E-Paper
Advertisement

తొలిసారి ఈవీ కారు కొంటున్నారా? ఈ 5 తప్పులు అస్సలు చేయకండి!

తొలిసారి ఈవీ కారు కొంటున్నారా? ఈ 5 తప్పులు అస్సలు చేయకండి!
Advertisement

Electric Car Buying Tips: ఈ రోజుల్లో చాలా మంది ఎలక్ట్రిక్ కార్లు కొనగోలు చేస్తున్నారు. పెట్రోల్, డీజీల్ కార్లను కాదని ఎక్కువగా ఛార్జింగ్ వాహనాలను తీసుకుంటున్నారు.  అయితు, ఈవీలు కొనే సమయంలో ఈ తప్పులు చేస్తే తర్వాత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇంతకీ ఆ తప్పులు ఏంటి? వాటి నుంచి ఎలా బయటపడాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ రేంజ్ ఎంతో చెక్ చేయండి!

చాలా మంది కొనుగోలుదారులు కంపెనీలు చెప్పే రేంజ్‌ ఫైనల్ అనుకుంటారు. కానీ, రేంజ్ అనేది డ్రైవింగ్ స్టైల్, ట్రాఫిక్ పరిస్థితులు, వాతావరణం, AC వాడకం లాంటి విషయాల మీద ఆధారపడి మారుతుంది. అందుకే కేవలం బ్రోచర్‌ లో ఉన్న నెంబర్ ను చూసి నిర్ణయం తీసుకోకూడదు. వినియోగదారుల అనుభవాలు, రివ్యూలు చూడాలి.

⦿ ఛార్జింగ్ సౌకర్యం

Advertisement

చాలా మంది ఛార్జింగ్ సౌకర్యాన్ని పట్టించుకోరు. EV కొనుగోలు చేసే ముందు మీ ఇంటి దగ్గర లేదంటే మీ ప్రయాణ మార్గంలో ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయా? లేదా? అనేది తెలుసుకోవాలి. ఇంట్లో ఛార్జింగ్ ఏర్పాటు చేయగలరా? అన్నది కూడా పరిశీలించాలి. లేకపోతే, రోజూ ఛార్జింగ్ కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

⦿ ఛార్జింగ్ టైమ్

ఈవీ ఛార్జింగ్ టైమ్‌ను అంచనా వేయకపోవడం మరోతప్పు. పెట్రోల్ బంక్‌ లో ఇంధనం నింపడం కొన్ని నిమిషాల్లో పూర్తవుతుంది. కానీ, EVలో పూర్తి ఛార్జింగ్‌కు ఎక్కువ సమయం పడుతుంది. ఫాస్ట్ ఛార్జర్లు ఉన్నా అవి ఎప్పుడూ అందుబాటులో ఉండకపోవచ్చు. రోజువారీ వినియోగానికి ఎలా సరిపోతుందో ముందే ఆలోచించాలి.

⦿ బాటరీపై అవగాహన

Advertisement

చాలా మందికి బ్యాటరీ గురించి సరైన అవగాహన ఉండదు. EVలో బ్యాటరీనే ప్రధాన భాగం. ఖరీదైనది కూడా. చాలా మంది వారంటీ, బ్యాటరీ లైఫ్ టైమ్ లాంటి విషయాలను పట్టించుకోరు. కానీ ఇది భవిష్యత్తులో ఖర్చుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి కొనుగోలు చేసే ముందు బ్యాటరీ గ్యారంటీ, దాని పనితీరు ఎలా ఉంటుందో తెలుసుకోవాలి.

⦿ ఖర్చు గురించి..

చాలా మంది ఈవీకి సంబంధించి మొత్తం ఖర్చును పరిగణలోకి తీసుకోరు. EVలు ప్రారంభంలో ఖరీదుగా అనిపించవచ్చు.  కానీ.  దీర్ఘకాలంలో ఖర్చు తగ్గిస్తుంది. అయినప్పటికీ ఛార్జింగ్ ఖర్చు, సర్వీసింగ్, ఇన్సూరెన్స్, భవిష్యత్తులో బ్యాటరీ మార్పిడి లాంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇవన్నీ కలిపి చూసినప్పుడు మాత్రమే నిజమైన ఖర్చు తెలుస్తుంది.

చాలా మంది ఈవీ కొనుగోలు చేస్తారు. కానీ, అవసరాలకు అనుకూలంగా ఉంటాయా? లేవా? అనేది ఆలోచించరు. ప్రతి EV ప్రతి ఒక్కరికి సరిపోదు. కొన్ని కార్లు నగర ప్రయాణాలకు బాగుంటే, మరికొన్ని లాంగ్ డ్రైవ్స్‌ కు అనుకూలంగా ఉంటాయి. కేవలం డిజైన్, బ్రాండ్ చూసి కాకుండా, మీ రోజువారీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు చేయాలి. మంచి సర్వీస్ సపోర్ట్, అప్డేట్ అయ్యే ఫీచర్లు ఉన్న మోడల్‌ ను ఎంచుకోవడం మంచిది.

Read Also: డ్రైవింగ్ లో కారు విండ్‌ షీల్డ్‌ పగిలిందా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×