E-Paper
Advertisement

Jayam Ravi: అసలు నాకు పెళ్లే కాలేదు.. సడన్ ట్విస్ట్ ఇచ్చిన జయం రవి!

Jayam Ravi: అసలు నాకు పెళ్లే కాలేదు.. సడన్ ట్విస్ట్ ఇచ్చిన జయం రవి!
Advertisement

Jayam Ravi: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు రవి మోహన్ (Ravi Mohan). ఇక తమిళంలో జయం సినిమాను చేసి ఊహించని పాపులారిటీ అందుకోవడంతో ఆ సినిమా పేరుని ఇంటిపేరుగా మార్చుకొని జయం రవిగా మారిపోయాడు. అటు తమిళ్లోనే కాదు తన చిత్రాలను తెలుగులో విడుదల చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. తెలుగులో కూడా పలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో మెప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే అటు కెరియర్ పరంగా ఇటు వ్యక్తిగతంగా సంతోషంగా కొనసాగుతున్న సమయంలో జయం రవి వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలు ఆయనను వార్తల్లో నిలిచేలా చేశాయి.

పెళ్లే కాలేదు -జయం రవి 

అలా ప్రేమించి, పెళ్లి చేసుకున్న ప్రముఖ సినీనటి ఆర్తితో విభేదాలు రావడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు . పైగా ఇద్దరు కొడుకులు ఉన్నప్పటికీ ఈ జంట విడాకులు తీసుకోవడానికి ఆసక్తి కనబరచడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా జయం రవి సింగర్ కెనీషాతో చనువుగా ఉండడం వల్లే ఆర్తి మరింత కృంగిపోయింది. ముఖ్యంగా తన భర్తకు దూరమవ్వాలని లేకపోయినా తన భర్త తనను దూరం పెడుతున్నాడు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది . ముఖ్యంగా వీరిద్దరి విడాకుల కేసు కోర్టులో నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో అటు జయం రవి కూడా సింగర్ కెనీషాతో చనువుగా ఉంటూ ఆమెనే వెంటబెట్టుకొని తిరుగుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం విడాకుల కేసు ఇంకా కోర్టులోనే ఉంది. ఇలాంటి సమయంలో తనకు ఇంకా పెళ్లే కాలేదు అంటూ కామెంట్లు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. జయం రవి కామెంట్లు విన్న నెటిజన్స్ ఇదెక్కడి ట్విస్ట్ అంటూ నోరెళ్ళబెడుతున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

అవివాహితుడిని అంటూ కామెంట్..

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే.. జయం రవి తన స్నేహితురాలు ప్రముఖ సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ తో కలసి గోవాలో ఒక విలాసవంతమైన బంగ్లా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.. అయితే ఈ బంగ్లా రిజిస్టర్ సమయంలో ” అవివాహితుడిగా” జయం రవి పేర్కొన్నట్లు సమాచారం. ఇక ఒకవైపు రవి తన భార్య ఆర్తి కి విడాకులు ఇచ్చినట్లు ప్రకటించినప్పటికీ.. చట్టపరంగా ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.. కానీ అంతలోనే ఇప్పుడు ఇలా పెళ్లే కాలేదు అంటూ పేర్కొనడం సంచలనంగా మారింది. మరి దీనిపై జయం రవి ఏదైనా స్పందిస్తారేమో చూడాలి.

సోషల్ మీడియాలో చర్చ..

పెళ్లయిన చాలా సంవత్సరాల తర్వాత ఈ సమాచారం బయటకు రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు ముఖ్యంగా ఒకవైపు ప్రస్తుతం విడాకుల కేసు విచారణలో ఉండగానే.. మరొకవైపు ఇలా అవివాహితుడిని అని చెప్పడం. చట్టరీత్యా సరైనదేనా అనే ప్రశ్న తలెత్తింది. సోషల్ మీడియాలో కూడా విడాకులు తీసుకోకుండా మనం ఇలా చెప్పవచ్చా ? అనే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది.ఇకపోతే ఈ వివాదంలో కెనీషా పేరు ప్రథమంగా వినిపిస్తోంది. జయం రవి , కెనీషా కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం అటు విదేశీ పర్యటనలను మొదలుకొని పార్టీ ఫోటోల వరకు ఇద్దరు కలిసి పంచుకోవడం వల్లే వీరిమధ్య ఎఫైర్ రూమర్లు పుట్టుకొస్తున్నాయి. మరి ఈ వివాదం ఎప్పటికీ ముగుస్తుందో చూడాలి.

Advertisement

also read:  Harish Shankar: నా 10 సినిమాలు ఆగిపోయాయి.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్ హరీష్ శంకర్!

Related News

కన్నీటి పర్యంతమవుతున్న మహారాజా హీరోయిన్.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

Big Stories

Advertisement
×