E-Paper
Advertisement

స్విఫ్ట్ To ఫ్రాంక్స్.. హైబ్రిడ్స్ గా మారబోతున్న 7 మారుతి మోడల్స్ ఇవే!

స్విఫ్ట్ To ఫ్రాంక్స్.. హైబ్రిడ్స్ గా మారబోతున్న 7 మారుతి మోడల్స్ ఇవే!
Advertisement

Upcoming Maruti Hybrid Cars: భారత్ లో హైబ్రిడ్ కార్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. పెట్రోల్ ధరలు పెరగడం, మంచి మైలేజ్ కావాలనుకునే వినియోగదారుల ఆలోచన, అలాగే ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి పెరగడం వల్ల ఇప్పుడు కంపెనీలు హైబ్రిడ్ టెక్నాలజీపై ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. ఈ లిస్టులో మారుతి సుజుకి ముందంజలో ఉంది. కంపెనీ తన పాపులర్ మోడళ్లకు హైబ్రిడ్ వెర్షన్లు తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మారుతి ప్రస్తుతం తక్కువ ఖర్చుతో తయారయ్యే కొత్త సిరీస్ హైబ్రిడ్ టెక్నాలజీపై పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టెక్నాలజీని రానున్న రోజుల్లో తన కార్లలో ఉపయోగించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్కువ మైలేజ్ ఇవ్వడమే లక్ష్యంగా ఈ టెక్నాలజీని రూపొందిస్తోంది. హైబ్రిడ్ వెర్షన్లుగా మారబోతున్న మారుతి కార్లు ఏవనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ మారుతి సుజుకి ఫ్రాంక్స్

ఈ కొత్త టెక్నాలజీని మారుతి సుజుకి ఫ్రాంక్స్ ముందుగా పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో మంచి అమ్మకాలు సాధిస్తున్న ఫ్రాంక్స్‌ కు హైబ్రిడ్ వెర్షన్‌ను 2027లో విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో 1.2 లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఆధారిత హైబ్రిడ్ సెటప్ ఉండొచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ మోడల్ 35 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఇవ్వగలదని అంచనా వేస్తున్నారు.

⦿ మారుతి సుజుకి స్విఫ్ట్

Advertisement

స్విఫ్ట్ కూడా త్వరలో హైబ్రిడ్ టెక్నాలజీతో రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న స్విఫ్ట్ 1.2 లీటర్ Z12E పెట్రోల్ ఇంజిన్‌ తో వస్తోంది. భవిష్యత్తులో ఇదే ఇంజిన్ ఆధారంగా సిరీస్ హైబ్రిడ్ సిస్టమ్‌ను అందించే అవకాశం ఉంది.  మైలేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

⦿ మారుతి సుజుకి డిజైర్

స్విఫ్ట్ సెడాన్ వెర్షన్‌ గా భావించే డిజైర్ కూడా హైబ్రిడ్ వెర్షన్‌ను పొందొచ్చు. ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న డిజై ర్‌కు కొత్త హైబ్రిడ్ సిస్టమ్‌ను జోడిస్తే, ఇది మరింత ఇంధన సామర్థ్యాన్ని అందించే సెడాన్‌గా మారే అవకాశం ఉంది.

⦿ మారుతి సుజుకి బాలెనో

Advertisement

బాలెనో కూడా ఈ జాబితాలో ఉంది. ఫ్రాంక్స్ అదే ప్లాట్‌ ఫారమ్‌ పై రూపొందిన మోడల్ కావడంతో, బాలెనోకు కూడా ఇదే హైబ్రిడ్ సెటప్ వచ్చే అవకాశం ఉందని అంచనా. దీంతో ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్ సెగ్మెంట్‌ లో మారుతికి మరింత బలం చేకూరనుంది.

⦿ మారుతి సుజుకి ఎర్టిగా, XL6

ఫ్యామిలీ కార్లుగా పేరొందిన మారుతి సుజుకి ఎర్టిగా, XL6 కూడా హైబ్రిడ్ టెక్నాలజీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇవి 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తున్నాయి. భవిష్యత్తులో గ్రాండ్ విటారా తరహా స్ట్రాంగ్ హైబ్రిడ్ సెటప్‌ను వీటిలో అందించవచ్చని భావిస్తున్నారు.

⦿ మారుతి సుజుకి బ్రెజ్జా

మారుతి సుజుకి బ్రెజ్జా హైబ్రిడ్ వెర్షన్‌ పై కూడా కంపెనీ పని చేస్తున్నట్లు సమాచారం. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌ లో పెరుగుతున్న పోటీ కారణంగా బ్రెజ్జాకు హైబ్రిడ్ టెక్నాలజీ ఇవ్వడం మారుతికి ఉపయోగపడొచ్చు.

Read Also: మండే ఎండలోనూ కూల్ గా ఉండే బెస్ట్ 7-సీటర్ కార్లు.. ధర కూడా తక్కువేనండోయ్!

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×