E-Paper
Advertisement

పెట్రోల్‌తో పాటు ఇథనాల్‌ తోనూ పరుగులు.. కియా సైరోస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు వచ్చేస్తోంది!

పెట్రోల్‌తో పాటు ఇథనాల్‌ తోనూ పరుగులు.. కియా సైరోస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు వచ్చేస్తోంది!
Advertisement

Kia Syros Flex-Fuel Concept Revealed: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ పై ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కియా మోటార్స్ కీలక అడుగు వేసింది. భారత్‌ లో తన తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్  వెహికల్ సైరోస్ FFV కాన్సెప్ట్‌ ను ఆవిష్కరించింది. సాధారణ పెట్రోల్‌ తో పాటు ఇథనాల్, పెట్రోల్–ఇథనాల్ మిశ్రమాలతో ఈ కారు నడిచేలా దీనిని రూపొందించారు. అయితే ఈ కాన్సెప్ట్‌ కు సంబంధించిన ప్రొడక్షన్ వెర్షన్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందనే విషయాన్ని కియా ఇంకా వెల్లడించలేదు.

మూడు రకాల ఫ్యూయల్ తో నడిచేలా..  

సాధారణ పెట్రోల్ కార్లతో పోలిస్తే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల ప్రత్యేకత వాటి ఇంధన వినియోగంలో ఉంటుంది. ఇంధనంలో ఇథనాల్ శాతం మారినా వాహనం పని చేసేలా ఇంజిన్, ఫ్యూయల్ సిస్టమ్‌ ను రూపొందిస్తారు. కియా సైరోస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కాన్సెప్ట్ కూడా పెట్రోల్, E100 ఇథనాల్, ఇథనాల్–పెట్రోల్ మిశ్రమాలను ఉపయోగించుకునే విధంగా అభివృద్ధి చేశారు. దీంతో భవిష్యత్తులో హై ఇథనాల్ మిశ్రమాల వినియోగం పెరిగినా ఈ వెహికల్ దానికి అనుగుణంగా పనిచేసే అవకాశం ఉంటుంది.

1.0 లీటర్ టర్బో ఇంజిన్

Advertisement

సైరోస్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కాన్సెప్ట్‌ లో 1.0 లీటర్, మూడు సిలిండర్ల డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. అయితే ఈ ఇంజిన్ ఎంత పవర్, ఎంత టార్క్ ఉత్పత్తి చేస్తుందో కియా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. పలు రకాల ఇథనాల్ మిశ్రమాలతో ఇంజిన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా పని చేసేందుకు కంపెనీ పలు మార్పులు చేసింది. ముఖ్యంగా ECU, TCU, ఫ్యూయల్ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేసినట్లు కియా తెలిపింది.

7-స్పీడ్ DCTకు బదులుగా 6-స్పీడ్ ఆటోమేటిక్

ప్రస్తుతం సాధారణ సైరోస్ టర్బో-పెట్రోల్ వెర్షన్‌లో 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్ ఉంటుంది. అయితే, ఫ్లెక్స్ ఫ్యూయల్ కాన్సెప్ట్‌ లో మాత్రం 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ను  ఉపయోగించారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీకి అనుగుణంగా పవర్‌ ట్రెయిన్‌ను మార్చడంలో భాగంగానే ఈ ట్రాన్స్‌ మిషన్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

భారత్‌లో పెరుగుతున్న ఫ్లెక్స్-ఫ్యూయల్ వెహికల్స్  

Advertisement

దేశంలో పెట్రోల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఇథనాల్ మిశ్రమ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. దీంతో వాహన తయారీ సంస్థలు కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీపై దృష్టి పెడుతున్నాయి. ఇప్పటికే మారుతి సుజుకి వాగన్ ఆర్ బయోఫ్లెక్స్ ను దేశంలోని తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారుగా పరిచయం చేసింది. దీని ధర రూ.7.24 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది.

E100 దిశగా భారత్

2026లో ప్రభుత్వం అధిక ఇథనాల్ మిశ్రమాలకు సంబంధించిన కొత్త ప్రమాణాలను నోటిఫై చేసింది. అనంతరం వాహనాల్లో E100 ఇంధన వినియోగానికి సంబంధించిన నిబంధనలను కూడా ఆమోదించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కియా సైరోస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కాన్సెప్ట్‌ కు ప్రాధాన్యం పెరిగింది. అయితే, ఇది ప్రస్తుతం కాన్సెప్ట్ దశలోనే ఉంది. ప్రొడక్షన్ వెర్షన్ ఎప్పుడు వస్తుంది? ధర ఎంత ఉంటుంది? సాధారణ సైరోస్‌తో పోలిస్తే ఎలాంటి మార్పులు ఉంటాయి? అనే విషయాలపై కియా నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read Also: కియా సోరెంటో వచ్చేసింది.. ఫార్చ్యూనర్‌ కు ఇక చుక్కలే!

Tags

Related News

హీరో, హోండాకు టీవీఎస్ షాక్.. ఆగస్టులో నంబర్ వన్ టూ వీలర్ కంపెనీగా రికార్డ్!

కొత్త కలర్స్‌ తో కవాసకి Z సిరీస్.. నయా లుక్ సూపరో సూపరు!

కియా సోరెంటో వచ్చేసింది.. ఫార్చ్యూనర్‌ కు ఇక చుక్కలే!

హిమాలయన్ 440 వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

టాటా కర్వ్‌ లో కొత్త సిరీస్ X.. తక్కువ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు!

హోండా ఫ్యాన్స్‌ కు గుడ్‌న్యూస్.. ఎలివేట్, సిటీ, అమేజ్‌పై అదిరిపోయే డిస్కౌంట్లు!

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

Big Stories

Advertisement
×