E-Paper
Advertisement

Butterfly vs Philips: మధ్యతరగతి బ్రాండ్స్.. ఈ రెండు ఇండక్షన్స్ స్టవ్స్‌లో.. ఫీచర్ల పరంగా ఏది బెస్ట్?

Butterfly vs Philips: మధ్యతరగతి బ్రాండ్స్.. ఈ రెండు ఇండక్షన్స్ స్టవ్స్‌లో.. ఫీచర్ల పరంగా ఏది బెస్ట్?
Advertisement

Butterfly vs Philip: గ్యాస్ కొరత నేపథ్యంలో ప్రస్తుతం ఇండక్షన్ స్టవ్స్ కు భారీ ఎత్తున డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. పేద, ధనిక అన్న తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఇండక్షన్ స్టవ్స్ ను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో రెండు ఇండక్షన్ స్టవ్స్ మధ్య గట్టి పోటీ నెలకొని ఉంది. ‘Butterfly Elite V3 2200W’, ‘Philips HD4928’ ఇండక్షన్ స్టవ్స్ మధ్యతరగతి ప్రజలను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాయి. దీంతో ఆ రెండింటిలో ఏది కొనాలో తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కాబట్టి ఫీచర్ల పరంగా, బడ్జెట్ పరంగా రెండిటిలో ఏది బెటరో ఇప్పుడు చూద్దాం.

పవర్, హీటింగ్ సామర్థ్యం

బటర్‌ఫ్లై ఎలైట్ V3 అత్యధికంగా 2200 వాట్ల సామర్థ్యంతో అందుబాటులో ఉంది. దీనివల్ల వంట చాలా వేగంగా పూర్తవుతుంది. ముఖ్యంగా అధిక క్వాంటిటీ లేదా ఎక్కువ వంట వంటలుచేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మరోవైపు ఫిలిప్స్ HD4928.. 2100 వాట్లు సామర్థ్యంతో వచ్చింది. కుకింగ్ విషయంలో రెండింటి మధ్య పెద్ద తేడా లేనప్పటికీ బటర్‌ఫ్లై స్వల్పంగా ఎక్కువ పవర్‌ను కలిగి ఉంది.

డిజైన్ – గ్లాస్ క్వాలిటీ

Advertisement

ఫిలిప్స్ HD4928 తన ప్రీమియం గ్లాస్ ఫినిషింగ్‌తో రూపొందింది. ఇది చూడటానికి చాలా క్లాసీగా ఉండటమే కాకుండా పైన గీతలు పడకుండా స్ట్రాంగ్ గా ఉంటుంది. బటర్‌ఫ్లై మోడల్ కూడా మంచి స్టైలిష్ లుక్‌ను కలిగి ఉన్నప్పటికీ ఫిలిప్స్ బిల్డ్ క్వాలిటీతో పోలిస్తే కాస్త వెనుకబడి ఉందని చెప్పవచ్చు.

ప్రీ – సెట్ మెనూ ఆప్షన్లు

వంటను సులభతరం చేయడానికి ఫిలిప్స్‌లో ఇండియన్ వంటకాలకు తగినట్లుగా 6 ప్రీ-సెట్ మెనూలు ఉన్నాయి. వీటి సాయంతో (దోశ, చపాతీ, ఇడ్లీ వంటివి చేసుకోవచ్చు. బటర్‌ఫ్లై ఎలైట్ V3లో కూడా 7-8 వరకు కుకింగ్ మోడ్స్ ఉన్నాయి. ఇక్కడ బటర్‌ఫ్లై లో వైవిధ్యం ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఫిలిప్స్ బటన్లు వాడటానికి చాలా సులభంగా ఉంటాయి.

ఆటో ఆఫ్, సేఫ్టీ ఫీచర్లు

Advertisement

రెండు కుక్‌టాప్‌లలోనూ ఆటోమేటిక్ ఆఫ్ ఫీచర్, కూల్-టు-టచ్ సర్ఫేస్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అయితే, ఫిలిప్స్ HD4928లో వోల్టేజ్ హెచ్చుతగ్గులను తట్టుకునే సామర్థ్యం, టైమర్ సెట్టింగ్స్ (0-3 గంటల వరకు) చాలా ఖచ్చితంగా పనిచేస్తాయి. బటర్‌ఫ్లైలో కూడా టైమర్ ఆప్షన్ ఉంది. ఇది సమయాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుంది.

ధర, వారంటీ

సాధారణంగా ఫిలిప్స్ కు ఉన్న బ్రాండ్ వాల్యూ కారణంగా ఇండక్షన్ స్టవ్ ధర.. బటర్‌ఫ్లై కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. బటర్‌ఫ్లై ఎలైట్ V3 తక్కువ ధరలో ఎక్కువ వాటేజీని (2200W) అందిస్తుంది. మార్కెట్ లో రూ.4,599కి ఇది లభిస్తోంది. ఇక ఫిలిప్స్ విషయానికి వస్తే దీని ధర రూ. 4,899గా ఉంది. అయితే బటర్ ఫ్లైతో పోలిస్తే ఫిలిప్స్ సర్వీస్ నెట్‌వర్క్ కొన్ని ప్రాంతాల్లో మెరుగ్గా ఉందని చెప్పవచ్చు.

Also Read: Dolby Soundbars: మ్యూజిక్ లవర్స్ స్పెషల్.. దేశంలో టాప్ – 4 సౌండ్ బార్స్.. Dolby Atmos, 3D సౌండ్!

చివరిగా.. ఏది కొంటే బెటర్?

బడ్జెట్ కొంచెం తక్కువగా ఉండి ఎక్కువ పవర్ (2200W) కావాలనుకుంటే Butterfly Elite V3 ఎంచుకోండి. అలా కాకుండా మంచి బ్రాండ్ వాల్యూ, మన్నిక (Durability), ప్రీమియం లుక్‌కి ప్రాధాన్యత ఇస్తే Philips HD4928 బెస్ట్ ఛాయిస్ గా చెప్పవచ్చు.

ముఖ్యగమనిక: బటర్ ఫ్లై, ఫిలిప్స్ కంపెనీ ఇండక్షన్ స్టవ్స్ మధ్య వ్యత్యాసాలను ఆయా కంపెనీలు తెలియజేసిన ఫీచర్ల పరంగా అందించడం జరిగింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇందులోని కంటెంట్ కు బిగ్ టీవీ ఎలాంటి బాధ్యత వహించదు.

Also Read: Satellite Smartwatch: శాటిలైట్‌ స్మార్ట్ వాచ్.. భూమ్మిద ఎక్కడ అపాయంలో ఉన్నా.. ఇట్టే పసిగట్టి కాపాడేస్తది!

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×