E-Paper
Advertisement

Best Cars Under 5 Lakh: ఆల్టో K10 To టియాగో.. రూ. 5 లక్షల్లోపు బెస్ట్ కార్లు ఇవే!

Best Cars Under 5 Lakh: ఆల్టో K10 To టియాగో.. రూ. 5 లక్షల్లోపు బెస్ట్ కార్లు ఇవే!
Advertisement

Best Cars Under 5 Lakh In India: కుటుంబ అవసరాల కోసం కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? బడ్జెట్ తక్కువగా ఉండాలనుకుంటున్నారా? మార్కెట్ లో తక్కువ ధరకు పలు కార్లు ఉన్నప్పటికీ, అందులో బెస్ట్ కార్లు ఏవనేది తెలియట్లేదా?  అయితే, మీకోసమే ఈ స్టోరీ. రూ. 5 లక్షల లోపు బెస్ట్ కార్ల లిస్టును ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాం. మారుతి ఎస్-ప్రెస్సో, మారుతి ఆల్టో K10, రెనాల్ట్ క్విడ్ ఈ బడ్జెట్ శ్రేణిలో బాగా పాపులర్ అయ్యాయి. వీటితో పాటు మరికొన్ని కార్లు కూడా రూ. 5 లక్షల లోపు అందుబాటులో ఉన్నాయి.  ఆయా కార్ల ధర, పోలికలు, నిపుణుల రివ్యూలు, వినియోగదారుల రేటింగ్ సహా పలు అంశాలను దృష్టిలో పెట్టుకుని రూ. 5 లక్షల లోపు బెస్ట్ కార్ల లిస్టును మీ ముందు పెడుతున్నాం. ఇందులో మీకు ఏది నచ్చిందో సెలెక్ట్ చేసుకోని కొనుగోలు చెయ్యొచ్చు.

రూ. 5 లక్షల లోపు టాప్ 5 కార్లు

⦿మారుతి సుజుకి ఆల్టో K10: రూ. 3.70 లక్షలు

Advertisement

మారుతి సుజుకి ఆల్టో K10 బేసిక్ వేరియంట్ ధర రూ. 3.70 లక్షలు.  1.0L పెట్రోల్  ఇంజిన్ ను కలిగి ఉంటుంది. ఇది లీటర్ కు 24-25 కి.మీ మైలేజ్ అందిస్తుంది. కీలక ఫీచర్ల విషయానికి వస్తే, AMT ఆప్షన్, ఎయిర్‌ బ్యాగ్స్, టచ్‌ స్క్రీన్, మంచి మైలేజ్ లభిస్తుంది. ఫస్ట్  టైమ్ బైయర్స్‌ కు బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.

⦿ మారుతి సుజుకి S-ప్రెస్సో: రూ.3.50 లక్షలు

Advertisement

మారుతి సుజుకి S-ప్రెస్సో ధర రూ. 3.50 లక్షలు. 1.0L పెట్రోల్  ఇంజిన్ ను కలిగి ఉంటుంది. మైలేజ్ 24-25 కి.మీ ఇస్తుంది. SUV లైక్ డిజైన్, CNG ఆప్షన్,  చిన్న ఫ్యామిలీకి చక్కగా సరిపోతుంది.

⦿ రెనాల్ట్ క్విడ్: రూ. 4.30 లక్షలు

రెనాల్ట్ క్విడ్ ధర రూ. 4.30 లక్షలు ఉంటుంది. ఇది 0. 8L పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. మైలేజ్ విషయానికి వస్తే లీటర్ కు 21-22 కి.మీ అందిస్తుంది. మెడియా నావ్, ఎస్కేలేటర్ AMT, స్పోర్టీ లుక్, మంచి పెర్ఫార్మెన్స్ ఉంటుంది. యంగ్ డ్రైవర్స్‌ కు ఐడియల్ గా ఉంటుంది.

⦿ టాటా టియాగో: రూ. 4.57 లక్షలు

టాటా టియాగో ధర రూ. 4.57 లక్షలు ఉంటుంది. 1.2L పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. మైలేజ్ లీటర్ కు 19-20 కి.మీ ఇస్తుంది. 4-స్టార్ NCAP సేఫ్టీ, హార్మన్ ఆడియో, బెస్ట్ ఇన్ క్లాస్ సురక్ష  ఫీచర్లు ఉంటాయి.

⦿ మారుతి వ్యాగన్ R:  రూ. 4.99 లక్షలు

మారుతి వ్యాగన్ R ధర రూ. 4.99 లక్షలు ఉంటుంది.  1.0L పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. మైలేజీ 24-25 కిలో మీటర్లు ఇస్తుంది. ఎయిరీ కేబిన్, CNG ఆప్షన్, టాల్ బాయ్ డిజైన్, మంచి స్పేస్, సిటీ యూజ్‌కు పర్ఫెక్ట్ గా ఉంటుంది. .

ఎందుకు ఈ కార్లు బెస్ట్?

⦿ మైలేజ్ & కాస్ట్: మారుతి మోడల్స్ 24+ కెఎంపిఎల్ ఇస్తాయి.  CNG ఆప్షన్‌ తో ఇంధన ఖర్చు మరింత తగ్గుతుంది.

⦿ సేఫ్టీ: టాటా టియాగో 4-స్టార్ రేటింగ్‌ తో  సేఫ్టీలో టాప్ గా ఉంటుంది. మిగతా మోడల్స్‌ లో డ్యూయల్ ఎయిర్‌ బ్యాగ్స్, ABS స్టాండర్డ్ ఉంటుంది.

⦿ ఫీచర్లు: టచ్‌ స్క్రీన్, బ్లూటూత్, పార్కింగ్ సెన్సర్స్ ఉంటాయి.

Read Also: మారుతి సుజుకి ఈ-విటారా వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×