E-Paper
Advertisement

Moles: అదృష్టాన్ని తీసుకొచ్చే పుట్టుమచ్చలు  ఎక్కడ ఉంటాయో తెలుసా..?

Moles: అదృష్టాన్ని తీసుకొచ్చే పుట్టుమచ్చలు  ఎక్కడ ఉంటాయో తెలుసా..?
Advertisement

Moles: మనుషులకు అదృష్టాన్ని తీసుకొచ్చే పుట్టుమచ్చలు ఎక్కడెక్కడో ఉంటాయో తెలుసా..? సాముద్రిక శాస్త్రం ప్రకారం కొన్ని పట్టుమచ్చలు కొందరి జీవితాలనే మార్చేస్తాయట. కూటికి గతి లేని వాడిని కూడా కోటీశ్వరుడిని చేసే పుట్టమచ్చలు ఉంటాయని పండితులు చెప్తున్నారు. అయితే ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉంటే కోట్లు సంపాదిస్తారో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

హిందూ జ్యోతిష్య శాస్త్రంలో భాగమైన సాముద్రిక శాస్త్రం ప్రకారం, శరీరంలో ఉండే పుట్టుమచ్చలు మన వ్యక్తిత్వాన్ని, భవిష్యత్తును సూచిస్తాయట. ముఖ్యంగా శరీరంలోని కొన్ని భాగాలలో పుట్టుమచ్చలు ఉండటం అదృష్టానికి, సిరిసంపదలకు సంకేతంగా భావిస్తారట. ఆ మచ్చలే మనుషుల జీవితాలను మార్చేస్తుంటాయట. అలాంటి పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

నుదురు మీద (Forehead): నుదుటి మధ్యలో పుట్టుమచ్చ ఉంటే వారు చాలా తెలివైన వారని, జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటారని సాముద్రిక శాస్త్ర పండితులు చెప్తున్నారు.  వీరికి ధనానికి లోపం ఉండదట. అయితే అదే పుట్టుమచ్చ నుదురుకు కుడివైపున ఉంటే.. ఆ వ్యక్తికి విపరీతమైన పేరు, ధనం వస్తుందట.

కుడి బుగ్గ మీద (Right Cheek): కుడి బుగ్గ మీద పుట్టుమచ్చ ఉన్నవారు వివాహం తర్వాత గొప్ప అదృష్టాన్ని పొందుతారట. వీరు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారట అలాగే కుటుంబంతో సంతోషకరమైన, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారట.

Advertisement

ముక్కు  మీద(Nose): ముక్కు కుడి వైపున లేదా ముక్కు కొనపై పుట్టుమచ్చ ఉంటే వారు తక్కువ కృషితో ఎక్కువ విజయాలు సాధిస్తారట. వీరికి జీవితంలో అనేక ప్రయాణాలు చేసే అవకాశం లభిస్తుందట. ఆర్థికంగా స్థిరమైన జీవితం పొందుతారట.

చెవుల మీద (Ears): చెవుల మీద పుట్టుమచ్చ ఉండటం అపారమైన తెలివితేటలకు సంకేతమట. ముఖ్యంగా చెవి కింది భాగంలో పుట్టుమచ్చ ఉంటే వారికి జీవితంలో ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు రావట. ప్రపంచంలో వీళ్లంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరట.

పై పెదవి మీద (Upper Lip): పై పెదవి మీద పుట్టుమచ్చ ఉన్నవారు మంచి ఆహారాన్ని, విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారట. అయితే వీరికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందట. అలాగే వీళ్లు కూడా అందరితో కలివిడిగా ఉండే స్వభావం  కలిగి ఉంటారట.

అరచేతి మీద (Palm): కుడి అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే అది గొప్ప ధనయోగాన్ని సూచిస్తుందట. ముఖ్యంగా పిడికిలి మూసినప్పుడు ఆ పుట్టుమచ్చ లోపల దాగిపోతే వారు చాలా సులభంగా డబ్బు సంపాదిస్తారట అంతే సులభంగా ధనాన్ని నిలబెట్టుకుంటారట.

అరికాలు మీద (Sole of the Foot): అరికాళ్ళలో పుట్టుమచ్చ ఉన్నవారు దేశవిదేశాలు తిరిగే అవకాశం పొందుతారట. వీరికి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయట. గొప్ప లీడర్లుగా ఎదుగుతారట. వీళ్లు ఎంచుకున్న రంగంలో నెంబర్‌వన్‌ పొజిషన్‌కు చేరుకుంటారట.

ఛాతీ కుడి వైపు (Right side of Chest):  ఛాతీకి కుడి వైపున పుట్టుమచ్చ ఉంటే వారు సమాజంలో గొప్ప గౌరవం, హోదా పొందుతారట. వీరి జీవితం ప్రశాంతంగా ఉండటమే కాకుండా ఆర్థికంగా స్థిరంగా ఉంటుందట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: తిరుమలలో మొదటి మెట్టు ఎందుకు ప్రత్యేకమో తెలుసా

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×