Chiranjeevi: ‘పుత్రోత్సాహం పుత్రుడు జన్మించినప్పుడు కలగదు.. జనులా పుత్రుని కనుగొని పొగడగ నాడు కలుగును’ అని చిన్నప్పుడు స్కూల్‌లో ఈ పద్యాన్ని చదువుకుని ఉంటారు. ఈ పద్యానికి ఉదాహరణ, భావం, అర్థం వంటి వన్నీ మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), రామ్ చరణ్ (Ram Charan)లను చూస్తే తెలుస్తాయి. ‘తండ్రిని మించిన తనయుడు’ అని అంతా అంటుంటారు.. అది కూడా చరణ్‌కే 100కి వెయ్యి శాతం వర్తిస్తుంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ల లెగసీని మోయడం, మరింత ముందుకు తీసుకెళ్లడం సామాన్యమైన విషయం కాదు. దానిని నిరూపించి, వారి కంటే ఎక్కువగా గొప్ప పేరును తెచ్చుకుంటున్నాడు రామ్ చరణ్. అందుకే చిరంజీవి (Chiranjeevi), తన కుమారుడిని చూసి ఎంతో గర్విస్తుంటారు. ఆ గర్వించే క్షణాలకు సంబంధించిన వీడియో ఒకటి, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ చేశారు.
Also Read- Sai Durgha Tej: నిన్ను అలా చూసి గూస్‌బంప్స్ వచ్చాయి చరణ్..
‘‘శ్రీరామజయం….! ఆ శ్రీరాముని అడుగుజాడల్లో నడిస్తే మనదే విజయం..! ఈ ఏడాది శ్రీరామనవమి (Sri Rama Navami) రోజు యాదృచ్చికంగా చరణ్ బాబు పుట్టినరోజు కలిసి రావడం ఎంతో సంతోషం. ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులతో పాటు రాముని చరణాల వద్ద తేజోరూపూడై కొలువుండే మా ఇలవేల్పు హనుమంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతూ.. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్…!’’ అని పోస్ట్ చేసిన చిరు, ఇంట్లో జరిగిన శ్రీరామనవవి పూజ, హోమంతో పాటు.. రామ్ చరణ్‌తో చేయించిన ప్రత్యేక పూజల వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో రామ్ చరణ్‌ని చూసిన వారంతా చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. రామ్ చరణ్ ఎంతో ఏకాగ్రతతో, నిష్టగా ఈ పూజలు చేయడం.. నానమ్మ, తల్లిదండ్రులు బ్లెస్సింగ్స్ తీసుకోవడం వంటివన్నీ తెలుగు వారి సాంప్రదాయాలను చాటుతున్నాయని, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read- UBS OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్.. ఎప్పుడు ?ఎక్కడంటే?
ఈ వీడియోకి వస్తున్న కామెంట్లలో ది బెస్ట్ కామెంట్ అంటే.. ‘అబ్బ.. ఎంత బాగున్నాడు.. ఎవరి దిష్టి తగలకూడదు’ అనేదే. ఈ కామెంట్ ఒక్కటి చాలు, మెగా అభిమానులు, ప్రేక్షకులు రామ్ చరణ్‌ను ఎంతగా ప్రేమిస్తున్నారో, ఎంతగా ఆరాధిస్తున్నారో తెలుసుకోవడానికి. ఇలాంటి కామెంట్స్ చిరు పోస్ట్‌కి చాలానే పడుతున్నాయి. మెగా ఫ్యామిలీ ఇలవేల్పు హనుమంతుడి అవతారంలో.. శ్రీరామనవమికి ‘పెద్ది’ గ్లింప్స్‌తో ఇవ్వాల్సిన ట్రీట్ ఇచ్చేశారు. ఇప్పుడీ వీడియోలు చేస్తున్న పూజలు, తీసుకుంటున్న బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మెగా ఫ్యాన్స్‌కి బోనస్ అని చెప్పుకోవచ్చు. నిజంగా, సినిమాలు ఎలా ఉన్నా.. మెగా ఫ్యామిలీలోని బాండింగ్స్ మాత్రం చాలా గొప్పగా ఉంటాయని ఈ వీడియో మరోసారి తెలియజేస్తోందంటే అస్సలు అతిశయోక్తి కానే కాదు. ఏమంటారు?
శ్రీరామజయం….!
ఆ శ్రీరాముని అడుగుజాడల్లో నడిస్తే మనదే విజయం..!
ఈ ఏడాది శ్రీరామనవమి రోజు యాదృచ్చికంగా చరణ్ బాబు పుట్టినరోజు కలిసి రావడం ఎంతో సంతోషం.
ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులతో పాటు…
రాముని చరణాల వద్ద తేజోరూపూడై కొలువుండే మా ఇలవేల్పు హనుమంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని… pic.twitter.com/WPQhI2IITS
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2026
Also Read- Peddi Movie: ‘ధురంధర్’ సెన్సేషన్ తర్వాత.. ‘పెద్ది’ కోసం జియో స్టూడియోస్ భారీ డీల్!