Also: మహీంద్రా విజన్ ఎస్ డీజిల్ ఆటోమేటిక్, ఇంటీరియర్ డిజైన్ లీక్!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×