E-Paper
Advertisement

Atumobile Atum Version 1.0: ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర జస్ట్ రూ. 61 వేలు, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Atumobile Atum Version 1.0: ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర జస్ట్ రూ. 61 వేలు, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

హైదరాబాద్ కు చెందిన అటుమొబైల్ ఎలక్ట్రిక్ కంపెనీ లోకాస్ట్ లో ఎలక్ట్రిక్ బైక్స్ ను తీసుకొచ్చే దిశగా కీలక అడుగులు ముందుకు వేస్తోంది. అందులో భాగంగానే అటుమొబైల్ అటమ్ వెర్షన్ 1.0 పేరుతో లో స్పీడ్ ఎలక్ట్రిక్ మోటర్‌ సైకిల్ పరిచయం చేసింది. 2020లో లాంచ్ అయిన మోడల్ మరిన్ని అప్ డేట్స్ తో వస్తోంది. ముఖ్యంగా ఇంట్రా సిటీ కమ్యూట్‌కు సూటబుల్‌ గా డిజైన్ చేయబడింది. ఇది మినిమలిస్టిక్ స్టైల్‌ ను కలిగి ఉంటుంది.  లైట్‌వెయిట్, ఎకో ఫ్రెండ్లీ గా ఉంటుంది. టాప్ స్పీడ్ 25 కిలో మీటర్లు కావడంతో దీనికి రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఇది అన్ని వయసుల వాళ్లు నడిపే అవకాశం ఉంది.

అటమ్ వెర్షన్ 1.0 స్పెసిఫికేషన్స్

ఈ బైక్ కమ్యూటర్ స్టైల్‌ తో వస్తుంది. Li-ion, 48V 26Ah బాయటరీని కలిగి ఉంటుంది. 0.34 నుంచి 1.25 kWh కెపాసిటీని కలిగి ఉంటుంది. ఒక్క ఛార్జ్ తో 100 కిలో మీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. అయితే, రోడ్ కండిషన్స్, లోడ్ బట్టి రేంజ్ మారే అవకాశం ఉంటుంది. టాప్ స్పీడ్ 25 కిలో మీటర్లు ఉంటుంది.  చార్జింగ్ టైమ్ 3 నుంచి 4 గంటలు పడుతుంది.  బ్యాటరీకి ఏడాది, మోటార్ కు రెండేళ్ల గ్యారెంటీ ఉంటుంది. ఈ బైక్ రెడ్, వైట్, బ్లూ, బ్లాక్, గ్రేలో అందుబాటుటో ఉంటుంది.

అటమ్ వెర్షన్ 1.0 ఫీచర్లు

Advertisement

అటమ్ వెర్షన్ 1.0 మినిమలిస్టిక్ స్టైల్, స్లిమ్ బాడీ, స్ప్లిట్ సీట్, స్పేషియస్ ఫ్లోర్‌ బోర్డ్, పోర్టబుల్ బ్యాటరీ సపోర్టుతో వస్తుంది.  ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ డిజిటల్ వెర్షన్ లో ఉంటుంది. స్పీడోమీటర్, ఓడో మీటర్, బ్యాటరీ లెవల్, ట్రిప్ మీటర్ ఉంటుంది. LED హెడ్‌ల్యాంప్, టెయిల్ లైట్, టర్న్ సిగ్నల్స్ ఉంటాయి. USB చార్జింగ్ పోర్ట్, సైడ్ స్టాండ్ సెన్సార్, లో బ్యాటరీ ఇండికేటర్, వాటర్ రెసిస్టెంట్ బాడీ ఉంటుంది.  డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, ట్యూబ్‌లెస్ టైర్లు, రిజెనరేటివ్ బ్రేకింగ్ ఉంటుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్, హబ్ మోటార్ ఉంటుంది. రన్నింగ్ కాస్ట్ కిలో మీటర్లకు జస్ట్ 10 పైసలు అవుతుంది.

Read Also: హోండా TO రాయల్ ఎన్ఫీల్డ్.. రూ. 1.5 లక్షల లోపు బెస్ట్ బైక్‌లు ఇవే!

అటమ్ వెర్షన్ 1.0  ధర

Advertisement

అటమ్ వెర్షన్ 1.0  బైక్ ధర రూ. 61,500గా ఉంటుంది. ఆన్ రోడ్ ధర రూ. 65,000 –  రూ.75,000 వరకు ఉంటుంది. ఈఎంఐ సదుపాయం కూడా ఉంటుంది. అఫర్డబుల్, లాంగ్ రేంజ్, లో రన్నింగ్ కాస్ట్, పోర్టబుల్ బ్యాటరీ, మేడ్ ఇన్ ఇండియా, లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అయితే టాప్ స్పీడ్ లిమిటెడ్,  హైవే రైడ్‌కు సూటబుల్ కాదు.  బిల్డ్ క్వాలిటీపై కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి.  దేశ వ్యాప్తంగా డీలర్లు, ఆన్‌లైన్ బుకింగ్ అవైలబుల్ ఉంది.  పెట్రోల్ బైక్‌లతో పోలిస్తే ఏడాదికి రూ.40 వేలకు పైగా సేవ్ చేసే అవకాశం ఉంటుంది.

Read Also: కిలో మీటర్ కు జస్ట్ 10 పైసల ఖర్చు, కైనెటిక్ లూనా అదిరింది బ్రో!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×