2026 Tata Tiago vs Hyundai Grand i10 Nios: ఇండియన్ మార్కెట్లో ఎంట్రీ లెవల్ హ్యాచ్ బ్యాక్ కార్ల విభాగంలో టాటా టియాగో, హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ మోడళ్లు మంచి గుర్తింపు పొందాయి. తాజాగా టాటా 2026 టియాగోను కొత్త డిజైన్, అప్ డేటెడ్ క్యాబిన్, అదనపు భద్రతా ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీంతో ఈ కొత్త టియాగో, గ్రాండ్ i10 నియోస్ కంటే బెస్ట్ ఆప్షనా? అనే చర్చ మొదలయ్యింది. ఇంతకీ ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ధరల పరంగా చూస్తే, టాటా టియాగో లో కాస్ట్ లో లభిస్తోంది. 2026 టియాగో ప్రారంభ ధర రూ.4.69 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, టాప్ వేరియంట్ ధర రూ.8.55 లక్షల వరకు ఉంటుంది. మరోవైపు హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ ధరలు రూ.5.55 లక్షల నుంచి ప్రారంభమై రూ.8.03 లక్షల వరకు ఉన్నాయి. అంటే బేస్ వేరియంట్ కొనాలనుకునే వారికి టియాగో బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.
ఫీచర్లను పరిశీలిస్తే, టాటా టియాగో ఈసారి పెద్ద ఎత్తున అప్ డేట్స్ తో వచ్చింది. ఇందులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ లాంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. గ్రాండ్ i10 నియోస్ లో 8 అంగుళాల టచ్ స్క్రీన్ అందుబాటులో ఉంటుంది. రెండు కార్లలోనూ వెనుక AC వెంట్స్, స్మార్ట్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు లభిస్తాయి.
భద్రత పరంగా కూడా టియాగో మంచి ప్యాకేజీని అందిస్తుంది. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్, రియర్ పార్కింగ్ సెన్సర్లు ఉన్నాయి. 360 డిగ్రీ కెమెరా కూడా ఇవ్వడం ఈ సెగ్మెంట్ లో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. గ్రాండ్ i10 నియోస్ లో కూడా 6 ఎయిర్ బ్యాగ్స్, ESC, హిల్ హోల్డ్ అసిస్ట్, ABS, EBD లాంటి ఫీచర్లు ఉన్నప్పటికీ 360 డిగ్రీ కెమెరా లేదు.
ఇంజిన్ పరంగా రెండు కార్లు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్లతో వస్తాయి. టాటా టియాగోలో 3-సిలిండర్ రెవోట్రాన్ ఇంజిన్ ఉండగా, ఇది 86 హెచ్‌పీ పవర్, 113 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. CNG వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్‌లో 4-సిలిండర్ కప్పా పెట్రోల్ ఇంజిన్ ఉండి 83 హెచ్‌పీ పవర్, 113.8 ఎన్ఎం టార్క్ ను అందిస్తుంది. పవర్ దాదాపు సమానంగానే ఉన్నప్పటికీ, 4-సిలిండర్ ఇంజిన్ కారణంగా గ్రాండ్ i10 నియోస్ డ్రైవింగ్ సమయంలో మరింత స్మూత్‌గా, రిఫైన్డ్ గా అనిపిస్తుంది. మరోవైపు టియాగోలో CNG-AMT, ప్యాడిల్ షిఫ్టర్స్ లాంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.
ఎక్కువ ఫీచర్లు, మెరుగైన భద్రత, తక్కువ ధరలో మంచి వ్యాల్యూ కావాలనుకునేవారికి 2026 టాటా టియాగో బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. స్మూత్ డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్, ఇంజిన్ రిఫైన్ మెంట్, ప్రీమియం ఫీల్ కోరుకునే వారు హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ తీసుకోవడం మంచిది.
Read Also: ఎలక్ట్రిక్ SUV To ప్రిల్యూడ్ స్పోర్ట్స్ కారు.. హోండా నుంచి రాబోయే 4 క్రేజీ మోడళ్లు ఇవే!