E-Paper
Advertisement

కారులో బ్యాడ్ స్మెల్ వస్తుందా? ఈ టిప్స్‌ తో ఫ్రెష్‌గా మార్చుకోండి!

కారులో బ్యాడ్ స్మెల్ వస్తుందా? ఈ టిప్స్‌ తో ఫ్రెష్‌గా మార్చుకోండి!
Advertisement

How to Remove Bad Smell from Your Car:  కారులో దుర్వాసన రావడం కామన్ గా ఎదురయ్యే సమస్యే. ముఖ్యంగా రోజూ ప్రయాణం చేసే వాళ్లకు, చిన్న చిన్న అలవాట్లతో కారులో చెడు వాసన వస్తుంది. అయితే, కొన్ని సింఫుల్ టిప్స్ పాటిస్తే కారు ఎప్పుడూ ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తరచుగా శుభ్రం చేయాలి!

కారును క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. చాలా మంది కారును బయట నుంచి మాత్రమే వాష్ చేస్తారు. కానీ, లోపల శుభ్రం చేయరు. ప్రతి వారం ఒకసారి వాక్యూమ్ క్లీనర్‌ తో సీట్లు, కార్పెట్లు శుభ్రం చేయాలి. డాష్‌ బోర్డ్, డోర్ ప్యానెల్స్ ను శుభ్రంగా తుడవాలి. ముఖ్యంగా మిగిలిపోయిన ఫుడ్, తడి వస్తువులు కారులో ఉంచకూడదు. ఇవే ఎక్కువగా దుర్వాసనకు కారణం అవుతాయి.

సహజమైన ఎయిర్ ఫ్రెషనర్లను ఉపయోగించండి!

Advertisement

కార్లలో సహజమైన ఎయిర్ ఫ్రెషనర్లను ఉపయోగించడం మంచిది. మార్కెట్లో దొరికే కెమికల్ స్ప్రేలు కొంతసేపు వాసన ఇస్తాయి. కానీ. కొన్నిసార్లు తలనొప్పి, అసౌకర్యం కలిగిస్తాయి. దీనికి బదులుగా కోల్ బ్యాగ్స్, సుగంధ నూనెలు లాంటివి ఉపయోగిస్తే అవి వాసనను పీల్చుకుని కారులో సహజమైన సువాసనను ఇస్తాయి. వీటిని సీట్ల కింద లేదంటే కప్ హోల్డర్ దగ్గర ఉంచితే మంచిది.

ఏసీని శుభ్రంగా ఉంచాలి!

కారులోని AC సిస్టమ్‌ ను శుభ్రంగా ఉంచడం చాలా అవసరం. మురికిగా ఉన్న AC వల్ల గాలి నాణ్యత తగ్గిపోతుంది.  చెడు వాసనలు వస్తాయి. అప్పుడప్పుడు AC ఫిల్టర్‌ను శుభ్రం చేయ చేయాలి. అలాగే AC క్లీనర్ స్ప్రేలు ఉపయోగించడం వల్ల బ్యాక్టీరియా తొలగి, గాలి తాజాగా ఉంటుంది.

బేకింగ్ సోడా ఉపయోగించండి!

Advertisement

బేకింగ్ సోడా కూడా మంచి పరిష్కారం. ఇది సహజంగా వాసనను పీల్చుకునే గుణాన్ని కలిగి ఉంటుంది. సీట్లు, కార్పెట్లపై కొద్దిగా చల్లి కొన్ని గంటలు వదిలేయాలి. తరువాత వాక్యూమ్ చేస్తే చెడు వాసన తగ్గిపోతాయి. ఇది సులభమైన, సురక్షితమైన పద్ధతి. ఫ్లోర్ మ్యాట్, కార్పెట్లను తరచూ శుభ్రం చేయాలి. బయట నుంచి వచ్చే దుమ్ము, బురద, తేమ ఇవన్నీ అక్కడే పేరుకుపోయి వాసనకు కారణమవుతాయి. వాటిని తీసి నీటితో కడిగి, బాగా ఆరబెట్టిన తర్వాత వాడుకోవాలి.

చెత్త పేరుకుపోకుండా చూసుకోవాలి!

కారులో చెత్త పేరుకుపోవడం కూడా ఒక ప్రధాన కారణం. చిన్న చిన్న ఫుడ్ ప్యాకెట్లు, బాటిళ్లు, పేపర్లు ఇలా ఏవైనా ఉండకూడదు. ప్రతిరోజూ కారును ఒకసారి చెక్ చేసి, అవసరం లేని వస్తువులను తీసేయాలి. చివరగా, వాసన ఎక్కడి నుంచి వస్తుందో గుర్తించడం చాలా ముఖ్యం. సీట్ల కింద, మ్యాట్ల కింద, బూట్ స్పేస్‌ లో ఏదైనా తడి, పాడైన వస్తువులు ఉండవచ్చు. వాటిని తొలగిస్తే సరిపోతుంది.

Read Also: తొలిసారి ఈవీ కారు కొంటున్నారా? ఈ 5 తప్పులు అస్సలు చేయకండి!

Related News

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

Big Stories

Advertisement
×