E-Paper
Advertisement

Brutale Ryden Helmet: ఆక్సర్ బ్రూటేల్ రైడెన్ హెల్మెట్ విడుదల, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Brutale Ryden Helmet: ఆక్సర్ బ్రూటేల్ రైడెన్ హెల్మెట్ విడుదల, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

వాహనదారులు సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయా హెల్మెట్ కంపెనీలు సరికొత్త హెల్మెట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. చూడ్డానికి స్టైల్ గా ఉండటంతో పాటు మంచి ప్రొటెక్షన్ ఇచ్చేలా హెల్మెట్లను రూపొందిస్తున్నారు. ప్రయాణ సమయంలో చక్కటి సౌకర్యంతో పాటు ఫీచర్లు ఉండేలా తయారు చేస్తున్నారు.  అందులో భాగంగానే ఆక్సర్ బ్రూటేల్ రైడెన్ అందుబాటులోకి వచ్చింది. ఆధునిక భద్రతా ప్రమాణాలు, వీకెంట్ రైడర్లకు అనుకూలంగా ఉండేలా ఫీచర్ సెట్‌ తో కూడిన స్టైల్ ఫార్వర్డ్ హెల్మెట్‌ గా మార్కెట్లోకి అడుగు పెట్టింది.  .

డిజైన్, క్వాలిటీ   

బ్రూటేల్ రైడెన్ ఆకట్టుకునేలా ఉంటుంది. దీని మీద ఉన్న గ్రాఫిక్స్ ఇట్టే అలరిస్తాయి. డ్యూయల్ రియర్ స్పాయిలర్లు హెల్మెట్ ఆకర్షణను మరింత పెంచుతాయి. హెల్మెట్ షెల్ పట్టుకోవడానికి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఫినిషింగ్ పూర్తిగా కాస్మెటిక్ ఫ్లెయిర్ కంటే క్వాలిటీని కలిగి ఉంటుంది. ఈ హెల్మెట్ సింగిల్ టోన్, డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

సేఫ్టీ స్టాండర్డ్స్

Advertisement

బ్రూటేల్ రైడెన్ ISI, DOT, ECE R-22.06 సర్టిఫికేషన్స్ ను కలిగి ఉంది. ఇది ప్రస్తుత ప్రపంచ భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. హెల్మెట్ ABS షెల్‌ ను ఉపయోగిస్తుంది.  డబుల్ D-రింగ్ లాకింగ్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది.

ఫిట్, ప్యాడింగ్, సౌకర్యం

ఈ హెల్మెట్ ధరించిన తర్వాత చాలా సురక్షితంగా అనిపిస్తుంది. చీక్ ప్యాడింగ్ ముఖాన్ని రక్షణగా ఉంటుంది. లైనర్లు తొలగించేలా ఉంటాయి. వాటిని ఉతికి శుభ్రం చేసేలా ఉంటాయి. ఈ హెల్మెట్ కళ్లజోడు పెట్టుకుని కూడా సౌకర్యవంతంగా ధరించే అవకాశం ఉంటుంది. బ్రూటేల్ రైడెన్ S నుంచి 2XL సైజ్ వరకు ఉంటుంది.

వెంటిలేషన్, ఎయిర్ ఫ్లో

Advertisement

బ్రూటేల్ రైడెన్ పలు ఎయిర్ ఇన్‌ టేక్‌ లు, ఎగ్జాస్ట్ వెంట్స్‌ ను కలిగి ఉంది. వీటిలో డ్యూయల్ స్పాయిలర్లతో లింకై ఉన్న బ్యాక్  అవుట్‌ లెట్లు ఉన్నాయి. వెంట్స్ చాలా యాక్టివ్ గా ఉంటాయి. మంచి ఎయిర్ ఫ్లోను అందిస్తాయి, సాధారణ రైడింగ్ పరిస్థితులలో హీట్ ను కంట్రోల్ చేస్తుంది.

వైజర్ పనితీరు, విజుబులిటీ   

హెల్మెట్ పిన్‌ లాక్ 70కి అనుగుణంగా ఉండే క్లియర్, స్క్రాచ్ రెసిస్టెంట్ వైజర్‌ తో వస్తుంది. ఆక్సర్ ఆప్టికల్ కచ్చితత్వాన్ని క్లెయిమ్ చేస్తుంది. వైజర్ లేకుండా రైడింగ్‌ తో పోలిస్తే చాలా స్వల్ప తేడా మాత్రమే ఉంది. వైజర్ సురక్షితంగా తన ప్లేస్ లో  లాక్ అవుతుంది. ఈజీగా తెరిచేలా స్విచ్‌ను కలిగి ఉంటుంది. అంతర్నిర్మిత అంతర్గత సన్ వైజర్, లివర్ ద్వారా కంట్రోల్ చేయబడుతుంది.

అదనపు సౌకర్యాలు

బ్రూటేల్ రైడెన్ బ్లూటూత్ కమ్యూనికేషన్ సిస్టమ్ కు సపోర్ట్ ఇచ్చేలా రూపొందించబడింది. స్పీకర్లు, మైక్రోఫోన్ కోసం స్థలం అందించబడింది. ఇది ఇంటర్‌ కామ్స్, నావిగేషన్ సిస్టమ్స్ ను ఉపయోగించే రైడర్లకు అనుకూలంగా ఉంటుంది.

బరువు, ధర..  

ఆక్సర్ బ్రూటేల్ రైడెన్ హెల్మెట్  బరువు సుమారు 1,600 ± 50 గ్రాములు ఉంటుంది. దీని  ధర రూ. 7,991గా ఉంటుంది. ఆన్ లైన్ తో పాటు కంపెనీ అధికారిక వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉంది.

Read Also: ఏథర్ రిజ్టా vs హోండా యాక్టివా ఇ.. వీటిలో ఏది కొంటే బెస్ట్?

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×