E-Paper
Advertisement

గ్రహాంతర వాసుల కోసం.. అంతరిక్షంలోకి భారతీయ పాట.. ఖగోళంలో మార్మోగుతున్న సింగర్ స్వరం!

గ్రహాంతర వాసుల కోసం.. అంతరిక్షంలోకి భారతీయ పాట.. ఖగోళంలో మార్మోగుతున్న సింగర్ స్వరం!
Advertisement

Kesarbai Kerkar: భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపడుతున్న ప్రయోగాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇస్రో విజయాలు సాధించడానికి దశాబ్దాల క్రితమే భారతీయ గాయని తన స్వరంతో అంతరిక్షంలోకి ప్రవేశించారు. నాసా పంపిన ప్రతిష్టాత్మక నావికా నౌక ‘వోయేజర్-1’ ద్వారా ఆమె గొంతు నేటికీ విశ్వాంతరాళంలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఇంతకీ ఆ గాయని ఎవరు? అంతరిక్షానికి ఆమె స్వరం ఎలా చేరింది? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

ఇంతకీ ఆ సింగర్ ఎవరంటే?

అంతరిక్షానికి స్వరం చేరిన మెుట్టమెుదటి గాయనిగా హిందూస్తానీ సంగీత దిగ్గజం, ‘సురశ్రీ’ కేసర్ బాయి కేర్కర్ రికార్డు సృష్టించారు. ఆమె.. 1892 జులై 13న గోవాలోని ‘కేరి’ అనే చిన్న గ్రామంలో జన్మించారు. చిన్నతనంలో దేవాలయాల్లో విన్న కీర్తనలు, భజనల ప్రభావంతో సంగీతంపై ఆమెకు ఆసక్తి పెరిగింది. కుటుంబ సభ్యులు ఆమె ప్రతిభను గుర్తించి రామకృష్ణ బువా వాజే వద్ద ప్రాథమిక శిక్షణ ఇప్పించారు.

తొలినాళ్లలో విమర్శలు

Advertisement

ఆ తర్వాత 1908లో వీరి కుటుంబం ముంబయి మకాం మార్చినప్పుడు.. సితార్ లో గొప్ప ప్రావీణ్యం ఉన్న ఉస్తాద్ బర్కతుల్లా ఖాన్ వద్ద కేసర్ బాయి శిక్షణ పొందారు. అయితే 1918లో ఆమె పాడిన ‘మియా కీ మల్హర్’.. మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆమె కచేరిపై విమర్శలు వచ్చాయి. దీంతో జైపూర్ ఘరానాకు చెందిన ప్రముఖ విద్వాంసుడు ఉస్తాద్ అల్లాదియా ఖాన్ వద్దే సంగీతం నేర్చుకోవాలని ఆమె గట్టిగా నిశ్చయించుకున్నారు.

గాయన్ మహర్షి వద్ద శిష్యరికం

ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాధారణంగా తన కుటుంబ సభ్యులకు తప్ప బయటివారికి సంగీతం నేర్పేవారు కాదు. కానీ కేసర్ బాయి పట్టుదల, సంగీతం పట్ల ఆమెకు ఉన్న ఆసక్తిని చూసి ఆమెను శిష్యురాలిగా అంగీకరించారు. సుమారు 27 సంవత్సరాల పాటు ఆమె ఆయన వద్ద కఠినమైన శిక్షణ పొందారు. తద్వారా ఎంతటి క్లిష్టమైన స్వరాలనైనా సులువుగా పలికే నైపుణ్యాన్ని సంపాందించారు. సంగీతాన్ని కమర్షియల్ గా మార్చకూడదన్న ఉద్దేశంతో కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు వాణిజ్య రికార్డింగులను సైతం ఆమె తిరస్కరించారు.

 ‘సురశ్రీ’ బిరుదు

Advertisement

1938లో కలకత్తాలో రవీంద్రనాథ్ ఠాగూర్ నివాసంలో కేసర్ బాయి ఇచ్చిన ప్రదర్శన ఆయనను మైమరపించింది. ఆమె అద్భుతమైన గాత్రానికి ముగ్ధుడైన ఠాగూర్.. ఆమెను అభినందిస్తూ ఒక లేఖ రాశారు. ఆమె సంగీతాన్ని ప్రకృతి సిద్ధమైన అద్భుతంగా అభివర్ణిస్తూ ఆమెకు ‘సురశ్రీ’ (సంగీత దేవత) అనే బిరుదును ప్రదానం చేశారు. భారత ప్రభుత్వం కూడా ఆమె సేవలను గుర్తిస్తూ 1953లో సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని, 1969లో ‘పద్మభూషణ్’ బిరుదును అందించింది.

విశ్వంలో సురశ్రీ స్వరం

ఇదిలా ఉంటే 1877లో నాసా రోదసిలోకి ‘వోయేజర్ 1’ అనే వ్యోమనౌకను పంపింది. మానవ సంస్కృతి, కళలకు చిహ్నంగా ‘ది సౌండ్స్ ఆఫ్ ఎర్త్’ పేరుతో ఒక బంగారు పూత పూసిన రాగి డిస్క్‌ను అందులో ఉంచారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బీథోవెన్, మోజార్ట్ వంటి మహనీయుల సంగీతంతో పాటు, భారత్ నుండి కేసర్ బాయి కేర్కర్ పాడిన ‘జాత్ కహా హో’ (రాగ్ భైరవి) రికార్డింగ్‌ను ఎంపిక చేశారు. ప్రముఖ సంగీత శాస్త్రవేత్త రాబర్ట్ ఇ. బ్రౌన్ సిఫార్సు మేరకు దీనిని చేర్చారు.

Also Read: పోస్టాఫీసు డబ్బా ఎరుపు రంగులోనే ఎందుకు? అసలు మ్యాటర్ ఇదన్నమాట!

వయోభారంతో సంగీతానికి గుడ్ బై

దీంతో అప్పట్లో కేసర్ బాయి పేరు.. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. ఈ క్రమంలోనే వయోభారం చుట్టుముట్టడంతో గొంతు సహకరించక స్వచ్ఛందంగా సంగీత కచేరీల నుండి ఆమె వైదొలిగారు. 1977 సెప్టెంబరు 16న ఆమె తన చివరి శ్వాస విడిచారు. భౌతికంగా ఆమె మన మధ్య లేకపోయినా.. ఆమె అమర గానం ఇప్పటికీ అంతరిక్షంలో నిరంతరం మార్మోగుతూనే ఉంటుందని శాస్త్రవేత్తలు ప్రశంసిస్తున్నారు.

Also Read: వీఐ యూజర్లకు పండగే.. రూ. 189కే ఫ్రీ కాల్స్, డేటా.. సామాన్యులకు పర్ఫెక్ట్ ప్లాన్!

Related News

20,000mAh బ్యాటరీ.. 67W ఫాస్ట్ ఛార్జింగ్.. షావోమీ నుంచి మైండ్ బ్లోయింగ్ పవర్ బ్యాంక్!

వీఐ యూజర్లకు పండగే.. రూ. 189కే ఫ్రీ కాల్స్, డేటా.. సామాన్యులకు పర్ఫెక్ట్ ప్లాన్!

జియో బంపర్ ఆఫర్.. రూ. 175కే 10 జీబీ డేటా.. ఉచితంగా 11 ఓటీటీలు!

AC ఫ్యాన్ మోడ్.. కరెంట్ బిల్లు సగానికి తగ్గించుకునేందుకు సూపర్బ్ ట్రిక్!

ఈ జాకెట్ తొడుక్కుంటే.. గాలి నుంచే మంచినీళ్లు.. ఇదేదో భలే ఉందే!

ఇదేందయ్యా ఇది.. ఈ ఫ్రిడ్జ్‌లో మనుషులు కూర్చోవచ్చా? జపానోళ్లది బుర్రే బుర్ర!

లండన్ వేదికగా Galaxy Unpacked 2026 ఈవెంట్.. ఈసారి ఏమేం రాబోతున్నాయంటే?

Big Stories

Advertisement
×