E-Paper
Advertisement

Automatic vs Manual Cars: ఆటోమేటిక్ vs మాన్యువల్.. రెండిటిలో ఏ కారు బెస్ట్ అంటే?

Automatic vs Manual Cars: ఆటోమేటిక్ vs మాన్యువల్..  రెండిటిలో ఏ కారు బెస్ట్ అంటే?
Advertisement

Automatic vs Manual Cars: సాధారణంగా  కారు కొనాలనుకునే వారికి ఫస్ట్ వచ్చే డౌట్, ఆటోమేటిక్ కారు తీసుకోవాలా?   మాన్యువల్ కారు తీసుకోవాలా? అని. అయితే, రెండు కార్లలో ఏది బెస్ట్? ఎందుకు అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఆటోమేటిక్ vs మాన్యువల్ కార్ల మధ్య తేడాలు

సింఫుల్ గా చెప్పాలంటే..  మాన్యువల్ కారులో డ్రైవర్ క్లచ్ నొక్కి, గేర్ లివర్‌ తో గేర్లు మార్చాలి. కానీ, ఆటోమేటిక్ కారులో ఇలా ఉండదు. ఈ పని కారు ఆటోమేటిక్ గా చేస్తుంది. క్లచ్ ఉండదు. కేవలం యాక్సిలరేటర్, బ్రేక్‌ మీద ఫోకస్ పెడితే సరిపోతుంది. నిజానికి సిటీ డ్రైవింగ్ కు ఆటోమేటిక్ కార్లు చాలా అనుకూలంగా ఉంటాయి. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు మాన్యువల్ కారులో తరచుగా క్లచ్ నొక్కడం, గేర్ మార్చడం ఇబ్బందిగా ఉంటుంది. కానీ, ఆటోమేటిక్‌ కారులో ఈ సమస్య ఉండదు. అందుకే ప్రస్తుతం నగరాల్లో ఎక్కువ మంది ఆటోమేటిక్ కార్లవైపు మొగ్గు చూపుతున్నారు. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వారికి కూడా ఇవి చాలా ఈజీగా ఉంటాయి.

Advertisement

ఇప్పుడు వస్తున్న ఆటోమేటిక్ గేర్‌ బాక్స్‌లు చాలా అడ్వాన్స్‌ గా మారాయి. పనితీరు కూడా మాన్యువల్ కార్లతో పోలిస్తే చాలా దగ్గరగా ఉంటుంది. ఫ్యూయెల్ ఎఫిషియెన్స్ కూడా గతంతో పోలిస్తే చాలా మెరుగైంది. అయితే, మాన్యువల్ కార్లు  ఆటోమేటిక్ కార్ల కంటే సాధారణంగా లక్ష నుంచి రెండు లక్షల వరకు ధర తక్కువగా ఉంటాయి. బడ్జెట్ తక్కువగా ఉన్నవారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. మెయింటెనెన్స్ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి.

మాన్యువల్ కార్లలో గేర్ నియంత్రణ పూర్తిగా డ్రైవర్ చేతిలో ఉంటుంది. ఇది హైవేలు, కొండ ప్రాంతాల్లో డ్రైవ్ చేసే సమయంలో ఉపయోగపడుతుంది. ఎక్కువ అనుభవం ఉన్న డ్రైవర్లు మాన్యువల్ కార్లను ఇష్టపడతారు. ఫ్యూయెల్ ఎఫిషియెన్సీ విషయానికి వస్తే, ఒకప్పుడు మాన్యువల్ కార్లే ఎక్కువ మైలేజ్ ఇస్తాయని భావించేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. లేటెస్ట్ ఆటోమేటిక్ కార్లు కూడా దాదాపు అదే స్థాయి మైలేజ్ ఇస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో సిటీ డ్రైవింగ్‌ లో ఇవే మరింత ఇంధన ఆదా ఇస్తాయి.

ఏ కారు కొంటే మంచిది?

Advertisement

ఎక్కువగా ట్రాఫిక్‌ లో  డ్రైవ్ చేసే అవకాశం ఉంటే, అలసట తగ్గాలని భావిస్తే, ఒకవేళ మీరు కొత్త డ్రైవర్ అయితే ఆటోమేటిక్ కారు కొనుగోలు చేయడం మంచింది. ఈ కారు  డ్రైవింగ్‌ ను ఈజీగా మార్చుతుంది. ఒకవేళ బడ్జెట్ పరిమితంగా ఉంటే, డ్రైవింగ్‌ పై పూర్తి కంట్రోల్ కావాలనుకుంటే, ఎక్కువగా హైవేలపై ప్రయాణిస్తే మాన్యువల్ కారు మంచిది.  ఏది కొనాలనేది ఆయా వినియోగదారుల అవసరాలను బట్టి ఆధారపడి ఉంటుంది.  సౌకర్యం కావాలంటే ఆటోమేటిక్… ఖర్చు తగ్గించుకోవాలంటే మాన్యువల్ బెస్ట్.

Read Also: ఈ బ్యాటరీ సైకిళ్లు ఉంటే.. పెట్రోల్ చింతే ఉండదు, వీటి ధర ఫీచర్స్ తెలిస్తే ఆశ్యరపోతారు!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×