E-Paper
Advertisement

Yamaha Tricity 300 Scooter: మూడు చక్రాలు, ఓ ఎయిర్‌ బ్యాగ్‌.. యమహా స్కూటర్ భలే ఉంది భయ్యా!

Yamaha Tricity 300 Scooter: మూడు చక్రాలు, ఓ ఎయిర్‌ బ్యాగ్‌.. యమహా స్కూటర్ భలే ఉంది భయ్యా!
Advertisement

Yamaha Tricity 300 Scooter:  యమహా నుంచి అదిరిపోయే బైక్స్ అందుబాటులోకి వస్తున్నాయి. యువతను ఆకట్టుకునే క్రేజీ స్కూటర్లు కూడా విడుదల అవుతున్నాయి. ఇక తాజాగా కంపెనీ ఓ క్రేజీ స్కూటర్ ను ఆవిష్కరించింది. 2026 ట్రైసిటీ 300తో దీనిని మార్కెట్ లోకి తీసుకురాబోతోంది. భద్రతా ఫీచర్ల విషయంలో ఈ స్కూటర్ మరో అడుగు ముందుకు వేసింది. మూడు చక్రాలు, ఓ ఎయిర్ బ్యాగ్ తో ఈ మ్యాక్సీ స్కూటర్ రూపొందింది. ఎయిర్‌ బ్యాగ్ వ్యవస్థను కలిగి ఉన్న ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రొడక్షన్ స్కూటర్‌ గా గుర్తింపు తెచ్చుకోబోతోంది.

ఆటోలివ్ సహకారంతో అభివృద్ధి చేయబడిన ఈ ఎయిర్‌ బ్యాగ్, స్కూటర్ ముందు భాగంలోని ఆప్రాన్‌ లో, హ్యాండిల్‌ బార్ల కింద అమర్చబడింది. ఈ స్కూటర్ ఎప్పుడైనా ప్రమాదానికి గురైతే, ఈ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది. ఇది రైడర్‌ ను హ్యాండిల్‌ బార్లు, ఇతర గట్టి భాగాల నుంచి గాయాలు కాకుండా కాపాడుతుంది.

Advertisement

ఇక ప్యాకేజింగ్ పరిమితులు, రైడర్ పొజిషన్, బ్యాలెన్స్‌ ను పరిగణనలోకి తీసుకుని, ఈ వ్యవస్థ ప్రత్యేకంగా ద్విచక్ర వాహనాల కోసం రూపొందించబడింది. ఎయిర్‌ బ్యాగ్‌ ను అమర్చడం వల్ల ప్రాక్టికాలిటీతో పాటు స్టోరేజ్ స్పేస్‌ పై ఎలాంటి ప్రభావం ఉండదని యమహా వెల్లడించింది. అయితే, ఎయిర్‌ బ్యాగ్ లేని వెర్ష న్‌లో చిన్న వస్తువులను పెట్టుకోవడానికి వీలుగా ముందు భాగం మధ్యలో ఒక స్టోరేజ్ కంపార్ట్‌ మెంట్ ఉంటుంది.

ట్రైసిటీ 300 యమహా ఫీచర్ల గురించి..

ట్రైసిటీ 300 యమహా లీనింగ్ మల్టీ వీల్ ప్లాట్‌ ఫామ్‌ పై ఆధారపడి ఉంటుంది. 292cc, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ తో పని చేస్తుంది. పాత మోడల్ కంటే 800 గ్రాములు తక్కువ బరువున్న కొత్త క్యాటలిటిక్ కన్వర్టర్ కారణంగా ఈ మోటార్ పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉంది. అప్‌ డేట్ చేయబడిన మెకానికల్స్‌ తో పాటు, 2026 యమహా ట్రైసిటీ 300లో చిన్న చిన్న స్టైలింగ్ మార్పులు, ఫీచర్ అప్‌ గ్రేడ్స్ కూడా ఉన్నాయి. ఇందులో ఆల్ LED లైటింగ్, 4.2 అంగుళాల కలర్ TFT డిస్‌ ప్లే, స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీ, స్ట్రీట్‌ క్రాస్ యాప్ ద్వారా గార్మిన్ నావిగేషన్ ఉన్నాయి. ఇందులో కార్నరింగ్ ABS కూడా ఉంది.

Advertisement

Read Also: ఏథర్‌ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సర్వీసింగ్ ఇక మీ ముందుకే!

2026 మిడ్ ఇయర్ లో అందుబాటులోకి!

యమహా కొత్త ట్రైసిటీ 300.. 2026 మిడ్ ఇయర్ లో అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకానికి రానుంది.  అయితే, ఈ స్కూటర్ భారతీయ మార్కెట్ లోకి వచ్చే విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ స్కూటర్ యూరప్ దేశాల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ అంశంపై యమహా క్లారిటీ ఇవ్వనుంది.

Read Also:  మీ పెట్రోల్ స్కూటర్ స్టార్ట్ అవ్వడం లేదా? సింపుల్ గా ఈ 5 టిప్స్ ట్రై చేయండి!

Related News

టాటా కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడళ్లపై కళ్లు చెదిరే తగ్గింపు!

భారత్‌లో మిష్లిన్ ప్రైమసీ 5 టైర్లు లాంచ్.. ఇప్పుడు మేడ్ ఇండియా వెర్షన్ లో!

దేశంలో బెస్ట్ 5 స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లు.. మైలేజీ, ఫీచర్లలో టాప్ మోడల్స్ ఇవే!

భారత్‌ లో ఈవీ స్కూటర్ల అమ్మకాల జోరు, నెంబర్ వన్ ఏదంటే?

కొత్త మహీంద్రా XUV 3XO లుక్ రివీల్.. విజన్ X డిజైన్‌కు పేటెంట్ వచ్చేసింది!

విడా సేల్స్ జోరు.. 3 లక్షల మార్క్ దాటిన హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్!

యంగ్ రైడర్స్ కోసం స్టడ్స్ క్రేజీ హెల్మెట్.. వావ్.. మరీ ఇంత తక్కువ ధరలోనా?

జూలైలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఇవే.. మళ్లీ నెం.1గా అదే మోడల్!

Big Stories

Advertisement
×