E-Paper
Advertisement

Crime News: విషాదం.. ప్రియుడు వేధించాడని వాటర్ ట్యాంక్ పైనుంచి దూకి యువతి ఆత్మహత్య

Crime News: విషాదం.. ప్రియుడు వేధించాడని వాటర్ ట్యాంక్ పైనుంచి దూకి యువతి ఆత్మహత్య
Advertisement

Crime News: తీవ్ర విషాదం.. ప్రేమించినవాడు అనుమానించాడని.. వాటర్ ట్యాంక్ పైనుంచి దూకి యువతి సూసైడ్.. ఖమ్మం జిల్లా కొత్తగూడెం ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల ఐశ్వర్య, బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలస వచ్చి నాగోలు సమీపంలోని తట్టి అన్నారంలో నివాసముంటోంది. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లాకు చెందిన మహేష్‌ (ఆనంద్‌) అనే యువకుడితో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరిద్దరి సాన్నిహిత్యాన్ని గమనించిన పెద్దలు సైతం వీరి వివాహానికి పచ్చజెండా ఊపారు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఈ జంట మధ్య చిన్నపాటి మనస్పర్థలు చివరకు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఇద్దరి మధ్య వివాదం.. చివరకి అనంతలోకాలకు..

Advertisement

అయితే గత కొద్దిరోజులుగా ఐశ్వర్య ఫోన్‌లో తరచూ ఇతరులతో మాట్లాడుతోందన్న నెపంతో మహేష్ ఆమెను వేధించడం ప్రారంభించాడు. ప్రేమికురాలిపై పెంచుకున్న అనుమానం పెనుభూతమై, ఆమె ప్రవర్తనను తప్పుబడుతూ మానసిక ఒత్తిడికి గురిచేశాడు. ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీన తట్టిఅన్నారం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్ వద్ద ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. నమ్మాల్సిన వాడే నిందలు వేయడంతో మనస్తాపానికి గురైన ఐశ్వర్య, తీవ్ర ఆవేదనతో అక్కడికక్కడే వాటర్ ట్యాంక్ పైనుంచి కిందికి దూకేసింది.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఐశ్వర్య మృతి

Advertisement

తీవ్రంగా గాయపడిన యువతిని గమనించిన స్థానికులు తక్షణమే ఆసుపత్రికి తరలించారు. చావుబతుకుల మధ్య పోరాడుతూ మూడు రోజుల పాటు చికిత్స పొందిన ఐశ్వర్య, బుధవారం నాడు పరిస్థితి విషమించి కన్నుమూసింది. కళ్లముందే ఎదగాల్సిన బిడ్డ విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఒక కుటుంబాన్ని తీరని శోకంలో ముంచెత్తింది.

ఆనంద్‌పై యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు

ఈ ఘటనపై మృతురాలి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహేష్ వేధింపుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని వారు ఆరోపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

మరో ఘటన..

దారుణం.. మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం..

ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం విభరీతలపాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వర్ల జాషువా ప్రేమ పేరుతో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఆరోగ్యం క్షీణించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Also Read: బ్లో అవుట్ ముప్పు! భయం గుప్పిట్లో కోనసీమ ప్రజలు

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×