E-Paper
Advertisement

పండుగకు ముందు బజాజ్ బ్లాస్ట్.. ఒకేసారి 10 కొత్త మోడళ్లు ఎంట్రీ!

పండుగకు ముందు బజాజ్ బ్లాస్ట్.. ఒకేసారి 10 కొత్త మోడళ్లు ఎంట్రీ!
Advertisement

Upcoming Bajaj Pulsar 125 and 150: ఫెస్టివల్ సీజన్‌ ను లక్ష్యంగా చేసుకుని బజాజ్ ఆటో పెద్ద ఎత్తున కొత్త మోడళ్లను  మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. రాబోయే ఆరు వారాల్లో మొత్తం 10 కొత్త టూవీలర్ మోడళ్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇందులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పల్సర్ బ్రాండ్‌ లో రెండు కొత్త మోడల్స్ కూడా ఉండనున్నాయి. ఇవి 125cc, 150cc విభాగాల్లో అందుబాటులోకి రానున్నాయి.  కొత్త మోడళ్లతో పాటు తయారీ సామర్థ్యాన్ని కూడా భారీగా పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం సంవత్సరానికి సుమారు 7.2 మిలియన్ వాహనాలను తయారు చేసే సామర్థ్యం ఉన్న బజాజ్, దాన్ని 9 మిలియన్ యూనిట్లకు పైగా పెంచే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అంటే ప్రస్తుత సామర్థ్యంతో పోలిస్తే 25 శాతానికి పైగా విస్తరించాలాని భావిస్తోంది.

రెండు కొత్త పల్సర్ మోడల్స్ విడుదల

రాబోయే కొత్త మోడల్స్ కంపెనీ ఉత్పత్తుల శ్రేణిని మరింత బలోపేతం చేయనున్నట్లు బజాజ్ ఆటో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ శర్మ తలిపారు. కొత్తగా వచ్చే మోడళ్లలో 125cc, 150cc సెగ్మెంట్లలో రెండు కొత్త పల్సర్ బైక్‌లు ఉంటాయన్నారు. ఇప్పటికే నెక్ట్స్ జెనరేషన్ పల్సర్ 125 టెస్టింగ్ సమయంలో పలుమార్లు కనిపించింది. త్వరలోనే ఈ బైక్ అధికారికంగా మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. దీనితో పాటు చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించిన కొత్త వేరియంట్లను కూడా కంపెనీ పరిచయం చేయనుంది. రాబోయే ఆరు నెలలు బజాజ్‌ కు ఎంతో కీలకమని రాకేష్ శర్మ చెప్పారు. ఈ కాలంలో విడుదలయ్యే వాహనాలు కొత్త మార్కెట్ సెగ్మెంట్స్ ను లక్ష్యంగా చేసుకుంటాయని, వినియోగదారులకు మరిన్ని ఆప్షన్స్ అందిస్తాయన్నారు.

తయారీ సామర్థ్యం భారీగా పెంపు

Advertisement

తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు ఇప్పటికే ఉన్న ప్లాంట్లను విస్తరించడంతో పాటు, కొత్త గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయాలని కంపెనీ ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే ఆ ప్లాంట్‌ను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ విస్తరణను ఒకేసారి కాకుండా దశలవారీగా అమలు చేయనున్నారు. కొత్తగా పెరిగే ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రధానంగా ఎలక్ట్రిక్ టూ వీలర్లు, ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు, ప్రీమియం మోటార్‌ సైకిళ్లు, అలాగే ఎంపిక చేసిన ఐసీఈ త్రీ వీలర్ మోడళ్ల తయారీకి వినియోగించనున్నారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ మరింత పెరుగుతుందని కంపెనీ అంచనా వేస్తోంది.

మొత్తంగా, కొత్త పల్సర్ బైక్‌లు, చేతక్ కొత్త వేరియంట్లు, భారీ ఉత్పత్తి విస్తరణతో బజాజ్ ఆటో పండుగ సీజన్‌ను భారీగా క్యాష్ చేసుకోవడానికి సిద్ధమవుతోంది. మార్కెట్లో పోటీని మరింత పెంచే ఈ కొత్త మోడళ్ల కోసం టూ వీలర్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

Read Also: యమహా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లుక్ లీక్.. ఫీచర్లు చూస్తే షాక్ అవుతారు!

Related News

పెట్రోల్‌తో పాటు ఇథనాల్‌ తోనూ పరుగులు.. కియా సైరోస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు వచ్చేస్తోంది!

హీరో, హోండాకు టీవీఎస్ షాక్.. ఆగస్టులో నంబర్ వన్ టూ వీలర్ కంపెనీగా రికార్డ్!

కొత్త కలర్స్‌ తో కవాసకి Z సిరీస్.. నయా లుక్ సూపరో సూపరు!

కియా సోరెంటో వచ్చేసింది.. ఫార్చ్యూనర్‌ కు ఇక చుక్కలే!

హిమాలయన్ 440 వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

టాటా కర్వ్‌ లో కొత్త సిరీస్ X.. తక్కువ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు!

హోండా ఫ్యాన్స్‌ కు గుడ్‌న్యూస్.. ఎలివేట్, సిటీ, అమేజ్‌పై అదిరిపోయే డిస్కౌంట్లు!

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

Big Stories

Advertisement
×