E-Paper
Advertisement

Best Petrol Mileage Cars: మారుతి To టాటా.. అదిరిపోయే మైలేజ్ ఇచ్చే బెస్ట్ పెట్రోల్ కార్లు ఇవే!

Best Petrol Mileage Cars: మారుతి To టాటా.. అదిరిపోయే మైలేజ్ ఇచ్చే బెస్ట్ పెట్రోల్ కార్లు ఇవే!
Advertisement

Best Mileage Petrol Cars in India:  దేశంలో వీలైనంత వరకు కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం కీలక చర్యలు చేపడుతోంది. ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోబోతోంది. సమీప భవిష్యత్తులో డీజిల్‌ తో నడిచే వాహనాలను దశలవారీగా తొలగించడానికి ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో మంచి మైలేజ్ ఇచ్చే బెస్ట్ పెట్రోల్ కార్ల కోసం వినియోగదారులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో మంచి మైలేజ్ ఇచ్చే టాప్ 5 పెట్రో కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ మారుతి సుజుకి సెలెరియో

మారుతి సుజుకి అందించే బెస్ట్ మైలేజ్ పెట్రోల్ కారు ఇది. 1.0L K10C మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌ తో 67.5 bhp పవర్,  91.1 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఐదు స్పీడ్ మాన్యువల్, ఐదు స్పీడ్ AMT ట్రాన్స్‌ మిషన్‌ తో యాడ్ చేసి ఉంటుంది. మారుతి సుజుకి సెలెరియో ఒక లీటర్ పెట్రోల్ తో 26.69 కి.మీ వరకు మైలేజ్ అందిస్తుంది. మారుతి సుజుకి సెలెరియో ప్రారంభ ధర రూ. 4.69 లక్షలు.

⦿ హోండా అమేజ్

Advertisement

హోండా నుంచి సబ్ 4m సెడాన్గా మార్కెట్ లోకి అడుగు పెట్టింది. ఇది 88 bhp పవర్, 110 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.  1.2L నాలుగు సిలిండర్ల i-VTEC ఇంజిన్‌ తో వస్తుంది. ఇది ఐదు స్పీడ్ మాన్యువల్, ఏడు స్పీడ్ CVT ట్రాన్స్‌ మిషన్‌ తో వస్తుంది. హోండా అమేజ్ 19.46 కి.మీ మైలేజ్ ఇస్తుంది. హోండా అమేజ్ ప్రారంభ ధర రూ. 7.47 లక్షలుగా ఉంటుంది.

⦿ టయోటా గ్లాంజా

టయోటా గ్లాంజా దేశంలోని అత్యంత ఎక్కువ మైలేజ్ ఇచ్చే హ్యాచ్‌ బ్యాక్‌ లలో ఒకటి.  టయోటా గ్లాంజా 88 bhp పవర్,  113 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేసే 1.2L నాలుగు సిలిండర్ల K12N ఇంజిన్‌ తో వస్తుంది. ఇది ఐదు స్పీడ్ మాన్యువల్, ఐదు స్పీడ్ AMT ట్రాన్స్‌ మిషన్‌ తో ఉంటుంది. టయోటా గ్లాంజా 22.94 కి.మీ మైలేజ్ ఇస్తుంది. దీని ధర రూ. 6.46 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

⦿ టాటా ఆల్ట్రోజ్

Advertisement

టాటా మోటార్స్ నుంచి విడుదలైన ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్, ఆల్ట్రోజ్. ఇది 19.33 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఇది 1.2L మూడు సిలిండర్ రెవోట్రాన్ ఇంజిన్ ద్వారా 86.8 పవర్, 113 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఐదు స్పీడ్ మాన్యువల్, ఐదు స్పీడ్ AMT ట్రాన్స్‌ మిషన్‌ వస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 6.30 లక్షలు.

⦿ హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్

హ్యుందాయ్ బడ్జెట్ హ్యాచ్‌ బ్యాక్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 81.8 పవర్, 113.8 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేసే 1.2L నాలుగు సిలిండర్ కప్పా ఇంజిన్ ను కలిగి ఉంటుంది. ఇది ఐదు స్పీడ్ మాన్యువల్, ఐదు స్పీడ్ AMT ట్రాన్స్‌ మిషన్‌ తో వస్తుంది. ఇది 21 కి.మీ  మైలేజ్ ఇస్తుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 5.55 లక్షలు.

Read Also: టాటా పంచ్ ఈవీని ఇప్పుడు ఈఎంఐలోనూ కొనవచ్చు, నెలకు ఎంత కట్టాలంటే?

Related News

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

Big Stories

Advertisement
×