E-Paper
Advertisement

Bajaj 8 New Pulsars: ఒకటి కాదు రెండు కాదు.. ఒకేసారి 8 పల్సర్ బైక్స్ లాంచ్!

Bajaj  8 New Pulsars: ఒకటి కాదు రెండు కాదు.. ఒకేసారి 8 పల్సర్ బైక్స్ లాంచ్!
Advertisement

Bajaj  8 New Pulsars Launch: బజాజ్ లాంచ్ చేసిన పల్సర్ బైక్ గురించి పెద్దగా పరిచయం లేదు. గత 25 సంవత్సరాలుగా ఇండియన్ మార్కెట్ లో ప్రజాదరణ తగ్గని బైక్ గా సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు ఈ బైక్ పలు అప్ డేట్స్ తో అందుబాటులోకి వచ్చింది. అనని మోడల్స్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ నేపథ్యంలోనే ఇదే లైనప్ ను మరింత విస్తరించాలని బజాజ్ కంపెనీ భావిస్తోంది.

మే 2026 నాటికి 8 పల్సర్ బైక్స్ లాంచ్

బజాజ్ ఆటో రాబోయే నాలుగు నెలల్లో  పల్సర్ పోర్ట్‌ ఫోలియోను పూర్తిగా అప్ డేట్ చేయబోతోంది. బజాజ్ ఆటో లిమిటెడ్ కోసం ఇటీవలి Q3 FY-26 ఎర్నింగ్ కాల్ సందర్భంగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ కీలక వివరాలను వెల్లడించారు.  మే 2026 నాటికి ఎనిమిది కొత్త పల్సర్ మోడళ్లను విడుదల చేస్తామని వెల్లడించారు. వీటిలో కొన్ని చిన్న చిన్న అప్ డేట్స్ ను కలిగి ఉంటే, మరికొన్ని పూర్తి స్థాయిలో అప్ డేట్ కానున్నట్లు వెల్లడించారు.

Advertisement

బజాజ్ కంపెనీ నవంబర్ నుంచి దాని పోర్ట్‌ ఫోలియోలో ఏడు వేర్వేరు అప్ డేట్స్ చేసినట్లు రాకేశ్ తెలిపారు. అందులో భాగంగానే ఇటీవలి కాలంలో 2026 పల్సర్ 150, పల్సర్ 125ను లాంచ్ చేసినట్లు వెల్లడించారు. ఇదే పద్దతిని ముందుకు కొనసాగించనున్నట్లు తెలిపారు. OG పల్సర్, NS సిరీస్, మరింత ఆధునిక N సిరీస్‌ ల తో సహా మొత్తం పోర్ట్‌ ఫోలియో  సమగ్ర మార్పును చూడబోతుందని కన్ఫార్మ్ చేశారు. ఈ మార్పులతో, 125cc, 150cc ప్లస్ విభాగాలలో ఇండస్ట్రీ మరింత వృద్ధిని సాధిస్తుందని బజాజ్ అంచనా వేస్తోంది.

ఏ సిరీస్ లో ఎక్కువ అప్ డేట్స్ ఉంటాయంటే?

N సిరీస్ ఆధారంగా ఉన్న ప్లాట్‌ ఫామ్ ఇప్పటికే చాలా కొత్త అప్ డేట్స్ ను కలిగి ఉన్నందున, దీనికి ఎటువంటి పెద్ద అప్‌గ్రేడ్స్ ఉండవని తెలుస్తోంది. అదే సమయంలో, పల్సర్ ఫ్యామిలీలోని చాలా బైక్స్ డిజైన్, ఇంజిన్, యాక్సెసరీస్ పరంగా చాలా కాలంగా ఉన్నందున NS లైనప్‌ ను చాలా వరకు మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా NS 160, NS 200 కు మరిన్ని సాంకేతికత, లుక్ విషయంలో మేకోవర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.  పెద్ద హార్డ్‌ వేర్ మార్పులు అంతగా ఉండకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Read Also: సుజుకి యాక్సెస్ ABS వచ్చేసింది.. ఫీచర్లు ఎలా ఉన్నాయి? ధర ఎంత అంటే?

పల్సర్ NS400Z విషయాని వస్తే..

ఇక పల్సర్ NS400Z విషయానికి వస్తే, ఫ్లాగ్‌ షిప్ పల్సర్ ఇంజిన్‌ను 350cc కంటే తక్కువకు తగ్గించి 18 శాతం GST కేటగిరీలోకి తీసుకురావచ్చు ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. ధరను మరింత సరసమైనదిగా మార్చే అవకాశం ఉంది.  అయితే, ట్రయంఫ్ 400cc ఆఫర్ల తగ్గింపుపై ప్రాథమిక దృష్టి ఉన్నందున దీనికి ఎక్కువ సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.

Read Also: ఏడుకు తోడు మరో మూడు.. విన్ ఫాస్ట్ ప్లాన్ మామూలుగా లేదుగా!

Related News

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

Big Stories

Advertisement
×