5 Star Safety Cars Under 10 Lakh: కారు కొనేటప్పుడు చాలామంది ముందుగా ధర, మైలేజ్, ఫీచర్లు చూస్తారు. కానీ, ఫ్యామిలీ కోసం కారు తీసుకునే సమయంలో వీటన్నింటికంటే ముఖ్యమైన విషయం సేఫ్టీ. రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో చెప్పలేం. అందుకే, కారులో ప్రయాణించే వారికి మంచి సేఫ్టీ కల్పించే మోడల్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం మార్కెట్లో అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లతో పాటు క్రాష్ టెస్టుల్లో మంచి రేటింగ్ సాధించిన కార్లు అందుబాటులో ఉన్నాయి. అందులో రూ.10 లక్షల్లోపు మోడల్స్ గురించి ఇప్పుడు చూద్దాం..
కాంపాక్ట్ SUV తరహాలో ఉండే టాటా పంచ్ ఫ్యామిలీ కోసం బెస్ట్ కారుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిన్న సైజులో ఉన్నప్పటికీ సేఫ్టీ విషయంలో మాత్రం ఆకట్టుకుంటుంది. బలమైన బాడీతో పాటు అవసరమైన సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉంటాయి. నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.
SUV స్టైల్, మంచి స్పేస్, సేఫ్టీ ఫీచర్ల కారణంగా టాటా నెక్సాన్ కు మంచి డిమాండ్ ఉంది. కుటుంబంతో లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లేవారికి ఉపయోగకరంగా ఉంటుంది. మంచి బిల్డ్ క్వాలిటీతో పాటు డ్రైవర్, ప్రయాణికుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని ఇందులో పలు ఫీచర్లు అందిస్తున్నారు.
కాంపాక్ట్ SUV సెగ్మెంట్ లో స్కోడా కైలాక్ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. యూరోపియన్ డిజైన్, డ్రైవింగ్ డైనమిక్స్ తో పాటు సేఫ్టీపై కూడా కంపెనీ దృష్టి పెట్టింది. చిన్న కుటుంబానికి, నగర ప్రయాణాలతో పాటు హైవే డ్రైవింగ్ చేసే వారికి మంచి కారుగా గుర్తింపు పొందింది.
మహీంద్రా XUV 3XO కూడా సేఫ్టీ విషయంలో మంచి గుర్తింపు పొందిన SUV. ఆకట్టుకునే డిజైన్‌తో పాటు మంచి క్యాబిన్ స్పేస్, అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉంటాయి. కుటుంబ అవసరాలకు తగ్గట్టుగా SUV కావాలనుకునేవారు ఈ మోడల్ బాగుంటుంది.
హ్యాచ్‌బ్యాక్ కొనాలని చూస్తున్న వారికి టాటా ఆల్ట్రోజ్ మంచి ఆప్షన్. ఇతర కార్లతో పోలిస్తే కాంపాక్ట్ గా ఉన్నప్పటికీ సేఫ్టీ విషయంలో నో కాంప్రమైజ్ అంటుంది. సిటీలో రోజువారీ ఉపయోగానికి సరిపోయే పరిమాణంతో పాటు కుటుంబ ప్రయాణాలకు అవసరమైన సౌకర్యాలు కూడా ఇందులో లభిస్తాయి.
రూ.10 లక్షల బడ్జెట్‌లో కారు కొనేటప్పుడు కేవలం ఎక్స్ షోరూమ్ ధరను మాత్రమే కాకుండా ఆన్-రోడ్ ధర, ఇన్సూరెన్స్, సర్వీస్ ఖర్చులు, సేఫ్టీ ఫీచర్లు, క్రాష్-టెస్ట్ రేటింగ్ వంటి అంశాలను కూడా పరిశీలించాలి. అయితే, కారు 5 స్టార్ రేటింగ్ పొందిందంటే అన్నివేళల్లో ప్రమాదం నుంచి పూర్తిగా రక్షణ ఉంటుందని అర్థం కాదు. సీట్ బెల్ట్ వాడటం, సరైన డ్రైవింగ్ చేయడం, స్పీడ్ కంట్రోల్ కూడా చాలా ముఖ్యం. ఫ్యామిలీ కోసం కారు ఎంచుకునే సమయంలో ధర కంటే ముందు సేఫ్టీకి ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.
Read Also: పెట్రోల్‌తో పాటు ఇథనాల్ తోనూ పరుగులు.. కియా సైరోస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు వచ్చేస్తోంది!