E-Paper
Advertisement

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!
Advertisement

Ampere ZYBER Electric Bike: ఆంపియర్ ఎలక్ట్రిక్.. ఇప్పుడు ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిల్ సెగ్మెంట్ లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది. కంపెనీ తొలిసారిగా ప్రదర్శించిన జైబర్ ఎలక్ట్రిక్ బైక్ కు తాజాగా భారత్ లో పేటెంట్ పొందింది. దీంతో ఈ బైక్ ప్రాజెక్ట్‌ ను ఆంపియర్ ఇంకా కొనసాగిస్తోందని తేలిపోయింది.

2025లో తొలిసారి ప్రదర్శన

ఆంపియర్ జైబ ర్‌ను తొలిసారిగా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌ పో 2025లో కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించింది. అప్పట్లో ఈ బైక్ డిజైన్‌తో పాటు దాని పనితీరు వివరాలు కూడా ఆసక్తిని పెంచాయి. ఆ సమయంలోనే ఇది ఉత్పత్తి మోడల్ కాదని కంపెనీ స్పష్టం చేసింది. బైక్ మార్కెట్లోకి రావడానికి ఇంకా కొంత సమయం పడుతుందని తెలిపింది. ఇప్పుడు పేటెంట్ రావడంతో జైబర్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయనే విషయం వెల్లడయ్యింది.

100 కిలోమీటర్ల వేగం

Advertisement

కాన్సెప్ట్‌ను ప్రదర్శించిన సమయంలో ఆంపియర్ జైబర్‌కు కొన్ని ఆసక్తికరమైన స్పెసిఫికేషన్లను వెల్లడించింది. ఇందులో 10kW ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ మోటార్‌తో బైక్ గరిష్టంగా గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని తెలిపింది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 200 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కూడా అప్పట్లో కంపెనీ వెల్లడించింది. అయితే, ఇవి కాన్సెప్ట్ మోడల్‌కు సంబంధించిన వివరాలు మాత్రమే. ప్రొడక్షన్ వెర్షన్‌ లో ఇదే పనితీరు ఉంటుందా? లేదా?  అనే విషయాన్ని ఆంపియర్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

స్ట్రీట్‌  ఫైటర్ లుక్

జైబర్ డిజైన్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. పేటెంట్‌లో కనిపిస్తున్న డిజైన్‌ను బట్టి.. కాన్సెప్ట్‌లో ఉన్న ఆకారాన్ని, స్ట్రీట్‌ ఫైటర్ తరహా రూపాన్ని కంపెనీ కొనసాగించినట్లు తెలుస్తోంది. ఈ బైక్‌లో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, ముందు, వెనుక డిస్క్ బ్రేకులు, ABS లాంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద స్పోర్టీ లుక్‌ తో బైక్‌ను రూపొందించినట్లు కనిపిస్తోంది.

LFP బ్యాటరీతో రానుందా?

Advertisement

జైబర్ కాన్సెప్ట్‌లో LFP బ్యాటరీని ఉపయోగిస్తున్నట్లు ఆంపియర్ తెలిపింది. అంతేకాదు, AC ఛార్జింగ్‌తో పాటు DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా ఈ బైక్ సపోర్ట్ చేస్తుందని అప్పట్లో చెప్పింది. అయితే, బ్యాటరీ సామర్థ్యం ఎంత అనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. ప్రొడక్షన్ మోడల్‌లో బ్యాటరీ, ఛార్జింగ్ టెక్నాలజీ, రేంజ్ వంటి అంశాల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.

మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది?

జైబర్‌ కు ప్రస్తుతం పేటెంట్ లభించినప్పటికీ.. బైక్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందనే విషయంపై కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ధర, పూర్తి స్పెసిఫికేషన్లు, బ్యాటరీ సామర్థ్యం, రేంజ్ వంటి వివరాలు కూడా తెలియాల్సి ఉంది.

Read Also: బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

Tags

Related News

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

కారులో రాకెట్ టెక్నాలజీ.. స్పేస్‌ ఎక్స్‌ తో టెస్లా కొత్త ప్రయోగం చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా XUV 3XO సరికొత్త రికార్డు.. 5 లక్షలు దాటిన సేల్స్!

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ. 1.65 లక్షల తగ్గింపు!

హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు.. 15 లక్షలు దాటిన అమ్మకాలు!

ట్రాక్షన్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్‌.. అప్ డేటెడ్ టీవీఎస్ రైడర్ లో అదిరిపోయే ఫీచర్లు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

Big Stories

Advertisement
×