E-Paper
Advertisement

Ather Energy: ఏథర్‌ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సర్వీసింగ్ ఇక మీ ముందుకే!

Ather Energy: ఏథర్‌ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సర్వీసింగ్ ఇక మీ ముందుకే!
Advertisement

Ather Energy Reaches 500 Service Centres: ఏథర్ ఎనర్జీ తన సర్వీస్ నెట్‌ వర్క్‌ ను దేశ వ్యాప్తంగా 500 ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లకు విస్తరించింది. FY26లో కంపెనీ తన సర్వీస్ పరిధిని 277 నుండి 500 సెంటర్లకు పెంచి, దాదాపు రెట్టింపు చేసింది. యజమానులు సకాలంలో సర్వీస్, విడిభాగాల సపోర్ట్ పొందే అవకాశం కల్పిస్తోంది.

విస్తృతమైన సర్వీసింగ్ అందించడం ద్వారా.. తమ కంపెనీ అమ్మకాలను పెంచుకోవాలని ఏథర్ భావిస్తోంది. రిటైల్ వృద్ధికి అనుగుణంగా, స్కూటర్లను విక్రయించే ప్రతి నగరంలో ఇప్పటికే సర్వీస్ సపోర్ట్ అందుబాటులో ఉండేలా చూసేందుకు శరవేగంగా సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేస్తుంది. EV కొనుగోల్లో ప్రస్తుతం టైర్ 2, అభివృద్ధి చెందుతున్న నగరాల్లో భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొనుగోలుదారులు తరచుగా మెయింటెనెన్స్, టర్నరౌండ్ సమయం, టెక్నీషియన్ అవైలబులిటీ గుర్తించి ఆలోచిస్తున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగాన్ని ఇప్పటికీ ప్రభావితం చేస్తున్న సర్వీసింగ్ సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా ఏథర్ సర్వీస్ సెంటర్లను విస్తరిస్తోంది.

జస్ట్ 60 నిమిషాలో సర్వీసింగ్ పూర్తి

Advertisement

ఏథర్ కంపెనీ శరవేగంగా సర్వీసింగ్ అందించేందుకు చర్యలు చేపడుతోంది. తన గోల్డ్ సర్వీస్ సెంటర్లలో అప్‌ గ్రేడ్ చేయబడిన కస్టమర్ లాంజ్‌లు, ఆధునిక సర్వీస్ పరికరాలు, మరింత పారదర్శకమైన సర్వీస్ విధానం ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఎక్స్‌ ప్రెస్‌ కేర్ సూపర్ సర్వీస్ లో భాగంగా కేవలం 60 నిమిషాల్లో బైక్ సర్వీసింగ్ ను పూర్తి చేస్తున్నట్లు తెలిపింది. దేశ వ్యాప్తంగా ఈ సర్వీస్ అందించే 82 సర్వీస్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఈ కేంద్రాల్లో అత్యంత సర్వీస్ ను అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.

ఛార్జింగ్ నెట్ వర్క్ మరింత విస్తరణ!

31 డిసెంబర్ 2025 నాటికి ప్రపంచ వ్యాప్తంగా తమ ఛార్జింగ్ నెట్‌ వర్క్ 4,357 కంటే ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లకు చేరింది. నైబర్‌ హుడ్ ఛార్జర్లకు చేరుకుందని, అదే తేదీ నాటికి తమ రిటైల్ నెట్‌ వర్క్ 600 ఎక్స్‌ పీరియన్స్ సెంటర్లకు చేరుకుందని  ఏథర్ సంస్థ ప్రకటించింది.

Advertisement

Read Also:  సైగలతోనే డోర్లు ఓపెన్.. ఈ మ్యాజికల్ కారు భలే ఉంది గురూ!

భారత్ లో ఏథర్ ఈవీల గురించి..

ఇండియాలో ఏథర్ ఎనర్జీ  ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ కంపెనీకి సంబంధించి  మార్కెట్లో ఏథర రిజ్టా ఫ్యామిలీ స్కూటర్, ఏథర్ 450X, 450S, 450 అపెక్స్ లాంటి ప్రీమియం స్కూటర్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు సుమారు రూ.1.10 లక్షల నుంచి రూ. 1.90 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉన్నాయి.  మోడల్, బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి ధరలు మారుతూ ఉంటాయి.

Read Also: పుమా లాంటి బైక్.. దీన్ని తయారు చేసేందుకు ఏకంగా 30 నెలలు పట్టింది!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×