E-Paper
Advertisement

Hero Vida VXZ: లాంచ్ కు ముందే రోడ్డెక్కిన హీరో విడా VXZ ఎలక్ట్రిక్ బైక్, అసలు మ్యాటర్ ఏంటంటే?

Hero Vida VXZ: లాంచ్ కు ముందే రోడ్డెక్కిన హీరో విడా VXZ ఎలక్ట్రిక్ బైక్, అసలు మ్యాటర్ ఏంటంటే?
Advertisement

Hero Vida VXZ Electric Bike Testing: హీరో నుంచి మరో సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. విడా VXZ ఎలక్ట్రిక్ పేరుతో పరిచయం చేయబోతోంది. ఈ బైక్ సంబంధించి తాజాగా టెస్టింగ్ స్పై ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. గత సంవత్సరం EICMA షోలో దీనిని కాన్సెప్ట్‌ గా ప్రదర్శించారు. డిజైన్ కు రీసెంట్ గానే పేటెంట్ లభించింది. ఇది త్వరలో లాంచ్ అవుతుందని అందరూ భావిస్తున్నారు.

చూసేందుకు హీరో Xtreme 160R మాదిరిగా..

విడా VZX చాలా అగ్రెసివ్ లుక్ లో కనిపిస్తుంది. హీరో Xtreme 160R నుంచి కొంత ప్రేరణ పొందినట్లు అనిపిస్తుంది. అయితే, రైడర్ సీటింగ్ పొజిషన్ నుండి ఎర్గోనామిక్స్ నిటారుగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది ప్రయాణికులకు విలక్షణమైన అనుభూతిని అందించనుంది. ఈ బైక్ గతంలో దాఖలు చేయబడిన డిజైన్ పేటెంట్ స్ప్లిట్ సీట్ సెటప్‌ ను చూపించింది. ఈ బైక్ లో పలు  వేరియంట్లు ఉంటాయని వెల్లడించింది.

విడా VZX గురించి..

Advertisement

విడా VZX  హార్డ్‌ వేర్ విషయానికొస్తే,  అప్‌ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్, వెనుక మోనోషాక్, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ తో అమర్చబడినట్లు కనిపిస్తుంది. విడా VXZ పనితీరు KTM 250 డ్యూక్, సుజుకి గిక్సర్ 250 లాంటి 250cc స్ట్రీట్ నేకెడ్ మోటార్‌ సైకిళ్ల మాదిరిగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ బైక్ బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, రైడ్ మోడ్‌లు, రీజెనరేటివ్ బ్రేకింగ్, పూర్తి LED లైటింగ్‌ తో TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ తో కూడా రావచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం కూడా ప్యాకేజీలో భాగమయ్యే అవకాశం ఉంది. అయితే, బైక్‌ లో విడా VX2, విడా Dirt.E K3 లాంటి తొలగించే లేదంటే  మార్చుకోగల బ్యాటరీలు ఉంటాయా? అనేది తెలియాల్సి ఉంటుంది.

Read Also: ఇండియన్ రోడ్లపై నార్టన్ అట్లాస్ టెస్టింగ్, లాంచింగ్ ఎప్పుడంటే?

అల్ట్రావయోలెట్ F77 సూపర్‌ స్ట్రీట్‌ కు ప్రత్యర్థిగా..

Advertisement

విడా VXZ బహుశా అల్ట్రావయోలెట్ F77 సూప ర్‌స్ట్రీట్‌కు దగ్గరి ప్రత్యర్థిగా ఉంటుందని తెలుస్తుంది. అయినప్పటికీ, ధర  చాలా వరకు తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ బైక్ రోడ్ల మీద టెస్టింగ్ జరుపుకుంటుంది. ఈ మోటార్‌ సైకిల్ ఈ సంవత్సరం చివర్లో లాంఛ్ అవుతుందిన భావిస్తున్నారు. త్వరలోనే ఈ బైక్ కు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Read Also: ఓలా To టీవీఎస్.. మార్చి 2026లో టాప్ ట్రెండింగ్‌ ev స్కూటర్లు ఇవే!

Related News

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

కియా సైరోస్ EV vs కియా సైరోస్ ICE.. ఏది బెస్ట్? పూర్తి పోలిక ఇదే!

16 ఏళ్ల తర్వాత నిస్సాన్ మాస్టర్‌ పీస్.. కొత్త ఎల్గ్రాండ్ వచ్చేసింది!

భారత మార్కెట్ లోకి చౌకైన 7-సీటర్‌.. ఏంటీ.. ధర మరీ అంత తక్కువా?

MG కొత్త EV వచ్చేస్తోంది.. 600 కి.మీ రేంజ్‌తో అదిరే ఎంట్రీ!

సింగిల్ ఛార్జ్ తో 500 కి.మీ ప్రయాణం.. మార్కెట్ లో దుమ్మురేపబోతున్న హ్యుందాయ్ ఈవీ!

Big Stories

Advertisement
×