E-Paper
Advertisement

New TVS Zest 110: సూపర్ లుక్, వావ్ అనిపించే ఫీచర్లు, ఆకట్టుకుంటున్న కొత్త టీవీఎస్ జెస్ట్ 110!

New TVS Zest 110: సూపర్ లుక్, వావ్ అనిపించే ఫీచర్లు, ఆకట్టుకుంటున్న కొత్త టీవీఎస్ జెస్ట్ 110!
Advertisement

New TVS Zest 110 Scooty 2026: టీవీఎస్ మోటార్ సైకిల్ కంపెనీ యువతను ఆకట్టుకునే స్కూటర్లు, బైకులను మార్కెట్లోకి తీసుకొస్తుంది. అందులో భాగంగానే TVS Zest 110ను విడుదల చేసింది. ప్రస్తుతం టీవీఎస్ మోడల్స్ లో ఇది బాగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా మహిళలు, యువతను ఆకట్టుకునేలా డిజైన్ చేసింది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో అందుబాటులో ఉన్న BS6 కంప్లయంట్ మోడల్ గురించి ఇప్పుడు తెలుసుకుంది.

New TVS Zest 110 ధర, స్పెసిఫికేషన్లు

New TVS Zest 110 బేస్ వేరియంట్ ధర రూ.69,941 నుంచి రూ.70,850 వరకు ఉంది. టాప్ వేరియంట్ ధర రూ. 75,297 నుంచి రూ. 75,750 వరకు ఉంది. ఈ ధర ఆయా నగరాలు, రాష్ట్రాలను బట్టి మారే అవకాశం ఉంటుంది. ఇక స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే 109.7 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ BS6 ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 7.71 bhp పవర్, 8.8 Nm టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఆటోమేటిక్ పవర్ ట్రైన్ ను కలిగి ఉంది. ఈ బైక్ 45 నుంచి 48 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. గరిష్ట వేగం గంటకు 90 కిలో మీటర్లు ఉంటుంది. పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ 5 లీటర్లు ఉంటుంది.  ఫ్రంట్, రియర్ డ్రమ్ బ్రేకింగ్ ఉంటుంది. సీటు కింద 19 లీటర్ల స్టోరేజ్ ఉంటుంది.

New TVS Zest 110 ఫీచర్లు

Advertisement

ఈ స్కూటర్ లో కాంపాక్ట్, స్టైలిష్ రెట్రో లుక్, రౌండ్ హెడ్‌లైట్ ఉంటుంది. డ్యూయల్ టోన్ బాడీ, స్లిమ్ సీట్ ఉంటుంది. కిక్,  సెల్ఫ్ స్టార్ట్, USB చార్జింగ్ పోర్ట్, పార్కింగ్ బ్రేక్, డే టైమ్ రన్నింగ్ లైట్స్, డిజిటల్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. సేఫ్టీ కోసం సింక్రనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్,  సైడ్ స్టాండ్ ఇండికేటర్, ట్యూబ్‌లెస్ టైర్స్ ఉంటాయి. ఈ స్కూటర్ మొత్తం 8 రంగుల్లో అందుబాటులో ఉంది. మ్యాట్ బ్లాక్, మ్యాట్ రెడ్, మ్యాట్ బ్లూ, మ్యాట్ పర్పుల్, గ్లోస్ రెడ్, గ్లోస్ బ్లాక్, గ్లోస్ బ్లూ, గ్లోస్ పర్పుల్ రంగుల్లో లభిస్తుంది.

New TVS Zest 110 పెర్ఫార్మెన్స్  

ఈ స్కూటర్  సిటీలో 45 కిలో మీటర్లు, హైవేలో 48 కిలో మీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. రిఫైన్డ్ ఇంజిన్ కాబట్టి స్మూత్ రైడ్,  పవర్ మోడరేట్ ఉంటుంది. సిటీ ట్రాఫిక్‌లో అజైల్, లో ఎండ్ టార్క్ మంచిది. టాప్ స్పీడ్ 90 కిలో మీటర్లు ఉంటుంది

అనుకూల, ప్రతికూల అంశాలు

Advertisement

New TVS Zest 110 లైట్‌వెయిట్, మహిళలకు ఈజీగా ఉంటుంది. మంచి మైలేజ్, స్టోరేజ్ ఉంటుంది. ధర కూడా తక్కువగా ఉంటుంది. మంచి స్టైల్, ఎక్కువ రంగుల్లో ఉంటుంది. ఇక ప్రతికూల అంశాలకు వస్తే పవర్ కాస్త తక్కువగా ఉంటుంది. హైవే ప్రయాణంలో కాస్త ఇబ్బంది ఉంటుంది. డ్రమ్ బ్రేకులు మాత్రమే ఉన్నాయి. డిస్క్ లేదు. బేసిక్ ఫీచర్లు ఉన్నాయి. కనీసం, బ్లూటూత్ కూడా లేదు. మహిళలు, కాలేజ్ స్టూడెంట్స్‌కు సరైన స్కూటర్. ఇక ఈ స్కూటర్ ప్రస్తుతం మార్కెట్ లో ఉన్నహీరో ప్లేజర్ ప్లస్, హోండా యాక్టివా 6Gతో పోటీ పడుతుంది.

Read Also: రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 Vs యమహా XSR 155.. వీటిలో ఏది బెస్ట్ అంటే?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×