E-Paper
Advertisement

టైర్ల లైఫ్ డబుల్ చేసే 6 క్రేజీ సీక్రెట్స్.. డ్రైవర్లు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

టైర్ల లైఫ్ డబుల్ చేసే 6 క్రేజీ సీక్రెట్స్.. డ్రైవర్లు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
Advertisement

Car Tyre Maintenance Guide: కామన్ గా కారు టైర్లు సాధారణంగా 40 వేల నుంచి 50 వేల కిలోమీటర్ల వరకు పని చేస్తాయని చాలా మంది భావిస్తారు. కానీ, కాస్త జాగ్రత్తలు, సరైన మెయింటెనెన్స ఉంటే వాటి లైఫ్ టైమ్ డబుల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే టైర్లు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. డ్రైవింగ్ కూడా  సేఫ్ గా ఉంటుంది. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ టైర్ ప్రెషర్‌

టైర్ ప్రెషర్‌ అనేది చాలా ముఖ్యం. గాలి తక్కువగా ఉంటే టైర్ల అంచులు త్వరగా అరిగిపోతాయి. మైలేజీ కూడా తగ్గుతుంది. గాలి ఎక్కువగా ఉంటే టైర్ మధ్య భాగం త్వరగా దెబ్బతింటుంది. అందుకే ప్రతి 10–15 రోజులకు ఒకసారి గాలి చెక్ చేయడం మంచిది. తయారీ కంపెనీ సూచించిన ప్రెషర్‌ ను పాటించడం వల్ల టైర్లు సమానంగా అరిగి ఎక్కువకాలం ఉపయోగపడతాయి.

⦿ టైర్ రొటేషన్

Advertisement

సాధారణంగా ముందు టైర్లు ఎక్కువ ఒత్తిడిని తీసుకుంటాయి. అవి త్వరగా అరిగిపోతాయి. అందుకే, ప్రతి 10,000 కిలోమీటర్లకు ఓసారి టైర్ల ప్లేస్ మార్చడం వల్ల నాలుగు టైర్లు సమానంగా వాడుకలో ఉంటాయి. టైర్ల లైఫ్ పెంచడమే కాకుండా డ్రైవింగ్‌ లో స్థిరత్వాన్ని ఇస్తుంది.

⦿ వీల్ అలైన్‌మెంట్

వీల్ అలైన్‌మెంట్, బ్యాలెన్సింగ్‌ ను ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. కారు ఒక వైపుకు లాగడం, స్టీరింగ్‌ లో వైబ్రేషన్ అనిపిస్తే వెంటనే చెక్ చేయాలి. సరైన అలై న్‌మెంట్ లేకపోతే టైర్లు అడ్డగోలుగా అరిగిపోతాయి.

Advertisement

Read Also: ఏంటీ.. కార్ల లైట్లకూ ఓ భాష ఉంటుందా? ప్రతీ డ్రైవర్ కచ్చితంగా తెలుసుకోవాలండోయ్!

⦿ క్వాలిటీ టైర్లు

ఎప్పుడూ మంచి నాణ్యమైన టైర్లను మాత్రమే ఉపయోగించాలి. చౌకగా దొరికే టైర్లు తక్కువ కాలంలోనే పాడవుతాయి.   వర్షం, అధిక వేగంలో ఇవి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. మంచి బ్రాండ్ టైర్లు కొంచెం ఖరీదైనా, భద్రత, దీర్ఘకాల ప్రయోజనం ఇస్తాయి.

⦿ టైర్ల శుభ్రత

టైర్లను శుభ్రంగా ఉంచాలి. మట్టి, ఆయిల్, గ్రీజ్ లాంటి పదార్థాలు టైర్ రబ్బరును నెమ్మదిగా దెబ్బతీస్తాయి. కనీసం నెలకు ఒకసారి టైర్లను శుభ్రం చేయడం అలవాటు చేసుకుంటే బలంగా ఉంటాయి.

⦿ డ్రైవింగ్ స్టైల్

డ్రైవింగ్ స్టైల్ కూడా చాలా ప్రభావం చూపుతుంది. అకస్మాత్తుగా బ్రేకులు వేయడం, వేగంగా మలుపులు తిరగడం లాంటి అలవాట్లు టైర్లపై ఎక్కువ ఒత్తిడిని పెంచుతాయి. సాఫ్ట్‌ గా డ్రైవ్ చేయడం వల్ల టైర్లు ఎక్కువకాలం చక్కగా పని చేస్తాయి. ఇంధన వినియోగం కూడా మెరుగుపడుతుంది. చిన్న చిన్న అలవాట్లు మార్చుకుంటే.. టైర్లు ఎక్కువకాలం మన్నడంతో పాటు ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చు.

Read Also: రెడ్, బ్లూ, గ్రీన్.. ఏ కలర్ గ్రీజ్ ఎందుకు వాడుతారో తెలుసా?

Related News

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

కారులో రాకెట్ టెక్నాలజీ.. స్పేస్‌ ఎక్స్‌ తో టెస్లా కొత్త ప్రయోగం చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా XUV 3XO సరికొత్త రికార్డు.. 5 లక్షలు దాటిన సేల్స్!

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ. 1.65 లక్షల తగ్గింపు!

హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు.. 15 లక్షలు దాటిన అమ్మకాలు!

ట్రాక్షన్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్‌.. అప్ డేటెడ్ టీవీఎస్ రైడర్ లో అదిరిపోయే ఫీచర్లు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

Big Stories

Advertisement
×