Varalakshmi Sarathkumar: టాలీవుడ్ మరియు కోలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి వరలక్ష్మీ శరత్ కుమార్(Varalakshmi Sarathkumar) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన దర్శకత్వ అరంగేట్రం చిత్రం ‘ఎస్ సరస్వతి’ ప్రచారంలో భాగంగా పిల్లలను కనడంపై ఆమె చేసిన ప్రాక్టికల్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీశాయి. ఆర్థిక స్థిరత్వం లేనిదే పిల్లలను కనడం బాధ్యతారాహిత్యమని ఆమె కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఈ విషయంలో ఆమె వాడిన పదజాలం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాలు ఇలా వున్నాయి ..
వరలక్ష్మి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పిల్లలను కనడంపై చాలా ప్రాక్టికల్ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ రోజుల్లో పిల్లలను పెంచడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని ఆమె గుర్తు చేశారు. కేవలం భావోద్వేగంతో పిల్లలను కనేయడం కంటే, వారికి కావాల్సిన కనీస అవసరాలు, మంచి విద్య మరియు భవిష్యత్తును అందించే స్థాయి మనకు ఉందా లేదా అని ఆలోచించుకోవాలని సూచించారు. ఆర్థికంగా మనం ఒక స్థాయికి చేరుకున్నప్పుడే ఆ బాధ్యతను తీసుకోవాలని, లేదంటే పిల్లలు మరియు తల్లిదండ్రులు ఇద్దరూ ఇబ్బందులు పడతారని ఆమె అభిప్రాయపడ్డారు.
చాలా మంది పిల్లల విషయంలో ఒక పద్ధతి లేకుండా ముందుకెళ్తారని, అది సరైనది కాదని వరలక్ష్మి స్పష్టం చేశారు. “మీకు ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరూ వచ్చి సాయం చేయరు, మీ పిల్లలను మీరే చూసుకోవాలి” అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. తానేమీ పిల్లలకు వ్యతిరేకం కాదని, కానీ ఒక పక్కా ప్లానింగ్ లేకుండా సంతానాన్ని పొందడం వల్ల వచ్చే కష్టాలను మనం ముందే ఊహించాలని చెప్పారు. ఈ స్పష్టమైన ఆలోచనా ధోరణి కొందరిని ఆశ్చర్యపరిచినప్పటికీ, మరికొందరు మాత్రం ఆమె చెప్పింది అక్షర సత్యమని మద్దతు తెలుపుతున్నారు.
ALSO READ:Film industry: 66 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఒక్క మాటతో క్లారిటీ!
వరలక్ష్మి చేసిన ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వైపు ఆమె చెప్పింది చాలా ప్రాక్టికల్ గా ఉందని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం పిల్లల విషయంలో ఇంత కమర్షియల్ గా ఆలోచించాలా అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆమె దర్శకత్వం వహించిన ‘ఎస్ సరస్వతి’ సినిమా విడుదల కాబోతున్న తరుణంలో ఇలాంటి బోల్డ్ కామెంట్స్ రావడం సినిమాపై అంచనాలను పెంచింది. ఏది ఏమైనా, తన వ్యక్తిగత అభిప్రాయాలను ధైర్యంగా చెప్పడంలో వరలక్ష్మి మరోసారి తన మార్క్ చూపించారు.