లేటైనా లేటెస్ట్ నిర్ణయం. కరెక్టు తీర్పు. కేరళం సీఎంగా వీడీ సతీషన్‌గా అధిష్టానం తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా ఆమోదం లభించింది. అంట ఇక్కడ కేసీ వేణుగోపాల్‌కు ఇవ్వలేదు కాబట్టి.. కరెక్టు నిర్ణయమని కాదు. ఇద్దరి మధ్య పోటీ నేపథ్యంలో.. ఇద్దరూ సమ ఉజ్జీలుగా అధిష్టానం ఎవరికి ఇవ్వాలనే క్లిష్టమైన టాస్క్ ఎదురైన సందర్భంలో.. సమీకరణలు.. ప్రయార్టీలు, లోకల్ ఇంపార్టెన్స్.. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నప్పుడు.. అధిష్టానం వీడీ సతీషన్ వైపే మొగ్గు చూసింది. అదే సరైన నిర్ణయం కూడా.
కేసీ వేణుగోపాల్ పేరు చివర వరకు లైవ్‌లో ఉన్నా.. ఆయన అధిష్టానానికే నిర్ణయాన్ని వదలేశాడు. దీంతో పెద్దరికంగా ఉంటూ పార్టీ కర్తవ్యాన్ని తూచా తప్పకుండా పాటించే సైనికుడిగానే మెలుసుకుని .. అధిష్టానం వద్ద మరింతగా తన పరపతిని పెంచుకున్నాడే తప్ప.. ఎక్కడా తగ్గలేదు. సీఎం సీటు కోసం వెంపర్లాడలేదు. కానీ కేరళం విజయం వెనుక కర్త, కర్మ, క్రియా.. అంతా తానై వ్యవహరించాడు కేసీ. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఇక్కడ వీడీ సతీషన్‌ను కూడా తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. డౌన్ టు ఎర్త్..గా తన రాజకీయ భవితవ్యాన్ని ఒక్కొక్క మెట్టుగా ఆయన ఎక్కుతున్న క్రమం.. నిర్మించుకుంటున్న వస్తున్న క్రమశిక్షణతో కూడిన రాజకీయ వ్యవహారం.. ప్రతిపక్షాలను, మిత్రపక్షాలను కూడా ఆకట్టుకున్నాయి.
పార్టీలకతీతంగా, లోకల్ లీడర్‌గా, వీడీ సతీషన్‌కు ఇవ్వడం ద్వారా అక్కడ కాంగ్రెస్ మరింత బలపడుతుందనే సంకేతాలే వెళ్లాయి అధిష్టానానికి. కేసీ వేణుగోపాల్‌కు ఇవ్వడం ద్వారా వచ్చే ఎంపీ బై ఎలక్షన్.. ఢిల్లీ కేంద్రంగా తనదైన రాజకీయ పట్టు సాధించి.. మంచి వ్యూహకర్తగా రాహుల్‌కు కుడిభుజంలా ఎదిగిన నేతగా ఉన్న తరుణంలో.. కేరళంకు తను మారాల్సిన వచ్చినప్పుడు కొంత అధిష్టానంతో గ్యాప్ అయితే ఏర్పడుతుంది. దీన్ని కూడా రాహుల్ పరిగణలోకి తీసుకున్నట్టు అనిపిస్తుంది. వ్యూహాలు పన్నడంలో, రాష్ట్రాల మధ్య సమన్వయం చేయడం.. పార్టీ పటిష్టత, ప్రభుత్వాల బలోపేతం.. వీటన్నింటినీ ఒంటిచేత్తో పరిష్కరించగల, సలహాలు, సూచనలు ఇవ్వగల నేర్పరిగా కేసీకి మంచి పేరుంది.
ఆయనలోని వాక్చూతుర్యం, సందర్బోచితంగా స్పందించే విధానం, స్థిత ప్రజ్ఞత.. ఇవన్నీ రాహుల్‌ను ఆకట్టుకున్నాయి. ఆయన ఎట్టి పరిస్థితుల్లో 10 జన్‌పత్‌తో కేసీకి దూరం పెంచదలుచుకోలేదు. అందుకే.. కేసీ పెద్దరికాన్ని మరింత పెంచాడే తప్ప తగ్గించలేదు. వేణుగోపాల్ కూడా అధిష్టానం మదిలోని భావాలను గుర్తెరిగిన నేతగా.. తన ప్రాధాన్యతను గుర్తింపునిచ్చే సందర్భాన్ని గుర్తించి గౌవరించాడే తప్ప.. ఎక్కడా తన పరిధి దాటి ప్రవర్తించలేదు. అయితే కేసీ వేణుగోపాల్‌ను సీఎం చేయాలనే రాహుల్ కోరిక.. అందుకే ఇంత కాలం సమయం తీసుకున్నట్టు అనిపిస్తుంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా ఆయన అభ్యర్థిత్వానికే జై కొట్టారు. కానీ సమీకరణలు, ప్రాక్టికల్ పర్యవసానాలు.. అధిష్టాం అవసరాలు, కేసీ చాతుర్యత, వ్యూహాలు.. ఇవన్నీ కూడా తక్షణ అవసరాలుగా రాహుల్ వాటికే ప్రయార్టీ ఇచ్చాడు. దీంతో కేసీ.. ఢిల్లీ రాజకీయాలకు దూరం కావడం ఎంత మాత్రం సబబుకాదనే విషయంలో ఓ క్లారిటీకి వచ్చిన తరువాత.. సతీషన్ క్వాలిటీస్, క్వాలిఫికేషన్స్.. ప్లస్‌లు.. ఇవన్నీ పరిగణలోకి తీసుకోవడం ఆయనకే సీఎం చాన్స్ ఇవ్వడం.. కేరళం సీఎం క్లైమాక్స్‌కు శుభం కార్డు పడింది.