E-Paper
Advertisement

పల్సర్ 180 vs అపాచీ RTR 180.. రెండింటిలో ఏది బెస్ట్ బైక్?

పల్సర్ 180 vs అపాచీ RTR 180.. రెండింటిలో ఏది బెస్ట్ బైక్?
Advertisement

Bajaj Pulsar 180 vs TVS Apache RTR 180:  భారత మార్కెట్లో 180cc సెగ్మెంట్‌ లో బజాజ్ పల్సర్ 180, TVS అపాచీ RTR 180 గట్టిగా పోటీ పడుతున్నాయి. ఈ బైక్స్ ధర, పనితీరు, రోజువారీ వినియోగంలో ఒకేలా ఉంటాయి. కొత్తగా బైక్ కొనాలనుకునే వారికి ఏది బెటర్ అనే డౌట్ వస్తుంది. అలాంటి వారి కోసం రెండు బైక్స్ మధ్య తేడాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంజిన్, పనితీరు గురించి..

పల్సర్ 180లో 178.6cc ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది 17hp పవర్, 15Nm టార్క్ ఇస్తుంది. అటు అపాచీ RTR 180లో 177.4cc ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది కూడా 17hp పవర్ ఇస్తుంది. కానీ, టార్క్ మాత్రం కొంచెం ఎక్కువగా 15.5Nm ఉంటుంది. ఈ రెండూ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ తో వస్తాయి. పనితీరు పరంగా అపాచీ కొంచెం స్పోర్టీ ఫీల్ ఇస్తుంది. కానీ, పల్సర్ సాఫ్ట్‌ గా, సులభంగా డ్రైవ్ చేయడానికి అనువుగా ఉంటుంది.

Advertisement

ఇక బరువు, కొలతల విషయానికి వస్తే..  అపాచీ కాస్త ముందుంటుంది. ఈ బైక్ సుమారు 140 కేజీల బరువు ఉండగా, పల్సర్ 180 బరువు 156 కేజీలు. తక్కువ బరువు కారణంగా ట్రాఫిక్‌ లో అపాచీ ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. అపాచీకి 180mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉండగా, పల్సర్‌కు 165mm మాత్రమే ఉంటుంది. అయితే, పల్సర్‌లో 15 లీటర్ల పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ ఉండటం వల్ల సుదూర ప్రయాణాలకు ఇది బెటర్‌. అపాచీలో ట్యాంక్ 12 లీటర్లు ఉంటుంది.

ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

రెండు బైక్‌లు మంచి ఫీచర్లను కలిగి ఉంటాయి. పల్సర్‌లో పెద్ద డిస్క్ బ్రేకులు, డిజిటల్ కన్సోల్, LED లైటింగ్ లాంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. కానీ, అపాచీ RTR 180 మాత్రం మరింత అడ్వాన్స్‌ డ్ ఫీచర్లతో వస్తుంది. ఇందులో స్పోర్ట్, అర్బన్, రేన్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ఇవి పరిస్థితులకు అనుగుణంగా పవర్ డెలివరీ మార్చుతాయి. బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, కాల్ అలర్ట్స్ లాంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. గ్లైడ్ త్రూ టెక్నాలజీ వల్ల ట్రాఫిక్‌ లో క్లచ్ లేకుండా స్లోగా వెళ్లడం సులభం అవుతుంది.

ధర ఎంత ఉంటుందంటే?

Advertisement

పల్సర్ 180 ధర సుమారు రూ. 1.22 లక్షలు కాగా, అపాచీ RTR 180 ధర రూ. 1.26 లక్షలు. అంటే అపాచీ కొంచెం ఖరీదైనదే అయినా, అందులో వచ్చే అదనపు ఫీచర్లను చూస్తే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కంఫర్ట్, ఎక్కువ ఫ్యూయల్ ట్యాంక్, తక్కువ ధరలో కోరుకుంటే పల్సర్ 180 బెస్ట్ ఆప్షన్. లైట్ వెయిట్ బైక్, స్పోర్టీ పని తీరు, లేటెస్ట్ ఫీచర్లు కావాలనుకుంటే అపాచీ RTR 180 మంచి ఆప్షన్‌.

Read Also: హీరో ఎక్స్ ట్రీమ్ To అపాచీ.. చీప్ అండ్ బెస్ట్ డ్యూయల్ ఛానల్ ABS బైక్స్ ఇవే!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×