E-Paper
Advertisement

Paddle Shifters: మాన్యువల్ ఫీలింగ్ తో ఆటోమేటిక్ డ్రైవ్, ప్యాడిల్ షిఫ్టర్ల గురించి మీకు తెలుసా?

Paddle Shifters: మాన్యువల్ ఫీలింగ్ తో ఆటోమేటిక్ డ్రైవ్, ప్యాడిల్ షిఫ్టర్ల గురించి మీకు తెలుసా?
Advertisement

Automatic vs Manual Feel:  ఆటోమేటిక్ కార్లు ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్నాయి. ఒకప్పుడు డ్రైవింగ్ అంటే క్లచ్, గేర్‌ లివర్‌ తో ముందుకు సాగేది. కానీ,  ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో, డ్రైవింగ్‌ను మరింత సులభంగా, ఆసక్తికరంగా మార్చే ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. అందులో ముఖ్యమైనది ప్యాడిల్ షిఫ్టర్లు. వీటి కారణంగా ఆటో మేటిక్ కారును మ్యానువల్ గా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇంతకీ అదెలా సాధ్యం అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంతకీ ఏంటీ ప్యాడిల్ షిఫ్టర్లు?

ప్యాడిల్ షిఫ్టర్లు స్టీరింగ్ వీల్ వెనుక ఉండే చిన్న లివర్లు. ఇవి ఆటోమేటిక్, CVT కారులో గేర్లను చేతితో మార్చుకునే అవకాశం ఇస్తాయి. కుడి వైపు ఉన్న ‘+’ ప్యాడిల్ గేర్‌ ను పెంచుతుంది. ఎడమ వైపు ఉన్న ‘–‘ ప్యాడిల్ గేర్‌ ను తగ్గిస్తుంది. అంటే, స్టీరింగ్ నుంచి చేతులు తీయకుండా గేర్ మార్చుకునే అవకాశం ఉంటుంది. డ్రైవర్ కు ఈ విధానం చాలా ఈజీగా ఉంటుంది. అంతేకాదు, ప్యాడిల్ షిఫ్టర్లు ఉపయోగించడం చాలా ఈజీ కూడా. కారును డ్రైవ్,  స్పోర్ట్, మాన్యువల్ (M) మోడ్‌ లో పెట్టి, అవసరమైనప్పుడు ప్యాడిల్‌ ను నొక్కితే చాలు. వెంటనే కారులో గేర్ మారుతుంది. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ లో M1, M2 లాంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటివల్ల మాన్యువల్ కంట్రోల్‌ లో ఉన్నారని తెలుసుకోవచ్చు.

ప్యాడిల్ షిఫ్టర్లు ఎలా పని చేస్తాయంటే?

Advertisement

ప్యాడిల్ షిఫ్టర్లు రెండు విధాలుగా పనిచేస్తాయి. మొదటిది తాత్కాలిక మాన్యువల్ మోడ్. ఇందులో మీరు సాధారణ ఆటోమేటిక్ డ్రైవింగ్ చేస్తూ, అవసరమైనప్పుడు మాత్రమే ప్యాడిల్ ఉపయోగించవచ్చు. ఓవర్‌ టేక్ చేయాలనుకుంటే గేర్ తగ్గించి వెంటనే పవర్ పెంచుకోవచ్చు. కొంతసేపు ఉపయోగించకపోతే, కారు మళ్లీ ఆటోమేటిక్ మోడ్‌ లోకి వెళ్లిపోతుంది.

ఇక రెండోది పూర్తి మాన్యువల్ మోడ్. ఇందులో గేర్ లివర్‌ను M, S మోడ్‌ లో పెట్టి, పూర్తిగా ప్యాడిల్ షిఫ్టర్లతోనే డ్రైవ్ చేయాలి. ఇది స్పోర్టీ డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుంది. అయినప్పటికీ, కారు సిస్టమ్ ఇంజిన్‌ ను కాపాడేందుకు ఆటోమేటిక్‌ గా జోక్యం చేసుకుంటుంది.

ప్యాడిల్ షిఫ్టర్ల ఉపయోగం ఏంటి?

Advertisement

ప్యాడిల్ షిఫ్టర్ల ముఖ్యమైన ఉద్దేశం కంట్రోల్. మలుపుల్లోకి వెళ్లే ముందు గేర్ తగ్గించుకోవచ్చు. కొండల మీదికి ఎక్కేటప్పుడు గేర్‌ ను పట్టుకోవచ్చు. లేదంటే మైలేజ్ కోసం గేర్ త్వరగా పెంచుకోవచ్చు. ఇవన్నీ స్టీరింగ్ మీది నుంచి చేతులు తీయకుండానే చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఆటోమేటిక్ కంఫర్ట్‌ తో పాటు మాన్యువల్ ఫీలింగ్ కూడా వస్తుంది.

మాన్యువల్ కారులో ప్యాడిల్ షిఫ్టర్లు పెట్టుకోవచ్చా? అని చాలా మందికి అనుమానం వస్తుంది. అయితే, అలా చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే మాన్యువల్ గేర్‌ బాక్స్ పూర్తిగా మెకానికల్ గా పని చేస్తుంది. ప్యాడిల్ షిఫ్టర్లకు ఎలక్ట్రానిక్ కంట్రోల్ అవసరం. కన్వర్షన్ చేయాలంటే పెద్ద మార్పులు, ఖర్చు  ఎక్కవ అవుతుంది.  సింపుల్ గా చెప్పాలంటే, ప్యాడిల్ షిఫ్టర్లు కావాలంటే ఫ్యాక్టరీ నుంచే ఆ ఫీచర్ ఉన్న కారును కొనడం బెస్ట్.

Read Also: వామ్మో.. ఎండలో ఉన్న కారులో వెంటనే ఏసీ ఆన్ చేయడం ఇంత డేంజరా?

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×