E-Paper
Advertisement

Kothagudem: కొత్తగూడెంలో రసవత్తర రాజకీయం.. కాంగ్రెస్‌పై సీపీఐ పార్టీ కుస్తీ..!

Kothagudem: కొత్తగూడెంలో రసవత్తర రాజకీయం.. కాంగ్రెస్‌పై సీపీఐ పార్టీ కుస్తీ..!
Advertisement

Kothagudem: స్వేఛ్చ బ్యూరో: నూతనంగా నగరపాలక సంస్థగా ఏర్పడిన కొత్తగూడెంలో రసవత్తర రాజకీయం నడుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో దోస్తీ చేసిన సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు నేడు మేయర్ పీఠం కోసం కుస్తీ పడుతున్నాయి. స్థానికంగా సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా మేయర్ పీఠం కోసం పావులు కదుపుతున్నాడు. కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు అత్యధికంగా పాల్వంచలో ఉండడంతో సిపిఐ కి లబించే అవకాశం ఉన్నట్లుగా చర్చ జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ సైతం సిపిఐ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అక్కడి స్థానికులు చర్చించుకోవడం గమనార్హం.

ప్రజలు గెలిపిస్తారని అంచనా..

సిపిఐ కి 20 కి పైగా, కాంగ్రెస్ కి 20 కి పైగా, బీఆర్ఎస్, ఇండిపెండెంట్ లకు చేరో ఐదు చొప్పున కొత్తగూడెం నగరపాలక సంస్థ ఎన్నికల్లో మొత్తం 60 డివిజన్లకు గానూ స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్న సిపిఐ పార్టీకి 20 స్థానాలకు పైగా, అదేవిధంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 20 స్థానాలకు పైగా గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కి 5, 98 మంది ఇండిపెండెంట్ లుగా నిలబడ్డప్పటికీ అందులో ఐదుగురిని మాత్రం ప్రజలు గెలిపిస్తారని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్, సిపిఐ పార్టీలు గత సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో అత్యధికంగా సిపిఐ పార్టీకి సంబంధించిన సర్పంచులు గెలిచారని ప్రచారం జరుగుతుంది. అందులో ఆరుగురిని సిపిఐ పార్టీ ఏకగ్రీవం చేసుకోగలిగిందని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సిపిఐ తో జతకట్టకపోవడంతో ఓట్లు చీలి బీఆర్ఎస్ పార్టీకి లాబిస్తుందని అనుకుంటున్నారు. అదేవిధంగా ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లోను కొనసాగుతుందని కొత్తగూడెం ప్రజల్లో వ్యక్తం అవుతోంది.

Advertisement

Also Read: Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

మరో 10 సీట్ల కోసం..

కొత్తగూడెం నగరపాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్, సిపిఐ పార్టీలు సమాన స్థానాలు గెలుచుకుంటాయని అక్కడి ప్రజలు అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్, ఇండిపెండెంట్ అభ్యర్థులు అయిదు చొప్పున గెలుచుకోగలిగితే మిగిలే పది స్థానాలకు కాంగ్రెస్, సీపీఐ పార్టీ కుస్తీ పట్టాల్సి వస్తుంది. ఈ పది స్థానాల్లో ఎవరు ఎక్కువ స్థానాలు గెలుచుకోగలిగితే ఆ పార్టీకి మేయర్ పీఠం దక్కే అధిక అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఈ పది స్థానాల్లో మరిన్ని సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటే సిపిఐ పార్టీ ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్, ఇంటిపెండెంట్ లపై ఆధారపడి పీఠం చేసికించుకునేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం.

Advertisement

Also Read: Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×