E-Paper
Advertisement

PSLలో మ‌రో అరాచ‌కం..డారిల్ మిచెల్ ఎంగేజ్మెంట్ రింగ్ దొంగిలించిన‌ పాక్ ఫ్యాన్స్‌

PSLలో మ‌రో అరాచ‌కం..డారిల్ మిచెల్ ఎంగేజ్మెంట్ రింగ్ దొంగిలించిన‌ పాక్ ఫ్యాన్స్‌
Advertisement

PSL 2026:  పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament ) ప్రారంభమైన నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక వివాదం తెరపైకి వస్తూనే ఉంది. నసీమ్ షా వివాదాస్పద పోస్టు నుంచి మొదలుకొని డేవిడ్ వార్నర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు వరకు అన్ని వివాదాలే చోటు చేసుకుంటున్నాయి. అయితే లేటెస్ట్ గా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ సందర్భంగా మరో దారుణం జరిగింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఆడుతున్న డారిల్ మిచెల్ ( Daryl Mitchell ) ఎంగేజ్మెంట్ రింగును ( wedding ring) పాకిస్తాన్ అభిమానులు దొంగతనం చేశారు. ఈ మేరకు మీడియా కాన్ఫరెన్స్ లోనే డారిల్ మిచెల్ ఈ విషయాన్ని స్వ‌యంగా రివీల్ చేశారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఈ న్యూస్ బయటకు రావడంతో క్రికెట్ అభిమానులు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ అభిమానులకు ఇంత కక్కుర్తి ఎందుకు ? అంటూ ఫైర్ అవుతున్నారు.

Also Read: ఐపీఎల్ నుంచి PSLలోకి రావ‌డానికి సిగ్గు అనిపించలేదా ? కుశాల్ మెండిస్ ప‌రువు తీసిన పాక్ రిపోర్ట‌ర్‌

డారిల్ మిచెల్ ఎంగేజ్మెంట్ రింగ్ దొంగిలించిన‌ పాక్ ఫ్యాన్స్‌

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. మ్యాచ్ లతో పాటు వివాదాలు కూడా రోజుకోటి చోటు చేసుకుంటుంది. అయితే తాజాగా మరో షాకింగ్ సంఘటన పాకిస్తాన్ సూపర్ 2026 టోర్నమెంట్ సందర్భంగా చోటు చేసుకుంది. PSL 2026 టోర్నమెంటులో రావల్పిండిజ్ జట్టు తరఫున ఆడుతున్న డారిల్ మిచెల్ ఉంగరాన్ని పాకిస్తాన్ అభిమానులు దొంగిలించారు. ఈ విషయాన్ని స్వయంగా డారిల్ మిచెల్ వెల్లడించారు. క్వెట్టా గ్లాడియేటర్స్ వర్సెస్ రావల్పిండిజ్ జట్ల మధ్య ఏప్రిల్ 10వ తేదీన కరాచీలోని నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఇందులో క్వెట్టా గ్లాడియేటర్స్ 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే రావల్పిండిజ్ జట్టు తరఫున ఆడుతున్న డారిల్ మిచెల్, మ్యాచ్ పూర్తయిన తర్వాత హోటల్ రూమ్ కు బయలు దేరాడు. ఈ క్రమంలో స్టేడియం బయట ఉన్న కొంత మంది అభిమానులకు అభివాదం చేశాడు.

అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ వచ్చాడు. ఈ క్రమంలో డారిల్ మిచెల్ ఉంగరాన్ని పాకిస్తాన్ అభిమానులు దొంగిలించినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన డారిల్ మిచెల్, తన ఉంగరాన్ని పాకిస్తాన్ అభిమానులు దొంగిలించినట్లు బాంబు పేల్చాడు. షేక్ హ్యాండ్ ఇస్తున్న సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి, దొంగతనం చేశాడని ఆరోపణలు చేశారు. ఇది తన ఎంగేజ్మెంట్ రింగ్ అని స్పష్టం చేశారు డారిల్ మిచెల్. ఇక ఈ సంఘటనకు సంబంధించిన న్యూస్ వైరల్ అయింది. దీనిపై క్రికెట్ అభిమానులు కౌంటర్లు పేల్చుతున్నారు. పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ ఇంత దిగజారారా ? విదేశీ క్రికెటర్లు వస్తే ఇలా మర్యాద చేస్తారా? అంటూ ఫైర్ అవుతున్నారు. పాకిస్తాన్ మొత్తం దొంగలే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

 

 

Also Read: Tanveer Ahmed: వైభ‌వ్ సూర్యవంశీ “ఇల్లీగ‌ల్ డ్ర‌గ్స్” తీసుకున్నాడు, వెంట‌నే విచార‌ణ చేయండి

 

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×