E-Paper
Advertisement

చూస్తేనే దిమ్మతిరిగిపోయే లుక్.. 16GB ర్యామ్‌తో వచ్చేస్తోన్న Xiaomi 18 Fold!

చూస్తేనే దిమ్మతిరిగిపోయే లుక్.. 16GB ర్యామ్‌తో వచ్చేస్తోన్న Xiaomi 18 Fold!
Advertisement

Xiaomi 18 Fold: స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న Xiaomi 18 Fold ఫోన్‌కు సంబంధించిన ఆసక్తికర వివరాలు నెట్టింట లీకయ్యాయి. బెర్లిన్‌లో జరిగిన ఐఎఫ్ఏ 2026 ఈవెంట్‌లో తొలిసారి మెరిసిన ఈ ఫోన్.. సెప్టెంబర్ 7న చైనాలో అధికారికంగా విడుదల కానుంది. ప్రీమియం లుక్‌తో రానున్న ఈ డివైజ్, టెక్ మార్కెట్‌లో కొత్త సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ సారి షావోమి డిజైన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ముఖ్యంగా ఈవెంట్‌లో ప్రదర్శించిన రెడ్ కలర్ వేరియంట్ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్ ముందు భాగంలో 6.56 అంగుళాల కవర్ డిస్‌ప్లే, లోపల 7.76 అంగుళాల భారీ మెయిన్ స్క్రీన్ ఉన్నాయి. రెండింటిలోనూ ఎల్‌టీపీఓ సాంకేతికతతో కూడిన 120Hz రీఫ్రెష్ రేట్ అందించడం వల్ల స్క్రీన్ స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది.

Advertisement

Also Read: ఆండ్రాయిడ్ 16తో వస్తున్న Motorola Edge 70 Plus.. ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ పక్కా!

Xiaomi 18 Fold పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. దీనిలో కొత్తగా ఎక్స్‌రింగ్ ఓ3 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. డెకాకోర్ డిజైన్‌తో వచ్చే ఈ ప్రాసెసర్ గేమింగ్, మల్టీటాస్కింగ్‌ను చాలా వేగంగా నడిపిస్తుంది. ఇందులో గరిష్టంగా 16GB ర్యామ్, 1TB స్టోరేజ్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. ఎంతటి భారీ యాప్‌లనైనా ఇది ఎలాంటి ఆటంకం లేకుండా రన్ చేస్తుంది.

Advertisement

ఫొటోగ్రఫీ ప్రేమికుల కోసం Xiaomi 18 Foldలో ఏకంగా 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అమర్చారు. దీనికి తోడుగా రెండు టెలిఫోటో లెన్స్‌లు ఇస్తుండటంతో జూమ్ ఫొటోలు చాలా స్పష్టంగా వస్తాయి. ఇక రోజంతా రన్ అవ్వడానికి వీలుగా 6,000mah భారీ బ్యాటరీని అందించారు. పెద్ద స్క్రీన్ వాడినా ఛార్జింగ్ త్వరగా అయిపోతుందనే భయం ఉండదు.

ప్రీమియం కేటగిరీలో వస్తున్న ఈ Xiaomi 18 Fold ధర చైనా మార్కెట్‌లో 10,000 యువాన్లు దాటవచ్చని అంచనా. అంటే మన భారత కరెన్సీలో దాదాపు రూ.1.40 లక్షల వరకు ఉండవచ్చు. ఇది మునుపటి మిక్స్ ఫోల్డ్ 4 కంటే కాస్త ఎక్కువ. పూర్తి వివరాలు, అధికారిక ధర సెప్టెంబర్ 7న జరిగే లాంచ్ ఈవెంట్‌లో స్పష్టంగా తెలియనున్నాయి.

Also Read: 6000mAh బ్యాటరీ, IP68 రేటింగ్.. ఈ ప్రైజ్ రేంజ్‌లో ఇలాంటి ఫోన్ రావడం ఇదే తొలిసారి!

Tags

Related News

హెల్తీ లైఫ్ కోసం కాపర్ vs ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్..ఏది బెస్ట్?

AirPods కంటే దుమ్మురేపే బేస్ కావాలా? ఈ 4 బెస్ట్ ఇయర్ బడ్స్‌పై ఒక లుక్కేయండి!

ఆండ్రాయిడ్ 16తో వస్తున్న Motorola Edge 70 Plus.. ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ పక్కా!

10000mAh బ్యాటరీ, 4K కెమెరాతో POCO X8 Series.. రూ.3,000 డిస్కౌంట్ ఆఫర్!

6000mAh బ్యాటరీ, IP68 రేటింగ్.. ఈ ప్రైజ్ రేంజ్‌లో ఇలాంటి ఫోన్ రావడం ఇదే తొలిసారి!

గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్‌కి పండగే.. ఆ ఫోన్ ధర రూ.13,300 తగ్గింది, ఈ డీల్ మిస్ అవ్వొద్దు!

హెల్దీగా తినాలని ఉందా? బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ ఇవే!

Big Stories

Advertisement
×