E-Paper
Advertisement

Enfield Hunter 350 vs Yamaha XSR 155: రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 Vs యమహా XSR 155.. వీటిలో ఏది బెస్ట్ అంటే?

Enfield Hunter 350 vs Yamaha XSR 155: రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 Vs యమహా XSR 155.. వీటిలో ఏది బెస్ట్ అంటే?
Advertisement

భారతీయ మార్కెట్ లో రాయల్ ఎన్ఫీల్డ్, యమహా బైక్స్ యూత్ ను తెగ అట్రాక్ట్ చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు సరికొత్త బైక్స్ ను తీసుకొస్తూ అమ్మకాల్లో దుమ్మురేపుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు కంపెనీలకు చెందిన  రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350, యమహా XSR 155 మంచి ఆదరణ దక్కించుకున్నాయి. నియో రెట్రో స్టైల్ లో అందుబాటులోకి వచ్చిన ఈ బైక్స్ ఇండియాలో బాగా పాపులర్ మోడల్స్ గా గుర్తింపు తెచ్చుకున్నాయి. హంటర్ 350 రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ థంప్, రిలాక్స్డ్ రైడింగ్‌కు బాగా పాపులర్ అయ్యింది. యమహా XSR 155 మోడర్న్, లైట్‌ వెయిట్, అజైల్ పెర్ఫార్మెన్స్‌  తగినట్లుగా ఉంటుంది. ఈ రెండు బైక్స్ మధ్య తేడాలు ఏంటి? ఏది బెస్ట్? అనేది ఇప్పుడు చూద్దాం..

ధరలు, ఫీచర్లు..

 

⦿ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350

Advertisement

ఈ బైక్ ధర రూ. 1.38 లక్షల నుంచి రూ. 1.66 లక్షల వరకు ఉంటుంది. హంటర్ 350 బేస్ మోడల్ చౌకగా ఉంటుంది. టాప్ వేరియంట్ యమహా XSR 155 కంటే ధర ఎక్కువ ఉంటుంది. ఈ బైక్ 349 సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 20.2 bhp పవర్, 27 Nm టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ పవర్ ట్రెయిన్ ను కలిగి ఉంటుంది. 130 కిలో మీటర్ల టాప్ స్పీడ్ ఉంటుంది. 35-36.2 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. ప్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్లు. ఫ్రంట్ డిస్క్, రియర్ డ్రమ్, డిస్క్ వెర్షన్లలో ఉంటుంది. ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక ట్విన్ షాక్స్ సస్పెన్షన్ ను కలిగి ఉంటుంది. డిజిటల్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, USB చార్జింగ్, ట్రిప్పర్ నావిగేషన్ ఉంటుంది.

⦿ యమహా XSR 155

ఈ బైక్ ధర రూ. 1.50 లక్షలు ఉంటుంది. 155 సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది.  18.1 bhp పవర్, 14.2 Nm టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ పవర్ ట్రెయిన్ తో వస్తుంది. 45-46 కిలో మీటర్ల మైలేజ్, 10 లీటర్ల ప్యూయెల్ ట్యాంట్ కుంటుంది. ఫ్రంట్, రియర్ డిస్క్, సింగిల్ ఛానల్ ABSను కలిగి ఉంటుంది. ఫుల్ LED లైటింగ్, డిజిటల్ LCD క్లస్టర్, స్లిప్పర్ క్లచ్, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది.

డిజైన్, బిల్డ్ క్వాలిటీ

Advertisement

⦿ హంటర్ 350: క్లాసిక్ రెట్రో లుక్, రౌండ్ హెడ్‌ లైట్, స్లిమ్ ట్యాంక్, స్పోక్ వీల్స్ ను కలిగి ఉంటుంది. హెవీ మెటల్ బిల్డ్, స్టీల్ చాసిస్ తో వస్తుంది. సిటీ, హైవే రైడింగ్‌కు సూటబుల్ గా ఉంటుంది.

⦿ యమహా XSR 155: మోడర్న్ రెట్రో స్టైల్, రౌండ్ LED హెడ్‌ లైట్, ఫ్లాట్ సీట్, అల్లాయ్ వీల్స్ ను కలిగి ఉంటుంది. డెల్టా బాక్స్ ఫ్రేమ్, లైట్‌ వెయిట్ తో ఉంటుంది. సిటీ ట్రాఫిక్ కు అనుగుణంగా ఉంటుంది.

ఫర్ఫార్మెన్స్, అనుకూల, ప్రతికూల అంశాలు   

హంటర్ 350: లాంగ్ స్ట్రోక్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. లో ఎండ్ టార్క్ ఎక్కువగా ఉంటుంది. సిటీలో ఈజీ రైడింగ్ ఉంటుంది. హైవేలో స్టేబుల్. కానీ వైబ్రేషన్స్ ఉండవచ్చు. డ్రాగ్ రేస్‌ లలో XSR కంటే మెల్లగా స్టార్ట్ అవుతుంది కానీ, టాప్ ఎండ్‌ లో బాగుంటుంది.  సిటీ రైడింగ్, మైలేజ్, ఫన్ కోసం యమహా XSR 155 బెస్ట్.

యమహా XSR 155: హై రెవ్వింగ్ ఇంజిన్, క్విక్ యాక్సలరేషన్, స్పోర్టీ హ్యాండ్లింగ్ ఉంటుంది. సిటీలో ఫాస్ట్ రైడింగ్ కు అవకాశం ఉంటుంది. హైవేలో హంటర్ కంటే తక్కువ టార్క్ కాబట్టి స్ట్రగుల్ ఉంటుంది. మైలేజ్ మెరుగ్గా ఉంటుంది. హైవే, పవర్, క్లాసిక్ ఫీల్ కోసం రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 బెస్ట్.

Read Also: ఒక్క ఛార్జ్ తో 600 కిలో మీటర్లు.. వెర్జ్ ఈవీ సరికొత్త సంచలనం!

Related News

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

వర్షాకాలంలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? ఈ 4 మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

Big Stories

Advertisement
×